Bandi Sanjay Resigned As BJP State President: తెలంగాణ బీజేపీలో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. గత కొన్ని రోజుల నుంచి అధ్యక్ష పదవిపై జరుగుతున్న ప్రచారాలు నిజమే అయ్యాయి. అధ్యక్ష పదవి నుంచి బండి సంజయ్‌ను తొలగించి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా నియమించారు. దీంతో.. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి బండి సంజయ్ రాజీనామా చేశారు. ఢిల్లీలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో భేటీ అయిన అనంతరం.. బండి సంజయ్ తన రాజీనామాను ప్రకటించారు. మరికొన్ని నెలల్లోనే ఎన్నికల సమీపిస్తున్న తరుణంలో.. అధ్యక్ష పదవికి సంబంధించి మార్పులు చేయడం వెనుక గల కారణాలేంటో బండి సంజయ్‌కి జేపీ నడ్డా వివరించారు. ఇకపై ఆయన సేవల్ని పార్టీ పెద్దలు కేంద్రంలో వినియోగించుకోనున్నట్టు తెలిసింది.
NCP Crisis: బీజేపీతో కలవాలని ఎమ్మెల్యేలంతా శరద్ పవార్‌ని కోరారు.. ప్రఫుల్ పటేల్ సంచలన వ్యాఖ్యలు..
ఒక్క తెలంగాణలోనే కాదు.. పలు రాష్ట్రాల అధ్యక్షులను సైతం బీజేపీ అధిష్టానం మార్చింది. ఏపీలో సోము వీర్రాజుని తొలగించి, ఆయన స్థానంలో మాజీమంత్రి దగ్గుబాటి పురందేశ్వరిని ఏపీ బీజేపీ అధ్యక్షురాలిగా నియమించారు. దీంతో.. జులై 4వ తేదీన మధ్యాహ్నం తన పదవికి రాజీనామా చేశారు సోము వీర్రాజు. మీ టర్మ్ అయిపోయిందని, అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని జేపీ నడ్డా తనకు స్వయంగా ఫోన్ చేసి చెప్పారని సోము వీర్రాజు అన్నారు. కొత్త బాధ్యతల్ని అప్పగిస్తామని తనకు హామీ కూడా ఇచ్చినట్లు వెల్లడించారు. కాగా.. 2020 జులై 27వ తేదీ సోము వీర్రాజు ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టి, 2023 జులై 4వ తేదీ వరకు ఆ పదవిలో కొనసాగారు.
Harbhajan Singh: నిన్న విషెస్.. ఇవాళ ట్రోల్స్.. ఏంటీ భజ్జీ ఇలా చేశావు..!