Bandi Sanjay: కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తో బండి సంజయ్ భేటీ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ భారతీయ జనతా పార్టీలో అనూహ్య మార్పులు చోటు చేసుకుంటున్నాయి. అయితే, బీజేపీ రాష్ట్ర మాజీ అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ కొద్ది సేపటి క్రితం రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను కలిశారు. న్యూఢిల్లీలో ఉన్న బండి సంజయ్ అశ్వీనీ వైష్ణవ్ కార్యాలయానికి వెళ్లి ఖాజీపేట(హసన్ పర్తి) నుంచి కరీంనగర్ కు కొత్త రైల్వే లైన్ ను నిర్మించాలని ఆయన కోరారు. దీంతో పాటు ఈనెల 8న వరంగల్ లో ఖాజీపేట వ్యాగన్ మ్యానుఫాక్చరింగ్ యూనిట్, పీవోహెచ్ కు సంబంధించి భూమి పూజ చేస్తున్న నేపథ్యంలో ఏర్పాట్లపై అశ్వినీ వైష్ణవ్, బండి సంజయ్ తో చర్చించారు.
Read Also: TS BJP: హైదరాబాద్ కు టీబీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి.. ఢిల్లీలోనే బండి సంజయ్
Also Read
- Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
- Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
- Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
- IRCTC Scam Case: లాలూ కుటుంబానికి బిగ్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ..
అనంతరం ఖాజీపేట(హసన్ పర్తి) నుంచి కరీంనగర్ కు కొత్త రైల్వే లైన్ నిర్మాణానికి సంబంధించి సత్వర చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా బండి సంజయ్ కోరారు. సానుకూలంగా స్పందించిన అశ్వినీ వైష్ణవ్ వెంటనే ప్రాజెక్ట్ సమగ్ర నివేదిక (డీపీఆర్)ను తెప్పించి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ మేరకు సంబంధిత అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఈ సమావేశంలో బండి సంజయ్ తో పాటు కేంద్ర జలవనరుల శాఖ సలహాదారు వెదిరే శ్రీరాంతో పలువురు నేతలు పాల్గొన్నారు.
Read Also: Virat Kohli: కోహ్లి ఆ షాట్పై ఇండియా-పాకిస్తాన్ ఫ్యాన్స్ ఫైట్..!
మరోవైపు తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డి హైదరాబాద్ కు చేరుకున్నారు.. ఆయనకు తెలంగాణ బీజేపీ ఎన్నికల నిర్వహణ కమిటీ ఛైర్మన్ ఈటల రాజేందర్, తదితరులు ఘనస్వాగతం పలికారు. అయితే కిషన్ రెడ్డి వెంట బండి సంజయ్ లేకపోవడంతో తెలంగాణ పాలిటిక్స్ లో తీవ్ర చర్చనీయాంశమైంది. వీరిద్దరూ కలిసే హైదరాబాద్‌కు వస్తారని అందరు అనుకున్నారు. కానీ.. కిషన్ రెడ్డి ఒక్కరే రావడంతో పలు అనుమానాలకు దారి తీసింది. అయితే కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్‌తో మీటింగ్ నేపథ్యంలో చివరి నిమిషంలో బండి సంజయ్ హస్తినలోనే ఆగిపోయారు. కాగా.. తెలంగాణ బీజేపీ నేతలు కీలక సమావేశంలో పాల్గొన్నారు.
తాజావార్తలు
-
Osama Bin Laden: రేపటితో 9/11 ఘటనకి 25 ఏళ్లు.. బిన్ లాడెన్ ఎలా హతమయ్యాడు.. కుటుంబం ఎక్కడుంది?
-
Raghav Chadha: ఆప్ నా “ఎక్స్-గర్ల్‌ఫ్రెండ్”.. రాఘవ్ చద్దా ఫైర్..
-
MP Mithun Reddy: వైసీపీదే హవా.. నెల్లూరులో మిథున్ రెడ్డి ధీమా
-
Saudi Arabia-Pakistan: మక్కా ఒప్పందానికి బీటలు.. సౌదీకి హ్యాండిచ్చిన పాకిస్థాన్!
-
1980s Trend : 1980s ట్రెండ్ పేరుతో ఫేక్ యాప్స్.. నెటిజన్లకు సైబర్ కేటుగాళ్ల టార్గెట్
ట్రెండింగ్
-
Sapta Jyotirlinga Darshan Yatra: 11 రోజులు.. 7 పవిత్ర జ్యోతిర్లింగాల దర్శన భాగ్యం..! సప్త జ్యోతిర్లింగ యాత్ర.. వివరాలు ఇదిగో.!
-
1980s Photo: మీ ఫొటో 1980s లుక్‌లో ఎలా ఉండేదో చూడాలా?.. ChatGPT ఇంగ్లీష్ ప్రాంప్ట్స్ ఇవిగో..
-
Meta Muse లాంచ్..! ఒక్క మాట చెబితే చాలు.. మీ తరఫున పనులు చేసే AI ఏజెంట్..!
-
Ishan Kishan Record: ఒకే మ్యాచ్‌లో 350 పరుగులు.. తొలి బ్యాటర్‌గా ఇషాన్ కిషన్ నయా చరిత్ర!
-
రూ.14,900కే Apple AirPods 5.. ANCతో అదిరిపోయే ఫీచర్లు.! ధర ఎంతంటే?