BJP Reverse Gear: బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహిస్తున్న దశాబ్ది వేడుకలకు వ్యతిరేకంగా బీజేపీ అనేక కార్యక్రమాలు (కౌంటర్ ప్రోగ్రామ్లు) నిర్వహించేందుకు సిద్ధమైంది. 21 రోజుల పాటు వివిధ అధికారిక కార్యక్రమాలపై శాఖలు, శాఖల వారీగా ప్రతికూల ప్రచారం (నెగటివ్ క్యాంపెయిన్) నిర్వహించాలని, నిరసనలతో (రివర్స్ గేర్) కేసీఆర్ ప్రభుత్వ తీరును తిప్పికొట్టాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
Bandi Sanjay letter to CM KCR: దశాబ్ది ఉత్సవాల సందర్భంగా బీఆర్ఎస్ పాలనలో సాధించిన ప్రగతిపై వాస్తవాలను ప్రజల ముందుంచాలని కోరుతూ ఎంపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ సీఎం కేసీఆర్ కు బహిరంగ లేఖ రాశారు.
Bandi sanjay: బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డాక.. అందరికి ఉచిత విద్య అందిస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో పాల్గొని జాతీయ జెండా ఎగురవేసారు.
ఎన్నికలొస్తుంటే డిక్లరేషన్ పేరుతో ఓట్లు దండుకుని మోసం చేసే పార్టీ బీజేపీ కాదు అని బండి సంజయ్ అన్నారు. బీసీ సబ్ ప్లాన్, డిక్లరేషన్ రూపకల్పన కోసం క్షేత్రస్థాయిలోకి వెళ్లి సలహాలు స్వీకరిస్తామన్నారు.
జూన్ ఒకటి నుంచి జూన్ 7 వరకు పార్లమెంట్ వారిగా మీడియా సమావేశాలు, సోషల్ మీడియా influencer లతో సమావేశం.. వికాస్ తీర్థ పేరుతో కేంద్ర అభివృద్ది సంక్షేమ పథకం విజిట్.. దీనికి కేంద్ర మంత్రి, జాతీయ నేతలు హాజరు అవుతారు అని బండి సంజయ్ పేర్కొన్నారు.
Bandi Sanjay: దారుస్సలాంలో కూర్చొని ఎంఐఎం ప్రేలాపనలు చేస్తోందని, దమ్ముంటే తెలంగాణ అంతటా పోటీ చేయాలని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ సవాల్ విసిరారు. బీఆర్ఎస్ ని చంకలేసుకొస్తారో, కాంగ్రెస్ తో కలిసి వస్తారో రండి, బీజేపీ సింహంలా సింగిల్ గా వస్తుంది, ఎంఐఎంకి డిపాజిట్లు కూడా రానీయకుండా చేస్తాం అని అన్నారు. ఇన్నేల్లుగా పాతబస్తీని ఎందుకు డెవలప్ చేయలేదని ఎంఐఎంని ప్రశ్నించారు. ముస్లిం యువకులకు పాస్ పోర్టు కూడా లేని పరిస్థితి ఎందుకు…
Asaduddin Owaisi: హైదరాబాద్ పాతబస్తీలో సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహిస్తామని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ గతంలో చేసిన వ్యాఖ్యలపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ ఫైర్ అయ్యారు.