తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఓ ప్రకటన విడుదల చేశారు. బక్రీద్ సందర్భంగా ధర్మపురిలో నిన్న(గురువారం) పట్టపగలే అందరూ చూస్తుండగా గోమాతను వధించిన కేసులో బాధ్యుడైన కౌన్సిలర్ పై కేసు నమోదు చేయకపోవడం దుర్మార్గమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. పోలీస్ స్టేషన్ లో ఈ విషయంపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోకపోగా, ఆందోళన చేసిన వారినే అరెస్ట్ చేయడం అన్యాయమని మండిపడ్డారు.
తాజాగా విజయశాంతి.. తన ట్విట్టర్ అకౌంట్ లో రాజాసింగ్ సస్పెన్షన్‌పై సంచలన పోస్ట్ చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్ సస్పెన్షన్ అంశంలో బీజేపీ నిర్ణయం కొంత ఆలస్యమవుతున్నట్లు మన కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారని ఆమె తెలిపారు. అయితే, బండి సంజయ్ తో సహా తెలంగాణ రాష్ట్ర పార్టీ అంతా ఆ సస్పెన్షన్ తియ్యబడాలని మనస్సుపూర్తిగా కోరుకుంటున్నామని విజయశాంతి వెల్లడించింది.
భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు క్షీణించాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మొన్న హైదరాబాద్ లో ఒకే రోజు 5 హత్యలు చోటు చేసుకున్నాయని.. నిన్న సూర్యాపేటలో పట్టపగలే దారుణ హత్య జరిగిందని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహబుబ్ నగర్ జిల్లా ఆత్మకూర్ బీజేపీ బహిరంగ సభలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్, ఇతర నేతలు పాల్గొన్నారు. సభలో ఆయన మాట్లాడుతూ.. మహాజన్ సంపర్క్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా రాష్టంలోని అన్ని నియోజకవర్గాలలో మహాసభలు పెడుతున్నట్లు తెలిపారు. బీజేపీ 9 ఏళ్లలో చేసిన అభివృద్దిని ప్రజలకు చేరువ చేయడమే కార్యక్రమం ఉద్దేశ్యమన్నారు. నరేంద్ర మోడీ ప్రధానిగా వుండటం మనం చేసుకున్న అదృష్టమని బండి సంజయ్ అన్నారు. దేశ ప్రధాని బాత్ రూంల గురించి మాట్లాడితే…
గేదెను ట్రాలీ ఎక్కిస్తున్న ఓ వీడియోను షేర్ చేశారు మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి.. గేదెను ట్రాలీకి కట్టి.. దానిని వెనకనుంచి తన్నగానే వెంటనీ ట్రాలీలోకి ఎక్కేసింది.. ఇక, ఇలాంటి ట్రీట్మెంట్ బీజేపీ రాష్ట్ర నాయకత్వానికి అవసరం అంటూ ఆయన కామెంట్ రాసుకొచ్చారు.. అంతేకాదు.. బీజేపీ జాతీయ నాయకత్వం, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, బీఎల్ సంతోష్, తెలంగాణ బీజేపీని ట్యాగ్ చేసి ఆ ట్వీట్ చేశారు.
నేడు పీవీ నర్సింహారావు జయంతి సందర్భంగా పీవీ ఘాట్ లో బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ వెళ్లారు. పీవీ నర్సింహారావుకు ఘనమైన నివాళులు ఆర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. పీవీ చరిత్ర ఘనమైనది.. దక్షిణ భారతం నుంచి ప్రధాన మంత్రి అయిన ఏకైక వ్యక్తి పీవీనే అని ఆయన పేర్కొన్నారు.
Etela Rajender: ఈటల రాజేందర్ దంపతులు మంగళవారం మీడియా ముందు హాజరుకానున్నారు. సంచలన ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఏదో పెద్ద ప్రకటన చేయబోతున్నారు. రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్న ప్రస్తుత తరుణంలో.. ఈటల రాజేందర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? ప్రెస్ మీట్ లో ఏం చెప్పబోతున్నారు? అనేది హాట్ టాపిక్‌గా మారింది. ఢిల్లీ నుంచి వచ్చిన తర్వాత కాస్త విశ్రాంతి తీసుకుని భార్యతో చర్చించి తుది నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. దీనిపై ప్రెస్ మీట్ పెట్టి…