భారతీయ జనతా పార్టీ నేతలకు సవాల్ విసిరారు తెలంగాణ వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్ రెడ్డి.. సాగు, ధాన్యం కొనుగోళ్ల విషయంలో టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుండగా.. ఇవాళ మీడియాతో మాట్లాడిన ఆయన.. బీజేపీకి సవాల్ విసిరారు.. ఇవాళ సాయంత్రం 5 గంటల లోపు కేంద్రం నుంచి తెలంగాణలో యాసంగిలో వేసే ఏ పంట అయిన కొంటాం అని ఉత్తరం తీసుకురావాలన్నారు.. ఒక వేళ లెటర్ తీసుకురాకపోతే పదవులకు బండి సంజయ్, కిషన్ రెడ్డి…
హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్ మాట్లాడినవన్నీ పచ్చి అబద్దాలే అంటూ ఆరోపించారు. 2 నెలల ముందు ఇదే ప్లీనరీ పెడితే కేసీఆర్ ఆడే అబద్దాలకు ఆస్కార్ వాళ్లు అవార్డు ఇచ్చే వాళ్లు అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు హుజూరాబాద్ లో ముఖం చెల్లక…
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హుజురాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి బల్మూరి వెంకటకు మద్దతుగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మీడియా సమావేశంలో మాట్లాడిన రేవంత్ రెడ్డి తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ పై పలు వ్యాఖ్యలు చేశారు. కరీంనగర్ పట్టణంలో మురళీధర్ రావు ఫ్లెక్సీ పెట్టారు.. కానీ స్టాంప్ సైజులోనైనా సంజయ్ బొమ్మ కూడా పెట్టలేదు.. విద్యాసాగర్ రావు, మురళీధర్ రావు.. లు నిన్ను ఎంత చిన్నచూపు చూస్తున్నారో బండి…
టీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌పై తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి ఆరోపణలు చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆర్.ఆర్.ఆర్(RRR) సినిమా గురించి ప్రస్తావించారు. నవంబర్ 2న RRR సినిమా స్పెషల్ షో ప్రగతి భవన్ ముందు కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. ఆరోజు హుజురాబాద్ ఉప ఎన్నిక ఫలితం రానుందని.. ఆరోజు బాక్స్ బద్దలు అవుతుందన్నారు. అయితే బండి సంజయ్ RRR సినిమా అంటే రాజమౌళి సినిమా అనుకుంటే మీరు పప్పులో కాలేసినట్లే. అసలు బండి సంజయ్ RRR…
సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగాల భర్తీ కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తా అని నిరుద్యోగ అభ్యర్థులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు,ఎంపీ బండి సంజయ్ కుమార్ హామీ ఇచ్చారు. సమగ్ర శిక్ష అభియాన్ లో 704 పోస్టుల భర్తీకి సంబంధించిన నియామక ప్రక్రియ ఏడాదిన్నరగా జాప్యం జరుగుతుండటంపట్ల ఎంపీ బండి సంజయ్ ఆవేదన వ్యక్తం చేశారు. తక్షణమే ఈ అంశాన్ని ప్రభుత్వం ద్రుష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారమయ్యేలా ఒత్తిడి తెస్తానని సమగ్ర శిక్ష అభియాన్ పరీక్ష రాసి ఫలితాల…
రాష్ట్ర ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు.. తెలంగాణకు దసరా ఒక ప్రత్యేకమైన వేడుకగా అభివర్ణించిన ఆయన.. ఎంచుకున్న లక్ష్యాన్ని చేరుకునే వరకు విశ్రమించ కూడదనే స్ఫూర్తితో చెడు మీద మంచి విజయానికి సంకేతంగా విజయ దశమిని జరుపుకుంటారని తెలిపారు.. ఇక, ఆయురారోగ్యాలు, సిరి సంపదలతో జీవించేలా తెలంగాణ ప్రజలను దీవించాలని దుర్గామాతను దసరా సందర్భంగా ప్రార్థించినట్టు తెలిపారు సీఎం కేసీఆర్.. మరోవైపు.. తెలంగాణ ప్రజలకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ.. ప్రజలంతా…
ఈ సారి ‘మా’ ఎన్నికలు రసవత్తరంగా సాగాయి.. సాధారణ ఎన్నికల తరహాలో ఎన్నో హైడ్రామాలు నడిచాయి.. మొత్తంగా ఎన్నికల కోలాహలం ముగిసి.. ఫలితాలు కూడా వచ్చాయి.. ఈ ఎన్నికల్లో అనేక అంశాలు తెరపైకి వచ్చినా.. మా అధ్యక్ష బరిలోకి దిగిన ప్రకాష్రాజ్పై ఘన విజయం సాధించారు మంచు విష్ణు.. మా ఎన్నికలను రాజకీయ నేతలను కూడా ప్రభావితం చేస్తున్నారనే చర్చ కూడా సాగింది. అయితే, మా ఎన్నికలపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు…
ఆదివారం జరిగిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల ఫలితాలు బీజేపీ వర్గాలలో ఆనందాన్ని నింపాయి. దానికి ఆ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఫలితాల అనంతరం పోస్ట్ చేసిన ట్విట్ ఉదాహరణ. ‘జాతీయ వాద వ్యతిరేక శక్తుల్ని చిత్తుగా ఓడించిన ‘మా’ ఓటర్లకు ధన్యవాదాలు’ అని చెబుతూనే, ‘దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనుకున్న తుకుడే గ్యాంగ్ కు మద్దతిచ్చిన వారికి సరైన గుణపాఠం జరిగింది’ అని బండి సంజయ్ వ్యాఖ్యానించడంతో ఆ పార్టీకి ప్రకాశ్ రాజ్…
ప్రజా సంగ్రామ యాత్ర బీజేపీ రాష్ట్ర సారథి బండి సంజయ్కు కొత్త పాఠాలు నేర్పిందా? ప్రజల సమస్యలతోపాటు.. సొంత పార్టీలోని సమస్యలు బోధపడ్డాయా? బీజేపీ కోసం పనిచేసే వారు ఎవరు? శల్య సారథ్యం చేస్తోంది ఎవరో గుర్తించారా? కాషాయ శిబిరంలో జరుగుతున్న చర్చ ఏంటి? పాదయాత్ర ఎన్నో పాఠాలు నేర్పిందట..! బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మొదటి విడత ముగిసిన తర్వాత పార్టీవర్గాల్లో జరుగుతున్న చర్చ ఆసక్తిగా మారింది. ఈ…
తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ… స్వాతంత్ర్యo వచ్చిన 70 ఏళ్లలో 60 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ పాలించింది. 60 ఏళ్ళు మీరు ఏం చేశారు అని ప్రశ్నించారు. ఫ్లోరైడ్ తో నల్గొండ అతలాకుతలం అయింది. కాంగ్రెస్ పార్టీ పాపాలు పెరిగినట్టు ఫ్లోరోసిస్ పెరిగింది. మంచి నీటిని అందిస్తున్న కేసీఆర్ పైన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇక తెలంగాణ మొదటి ద్రోహి రేవంత్ రెడ్డి అని అన్నారు. జంగ్ లేదు బొంగు లేదు…