తెలంగాణలోని హుస్నాబాద్‌లో బండి సంజయ్ మొదటి విడత పాదయాత్ర పూర్తైన సందర్భంగా భారీ సభను ఏర్పాటు చేశారు. ఈ సభకు కేంద్రమంత్రి స్మృతి ఇరానీ హాజరయ్యారు. ఈ సభలో తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇది బీజేపీ స్వాగత సభ అని, బీజేపీ అధికారంలోకి వస్తే వైద్యం, విద్య విషయంలో మొదటి సంతకం చేస్తామని అన్నారు. 2023లో బీజేపీ అధికారంలోకి వస్తుందని, అందరికీ ఉచితంగా వైద్యం అందిస్తామని, స్కూళ్లను అభివృద్ధి చేస్తామని…
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర మొదటి విడత ఇవాళ్టితో ముగియనుంది.. ఈ సందర్భంగా హుస్నాబాద్ లో రోడ్ షో, ముగింపు సభ నిర్వహణకు బీజేపీ శ్రేణులు ఏర్పాట్లు చేస్తున్నాయి.. ఇక, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి స్మృతీ ఇరానీ రాబోతున్నారు.. మెత్తం 36 రోజుల పాటు 438 కిలో మీటర్లు మేర పాదయాత్ర చేశారు బండి సంజయ్.. ఎనిమిది జిల్లాల్లోని 19 అసెంబ్లీ, 6 పార్లమెంట్ నియోజకవర్గాలను…
మొదటి విడత ప్రజా సంగ్రామ యాత్రను హజురాబాద్‌లో ఘనంగా ముగించాలన్నది బీజేపీ ఆలోచన. వారికి ఎన్నికల కోడ్ బ్రేక్ వేసింది. ఇప్పుడేం చేస్తారు? కమలనాథుల ప్లానింగ్ ఏంటి? ఎన్నికల కోడ్‌తో సంజయ్ యాత్ర ముగింపుపై బీజేపీలో చర్చ..! తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆగస్టు 28న ప్రజా సంగ్రామ యాత్ర మొదలు పెట్టారు. ఉపఎన్నిక జరగుతున్న హుజురాబాద్‌లో అక్టోబర్ రెండున భారీ రోడ్ షోతో మొదటి విడత యాత్రను ముగించాలని అప్పట్లో అనుకున్నారు. నిన్న మొన్నటి…
బండి సంజయ్ పై బాల్క సుమన్ ఫైర్ అయ్యారు. బిజెపికి బండి సంజయ్ గుదిబండల తయారు అయ్యారని… బండి సంజయ్ పాదయాత్ర కు స్పందన లేదని ఎద్దవా చేశారు. బురదలో పొర్లే పందికి పన్నీర్ వాసన తెలియనట్లే … బండి సంజయ్ కి ప్రగతి భవన్ గురించి తెలియదన్నారు. ప్రగతి భవన్ సబ్బండ వర్గాల సంక్షేమ భవన్ అని…నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల అభిమానం కేసీఆర్ కు వెలకట్టలేని ఆస్తి అని స్పష్టం చేశారు. ఇది సన్నాసి…
తెలంగాణలో పాదయాత్ర నిర్వహిస్తోన్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. అధికార టీఆర్ఎస్ పార్టీపై నిప్పులుచెరుగుతున్నారు.. ఇవాళ ఇల్లంతకుంట బహిరంగ సభలో.. మరోసారి తెలంగాణ సర్కార్, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌పై హాట్ కామెంట్లు చేశారు.. బీజేపీ అధికారంలోకి వస్తే కేటీఆర్‌ను బొక్కలో వేయిస్తాం అంటూ హెచ్చరించిన బండి సంజయ్.. ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు కేటీఆరే కారణం అని ఆరోపించారు. ఇక, ధాన్యం కొనుగోలులో కేసీఆర్ బ్రోకర్ మాత్రమే.. కేంద్రమే పూర్తిగా ధాన్యాన్ని కొనుగోలు చేస్తోందని కామెంట్…
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ కు 5 పేజీల బహిరంగ లేఖ రాశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్. దళిత బంధు పథకాన్ని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని, దళితులకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరారు. దళితులు సంక్షేమ పట్ల చిత్తశుద్ధి ఉంటే దళిత బంధు పథకాన్ని రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేసి అర్హులకు 10 లక్షల ఆర్ధిక సహాయం అందించాలని… డిమాండ్ చేశారు. దళితున్ని ముఖ్యమంత్రి చేస్తానని… కెసిఆర్ దళితులను నిట్టనిలువునా…
సీఎం కేసీఆర్ కు బండి సంజయ్ మరో లేఖ రాశారు. బీసీ బంధును అమలు చేయాలని… ముగ్గురు కాదు.. క్యాబినెట్ లో 8మంది బీసీలకు స్థానం కల్పించాలని లేఖలో పేర్కొన్నారు. అర్హులైన ప్రతి బీసీ కుంటుంబానికి 10 లక్షలు ఆర్ధిక సహాయం అందించాలని… జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీల సంక్షేమం కోసం బీసీ బంధు పథకం ప్రారంభించాలన్నారు. బీసీలపై టీఆర్ఎస్ ప్రభుత్వం సవతి తల్లి ప్రేమను విడాలని… టీఆర్ఎస్ ప్రభుత్వం హయంలో బీసీ సబ్…
సీఎం కేసీఆర్ కు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ లేఖ రాశారు. రైతు రుణ మాఫీ , రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై ముఖ్యమంత్రి కెసిఆర్ కు ఐదు పేజీల బహిరంగ లేఖ రాశారు. 2018 ఎన్నికల సందర్భంగా తెరాస పార్టీ ఇచ్చిన లక్ష రూపాయల రైతు రుణ మాఫీని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. రైతు రుణ మాఫీ క్రింద ఇవ్వాలిసిన 27 వేల 500 కోట్ల రూపాయల నిధులను డిమాండ్…
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ చేపట్టిన ప్రజా సంగ్రామ యాత్ర 27వ రోజుకు చేరుకుంది.. ప్రజలను కలుస్తూ.. సమస్యలను తెలుసుకుంటూ.. ప్రభుత్వాన్ని నిలదీస్తూ.. ఇతర ప్రతిపక్షాలపై ఫైర్ అవుతూ ముందుకు సాగుతున్నారు బండి.. ఇక, ఇవాళ్టితో కామారెడ్డి జిల్లాలో బండి సంజయ్ పాదయాత్ర ముగియనుంది.. మధ్యాహ్నం రాజన్న సిరిసిల్ల గంభీరావు పేట మండలంలోకి అడుగుపెట్టనున్నారు.. నేటి నుండి ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 5 రోజుల పాటు కొనసాగనుంది ప్రజా సంగ్రామ యాత్ర.. సిరిసిల్ల జిల్లాలో…
బండి సంజయ్ సంగ్రామ యాత్రలో కొత్త కమలాలు కనిపిస్తున్నాయా? పాత వాసనలు.. పాతకాలపు పోకడలకు చెక్ పెట్టారా? లేక వ్యూహాత్మకంగానే అడుగులు వేస్తున్నారా? మారిన పరిణామాలు పార్టీసారథికి.. బీజేపీకి వర్కవుట్ అవుతాయా? సంజయ్ యాత్రలో కనిపిస్తున్న సిత్రాలపై చర్చ! యాత్ర అనే పేరు లేకుండా బీజేపీని ఊహించలేం. రథయాత్ర ద్వారా దేశంలో పార్టీ బలోపేతం కావడంతో.. ఇప్పుడు తెలంగాణలో బీజేపీని పటిష్ఠం చేయడానికి ప్రజా సంగ్రామ యాత్రను నమ్ముకున్నారు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్. ఆగస్టు 28న…