కరీంనగర్ జిల్లా మల్యాల మండలం ముత్యంపేటలో వివిధ మోర్చాల నేతలతో జరిగిన సమావేశంలో కేంద్ర మాజీమంత్రి ప్రకాశ్ జవదేకర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వన్ నేషన్ – వన్ రేషన్ నరేంద్ర మోడీ ప్రభుత్వం విధానమన్నారు. మూడేళ్లుగా 80 కోట్ల కుటుంబాలకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్న మోడీ సర్కార్ అని, తెలంగాణలో ఇచ్చేవి కేసీఆర్ బియ్యం కాదు….నరేంద్ర మోడీ బియ్యమని ఆయన వ్యాఖ్యానించారు. అంతేకాకుడా.. మస్కట్ లో కరోనా వ్యాక్సిన్ కోసం ఒక్కొక్కరు రూ.16 వేలు ఖర్చు చేస్తున్నారు. తెలంగాణసహా దేశవ్యాప్తంగా ఉచితంగా మోదీ కరోనా వ్యాక్సిన్ అందించారు. మోడీ వ్యాక్సిన్ మాత్రమే… కేసీఆర్ వ్యాక్సిన్ అంటే మద్యం. తెలంగాణలో లక్షలాది మంది రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద రూ.6 వేల చొప్పున అందిస్తున్నారు. తెలంగాణలో 11 లక్షల మందికిపైగా ఉజ్వల గ్యాస్ కనెక్షన్లు అందిస్తున్నారు. తెలంగాణలో 30 లక్షల టాయిలెట్లు కట్టించారు. ముద్ర లోన్లు ఇచ్చారు. 40 లక్షల మందికి ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా అమలవుతోంది.
Also Read : Rahul Gandhi: పరువునష్టం కేసు.. రాహుల్ గాంధీకి స్వల్ప ఊరట
మోడీ ప్రభుత్వ పథకాలవల్ల లబ్ది పొందిన వాళ్లంతా 8919847687 నెంబర్ కు మిస్డ్ కాల్ ఇచ్చి బీజేపీకి మద్దతు పలకండి. నిన్న కరీంనగర్ డెయిరీ ఛైర్మన్ రాజేశ్వర్ రావును కలిశాను. పేదలకు మాత్రమే కాదు.. నరేంద్రమోదీ ప్రభుత్వం ఆ డెయిరీకి రూ.10 కోట్ల లబ్ది చేకూర్చారు. మోడీ 9 ఏళ్ల పాలనను – కేసీఆర్ పాలనను బేరీజు వేయండి… మోడీ దేశ ప్రజలే కుటుంబంగా భావిస్తారు.. కేసీఆర్ మాత్రం తన కుటుంబమే పరివారంగా భావిస్తారు.
Also Read : Ayodya: దీపావళి నాటికి అయోధ్య రామ మందిరం గ్రౌండ్ ఫ్లోర్ పూర్తి..!
మోడీ కేబినెట్ లో ఏ ఒక్క మంత్రిపైనా అవినీతి మచ్చలేదు… కేసీఆర్ కేబినెట్ లో అవినీతి ఆరోపణలు లేని మంత్రులే లేరు… కేసీఆర్ ఇచ్చిన ఏ ఒక్క హమీలను అమలు చేయలేదు.. కేజీ టు పీజీ నుండి దళిత సీఎం, దళితులకు మూడెకరాలు, ఇంటికో ఉద్యోగం సహా హామీలు అమలు చేయకుండా మోసం చేశారు. 2024 ఎన్నికల్లో తెలంగాణలో 14 ఎంపీ సీట్లు బీజేపీ కైవసం చేసుకోవడం ఖాయం. నీళ్లు-నిధులు-నియామకాల నినాదానికి కేసీఆర్ నీళ్లొదిలారు… బీజేపీకి అవకాశమిస్తే… ‘‘నీళ్లు-నిధులు-నియామకాలు’’ నినాదాన్ని సాకారం చేసి తీరుతాం.’ అని ఆయన అన్నారు.