TS BJP: బండిపై రఘునందన్ వ్యాఖ్యలు.. హైకమాండ్ కు చేరిన ఇష్యూ
- Follow Us :
-
-
Add as a preferred
source on google
TS BJP: బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు ఢిల్లీలో బీజేపీలో వున్న పరిస్థితులపై హాట్ కామెంట్లు సంచలనం సృష్టిస్తున్నాయి. ఆయన చేసిన చిట్ చాట్ (వీడియో బయటకు రావడం)తో మాట్లాడిన తీరుపై పార్టీ శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఆయన చేసిన కామెంట్స్ ను ట్రాన్స్లేట్ చేసి పార్టీ హై కమాండ్ కు పంపించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా, ఇంఛార్జి తరుణ్ చుగ్ దృష్టికి ఇష్యూ చేరింది. అమిత్ షా, నడ్డాలను టార్గెట్ చేసుకుంటూ మాట్లాడినా.. చర్యలు ఉండవా అని పార్టీ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే.. ఇంత జరుగుతున్నా.. ఇంకా ముంబై లోనే ఉన్న బండి సంజయ్ ఉన్నారని టాక్.. దీనిపై హైకమాండ్ తో మాట్లాడేందుకు ఈరోజు ఢిల్లీ వెళ్లే అవకాశం ఉందని ఆయన సన్నిహితులు అంటున్నారు.
బీజేపీ నేత, దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు బీజేపీలో పరిస్థితులపై హాట్ కామెంట్లు కలకలం సృష్టిస్తున్నాయి. తనకు పార్టీలో సరైన గుర్తింపు ఇవ్వాలని డిమాండ్ చేశారు.. మూడు పదవుల్లో ఏదో ఒక పదవి ఇవ్వాల్సిందే అనే తరహాలో.. పార్టీ అధ్యక్ష పదవి, ఫ్లోర్ లీడర్.. లేదంటే జాతీయ అధికార ప్రతినిధి ఇవ్వండి అంటూ స్పష్టం చేశారు. తాను పదేళ్ల నుంచి పార్టీ కోసం పని చేస్తున్నా, నేనెందుకు అధ్యక్ష పదవికి అర్హుడిని కాదు? అని ప్రశ్నించారు రఘునందన్.. కొన్ని విషయాల్లో నా కులమే నాకు శాపం కావచ్చు అంటూ ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. రెండు నెలల్లో బీజేపీ ఎలా ఉంటుందో అందరికీ తెలుస్తుందన్నారు.. రెండో సారి దుబ్బాక నుంచి ఎమ్మెల్యే గా గెలుస్తా అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు. నేను పార్టీలో ఉండాలని అనుకుంటున్నా అని స్పష్టం చేశారు.. 100 కోట్లు ఖర్చుపెట్టినా మునుగోడులో గెలవలేదు.. అదే 100 కోట్లు నాకిస్తే తెలంగాణను దున్నేసేవాణ్ణి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. దుబ్బాకలో నన్ను చూసే గెలిపించారు.. కేసీఆర్‌ను కొట్టె మొగోణ్ణి నేనేనని జనాలు నమ్మారని.. అంతేకాని బీజేపీని చూసి కాదు అంటూ తేల్చేశారు.
Also Read
- Telangana Drought: తెలంగాణలో కరవు టెన్షన్.. ఎల్‌నినో ప్రభావంపై సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్
- Bathukamma : రంగురంగుల పువ్వులతో విరబూసిన మార్కెట్లు.. భగ్గుమంటున్న ధరలు
- RIMS infant Deaths : రిమ్స్‌లో ఐదుగురు శిశువుల మృతి.. ఎలుకలు ఏసీ వైర్లు కొరకడంతోనే ప్రమాదం..
- Uppal T20 Match : ఉప్పల్ టీ20 టికెట్ల గోల్మాల్.. ఆన్లైన్లో సోల్డ్ ఔట్, హెచ్‌సీఏ ఏమంటోంది.?
నాకంటే ముందు దుబ్బాకలో బీజేపీ పోటీచేస్తే వచ్చింది 3500 ఓట్లు మాత్రమేనని గుర్తుచేశారు రఘునందన్.. ఇక, బండి సంజయ్ ది స్వయం కృతాపారాధం అంటూ హాట్ కామెంట్లు చేశారు.. పుస్తెలు అమ్మి ఎన్నికల్లో పోటీచేసిన సంజయ్ కి వంద కోట్లు పెట్టి యాడ్స్ ఇచ్చేంత డబ్బు ఎక్కడిది? అని నిలదీశారు.. పార్టీ డబ్బులో నాకు వాటా ఉంది. పేపర్ ప్రకటనలో తరుణ్ చూగ్, సునీల్ బన్సల్ ల బొమ్మలు కాదు రఘునందన్, ఈటల రాజేందర్ బొమ్మలుంటే ఓట్లు వేస్తారు. పార్టీ గుర్తు చివరి అంశమే అన్నారు. GHMC ప్లోర్ లీడర్ కావాలని అడిగిఅడిగి దేవర కర్నాకర్ చనిపోయాడు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. పార్టీకి శాసన సభపక్ష నేత లేడనే విషయం జేపీ నడ్డాకు తెలియదన్న ఆయన.. నేను గెలిచినందుకే ఈటల రాజేందర్ పార్టీలోకి వచ్చారన్నారు.. బండి సంజయ్ మార్పుపై అడిగితే.. మీడియాలో వస్తున్నవన్నీ నిజాలే అన్నారు రఘునందన్.. ఇక, పదేళ్లలో పార్టీకోసం నాకంటే ఎక్కువ ఎవరు కష్టపడలేదని చెప్పుకొచ్చారు దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్‌రావు. కాగా, గత కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు రఘునందన్.. ఈ మధ్యే.. ఈటల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కూడా హస్తిన వెళ్లి బీజేపీ పెద్దలను కలిశారు.. తాము చెప్పాల్సిందంతా చెప్పామని స్పష్టం చేశారు. మరోవైపు సీయర్ నేతలు సోషల్ మీడియా వేదికగా పెట్టిన పోస్టులు కూడా పార్టీలో హీట్ పెంచాయి.. ఈ తరుణంలో బీజేపీ కేంద్ర నాయకత్వం.. తెలంగాణ పార్టీ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
200MP పెరిస్కోప్ కెమెరా, 7 ఏళ్ల సాఫ్ట్వేర్ అప్డేట్స్ తో రాబోతున్న Motorola Signature 27..!
-
MS Dhoni: ఐపీఎల్ బెట్టింగ్ కేసు.. ఎంఎస్ ధోనీకి హైకోర్టు నోటీసులు!
-
Shreyas Iyer: “ఆ ఇద్దరి వల్లే మ్యాచ్ ఓడిపోయాం”.. కెప్టెన్ సంచలన వ్యాఖ్యలు..
-
Saturday Horoscope: శనివారం దిన ఫలాలు.. ఆ రాశుల వారికి పట్టిందల్లా బంగారమే!
-
CJP Protest: ఢిల్లీలో హై అలర్ట్.. ఇంటర్నెట్ బంద్, మెట్రో స్టేషన్ల మూసివేత.. రంగంలోకి 35,000 మంది భద్రతా సిబ్బంది
ట్రెండింగ్
-
Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!