Bandi Sanjay : బండి సంజయ్‌కు జేఎన్ జేహెచ్ జర్నలిస్టుల వినతి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మా స్థలాలు మాకిప్పించండని, సుప్రీంకోర్టు తీర్పును కూడా కేసీఆర్ అమలు చేయడం లేదని, 15 ఏళ్లుగా పోరాడుతూ 50 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారని బండి సంజయ్ కు జేఎన్ జేహెచ్ జర్నలిస్టుల వినతి పత్రం అందజేశారు. న్యాయసహాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. ‘‘అన్నా… మేమంతా గత పాతికేళ్లుగా జర్నలిస్టులుగా పనిచేస్తున్నాం. 17 ఏళ్ల క్రితం రాష్ట్రస్థాయిలో పనిచేస్తున్న 11 వందల మంది జర్నలిస్టులమంతా కలిసి సొసైటీ గా ఏర్పడితే అప్పటి ప్రభుత్వం నిజాంపేట, పేట్ బషీరాబాద్ లలో 70 ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ఒక్కో జర్నలిస్టు అప్పు చేసి, పుస్తెలతాడు తాకట్టు పెట్టి 2 లక్షల చొప్పున అప్పటి మార్కెట్ ధర ప్రకారం సుమారు రూ.12 కోట్లను ప్రభుత్వానికి చెల్లించాం. ఈ స్థలాన్ని జర్నలిస్టులకు స్వాధీనం చేయాలని సాక్షాత్తు సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చి 9 నెలలు దాటినా ఈ ప్రభుత్వం ఇంతవరకు చర్యలు తీసుకోలేదు. ఎన్నిసార్లు ప్రభుత్వ పెద్దలను కలిసి విన్నవించిన ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికే మా సొసైటీలోని దాదాపు 60 మంది జర్నలిస్టులు తనువు చాలించారు. మీరైనా మా స్థలాలను మాకు ఇప్పించండి’’అంటూ జవహర్ లాల్ నెహ్రూ జర్నలిస్ట్స్ హౌజింగ్ సొసైటీ జర్నలిస్టులు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కు మొరపెట్టుకున్నారు.
Also Read : Mayapetika Trailer: నువ్వేమైనా పతివ్రతను పెళ్లి చేసుకున్నాను అనుకున్నావా..?
Also Read
- Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
- Modi-Xi Jinping: ‘ఈజ్ ఇట్ ఓకే?’.. షీ జిన్‌పింగ్‌ను చూసి ప్రసంగం ఆపిన మోడీ.. అసలేం జరిగిందంటే?
- Glaciers: వేడెక్కుతున్న భూమితో ఏం జరగబోతోంది?
- BRICS Currency: బ్రిక్స్ కరెన్సీపై భారత్ కీలక ప్రకటన.. కామన్ కరెన్సీపై ఫుల్ క్లారిటీ..!
కొద్దిసేపటి క్రితం సొసైటీ సభ్యులు అశోక్ రెడ్డి, బోడపాటి శ్రీనివాసరావు, లక్ష్మణ్ తదితరులు బండి సంజయ్ ను కలిసి ఈ మేరకు వినతి పత్రం అందజేశారు. తాము ఏళ్ల తరబడి పనిచేస్తున్నా సొంత ఇల్లు లేక కిరాయి కట్టలేక ఇబ్బంది పడుతున్నామని, అనేక జర్నలిస్టుల కుటుంబాలు రోడ్డున పడ్డాయని వాపోయారు. ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లి స్థలాలు ఇప్పించాలని, అవసరమైన న్యాయ సహాయం చేయాలని కోరారు. జర్నలిస్టుల బాధలను సానుకూలంగా విన్న బండి సంజయ్ కుమార్ పూర్తిగా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అందులో భాగంగా అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. అవసరమైన న్యాయ సహాయం అందిస్తామని చెప్పారు.
Also Read : Samantha: సమంత ఎందుకు అంత ఖరీదైన చెప్పులు వేసుకుంటుందో తెలుసా?
తాజావార్తలు
-
CM Revanth Reddy : ఉప్పల్ భగాయత్‌లో ఆర్యవైశ్య భవన్.. రేవంత్ కీలక వ్యాఖ్యలు
-
Vijayawada: అప్పులు.. ఈఎంఐలు.. ఆర్భాటపు జీవితం.. దొంగగా మారిన 22 ఏళ్ల బీటెక్ యువకుడు..
-
Flight Turbulence: టర్కిష్ ఎయిర్‌లైన్స్ TK663 విమానంలో తీవ్ర కుదుపులు.. మూడు సార్లు ల్యాండింగ్ విఫలం, చివరికి డైవర్ట్
-
Asia Cup 2026 Final: భారత్ vs శ్రీలంక ఫైనల్.. హెడ్ టు హెడ్, లైవ్ స్ట్రీమింగ్, టీమ్ డీటెయిల్స్ ఇవే!
-
Modi-Xi Jinping: ‘ఈజ్ ఇట్ ఓకే?’.. షీ జిన్‌పింగ్‌ను చూసి ప్రసంగం ఆపిన మోడీ.. అసలేం జరిగిందంటే?
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!