తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకున్నారు.. ఆయనకు తెలంగాణ బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్, తదితరులు ఘనస్వాగతం పలికారు. అయితే కిషన్ రెడ్డి వెంట బండి సంజయ్ లేకపోవడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశమైంది. వీరిద్దరూ కలిసే హైదరాబాద్‌కు వస్తారని అందరు అనుకున్నారు. కానీ.. కిషన్ రెడ్డి ఒక్కరే రావడం పలు అనుమానాలకు దారి తీస్తుంది. అయితే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మీటింగ్ నేపథ్యంలో చివరి నిమిషంలో…
Gongidi Sunitha: మసీదులు తొవ్వుతా , గోరీలు తొవ్వుతా అంటే ఇలాగే ఉంటదని బండి సంజయ్ పై ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునీత హాట్ కామెంట్ చేశారు. యాదాద్రి జిల్లా గుండాల మండలంలోని బూర్జుబావి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఎమ్మెల్యే గొంగిడి సునీత శంకుస్థాపన చేశారు.
కేంద్ర మంత్రి పదవికి కిషన్ రెడ్డి రాజీనామా చేస్తారా? అలా అనిపిస్తోంది. ఇవాళ ఢిల్లీలో ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన జరగతున్న సమావేశానికి కూడా కిషన్ రెడ్డి దూరంగా ఉన్నారు. దీంతో సర్వత్రా పలు గుసగుసలు వినిపిస్తున్నాయి.
TS BJP: బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఢిల్లీలో బీజేపీలో వున్న పరిస్థితులపై హాట్ కామెంట్లు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆయన చేసిన చిట్ చాట్ (వీడియో బయటకు రావడం)తో మాట్లాడిన తీరుపై పార్టీ శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
బీజేపీ తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ సునీల్ భన్సల్ ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు. రెండు రోజుల పాటు పార్టీ సంస్థాగత వ్యవహారాలపై ఆయన సమీక్షించనున్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ను మారుస్తారనే ప్రచారం సాగుతుంది. ఈ నేపథ్యంలో నేడు బీజేపీ పార్టీ సంస్థాగత వ్యవహారాలపై సమావేశం నిర్వహిస్తుంది.
8న ఉదయమే వచ్చి గ్రౌండ్ లో ఉండాలని, కేసీఆర్ అంటే మోసం మోడీ గారు మన బాస్ అన్నారు తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్. ఇవాళ బీజేపీ సన్నాహక సమావేశంలో బండి సంజయ్ మాట్లాడుతూ.. మోడీ నన్ను శభాష్ అన్నారు.. నన్ను అంటే మిమ్ముల్ని అన్నట్టేనని పార్టీ శ్రేణులకు వెల్లడించారు. వరంగల్ లో మళ్ళీ శభాష్ అనాలని, బీఆర్ఎస్ కు ప్రత్యామ్నాయం బీజేపీనేనని ఆయన వ్యాఖ్యానించారు.