గాంధీ భవన్ లో కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో భూమి డిక్లరేషన్ ను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. ధరణి పోర్టల్ వెనక పెద్ద గూడు పుటాని జరిగింది.. రోజుకోకటి బయట పెడతామని ఆయన అన్నారు. ధరణి పోర్టల్ టేరసీసీ కంపనీ వెనుక.. ఫిలిప్పీన్.. దాని వెనక అమెరికా కంపెనీలు వచ్చాయన్నారు. విదేశీయులు ధరణి పోర్టల్ నడుపుతున్నారు అని టీపీసీసీ చీఫ్ ఆరోపించారు. ఆ కంపనీ వివరాలు ఇవ్వండి అని అమెరికాని అడిగినా ఇవ్వడం లేదు.. దేశంలో ఏ సంస్థ వ్యాపారం చేసినా లబ్ధిదారులు ఎవరు అనేది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చెప్పాలి.. ఒక్క శాతం మాత్రమే.. ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న కంపనీ చేతిలో ఉంది.
Also Read: Breastfeeding: తల్లికి షుగర్ ఉంటే బిడ్డకు పాలు ఇవ్వొచ్చా?
ఇది మంత్రి కేటీఆర్ మిత్రుడు శ్రీధర్ గాదె దగ్గర ధరణికి ఉంది.. అర్ధరాత్రి పూటా… యజమానులను సృష్టించి భూమి కొల్లగొడుతున్నాడు అని రేవంత్ రెడ్డి అన్నారు. ధరణిని నడిపే వాడు.. ఎవడో తెలియదు.. ప్రభుత్వ భూములు.. మన భూముల వివరాలు విదేశీయుల చేతుల్లోకి వెళ్లిపోయింది. ఇది అత్యంత తీవ్రమైన నేరం అని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. గజ్వెల్ లో 1500 ఎకరాల అసైన్డ్ భూములను ప్రభుత్వం లాక్కుంది.. దాన్ని ఆముల్ డైరీకి ఇచ్చాడు.. గంగుల కమలాకర్ కంపనీకి కూడా భూములు ఇచ్చారంటూ మండిపడ్డారు.
Also Read: Maamannan :జూలై 14న తెలుగులో నాయకుడు’గా మామన్నన్ రిలీజ్
దేవాదాయ భూములు.. ఫార్మ కంపనీకి ఇస్తే.. హైకోర్టు తప్పు పట్టింది అని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ధరణిపై.. కేసీఆర్, కేటీఆర్ సర్వం కోల్పోయిన వాళ్ళు ఏడ్చినట్టు ఏడుస్తున్నారని ఆయన అన్నారు. ధరణి విషయంలో మమల్ని తీడుతున్నారంటే కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని తండ్రి, కొడుకులు ఒప్పుకున్నట్లే.. అధికారంలోకి వచ్చే పార్టీ ధరణి పోర్టల్ ను తీసేస్తామంటే తండ్రికొడుకులు ఎందుకు ఏడుస్తున్నారని రేవంత్ ప్రశ్నించారు. మీ కుటుంబ సభ్యులు.. చీకటి సామ్రాజ్యంతో చేసుకున్న ఒప్పందం బయట పడుతోందా అని ఆయన అడిగారు. కేసీఆర్ అక్రమాలపై.. అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెసెంటిషన్ ఇస్తానని రేవంత్ పేర్కొన్నారు.
Also Read: Gurukul School: ప్రభుత్వ పాఠశాలల్లో ఇద్దరు చిన్నారులకు పాముకాట్లు.. ఆందోళనలో తల్లిదండ్రులు
బీజేపీ కొత్త అధ్యక్షుడు కిషన్ రెడ్డికి రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. ధరణిలో ఉన్న కంపనీలు ఏంటో బయట పెట్టాలి అని ఆయన డిమాండ్ చేశారు. కేసీఆర్ అంటే.. కిషన్ చెంద్రశేఖర్ రెడ్డి అని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. ధరణి కొనసాగిస్తాం అని బండి సంజయ్ చెప్పాడు.. కానీ కిషన్ రెడ్డి.. కేసీఆర్ ని కంటిన్యూ చేస్తానని అంటున్నాడు అని రేవంత్ అన్నారు. కేటీఆర్ ఢిల్లీ పర్యటనలో బీజేపీలో మార్పులు చేర్పుల గురించి చెప్పాడు.. వాళ్లకు అనుకూలంగా మార్పులు చేసుకున్నారు. బీసీ నాయకులకు సమావేశాలు పెట్టుకోండి అని మేమే చెప్పాం.. ముందు బీసీ నియోజకవర్గాల సీట్లనే ప్రకటిస్తామన్నాడు. అధిష్టానం కూడా తనకు అదే సూచన చేసిందని రేవంత్ అన్నారు.