Bandi sanjay: త్వరలో ఖమ్మంలో బహిరంగ సభ నిర్వహించనున్నామని కార్యకర్తలు నిరాశ చెందవద్దని తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. గురువారం ఖమ్మంలో జరగాల్సిన బహిరంగ సభను వాయిదా వేసినట్లు ఆయన మీడియాకు తెలిపారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మండిపడ్డారు. సీఎం కేసీఆర్ తన సెటిల్ మెంట్ కోసమే.. బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేసుకున్నట్లు బండి సంజయ్ ఆరోపించారు. అటు మంత్రి కేటీఆర్ నలుగురు బీజేపీ కార్పొరేటర్ లు టచ్ లో ఉన్నారు అని అంటున్నాడు.. మాతో 20 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారన్నారు. తాము రాజకీయ వ్యభిచారులం కాదని... బీజేపీలో చేరాలి అంటే రాజీనామా చేయాలన్నారు.
సిద్దిపేట జిల్లా కొహెడ మండలం పెద్ద సముద్రాల వద్ద సిద్దిపేట నుండి ఎల్కతుర్తి వరకు జరుగుతున్న జాతీయ రహదారి నిర్మాణ పనులను మాజీ కేంద్ర మంత్రి ప్రకాష్ జవదేకర్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పరిశీలించారు.