ప్రజల దెబ్బకు టీఆర్ఎస్ బాక్సులు బద్దలు కావాలి : బండి సంజయ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ జిల్లా వీణవంక మండలం బేతిగల్ గ్రామంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ పర్యటించారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ.. టీఆర్ఎస్ ప్లీనరీలో సీఎం కేసీఆర్ మాట్లాడినవన్నీ పచ్చి అబద్దాలే అంటూ ఆరోపించారు. 2 నెలల ముందు ఇదే ప్లీనరీ పెడితే కేసీఆర్ ఆడే అబద్దాలకు ఆస్కార్ వాళ్లు అవార్డు ఇచ్చే వాళ్లు అంటూ ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు హుజూరాబాద్ లో ముఖం చెల్లక ఈసీపై నిందలు వేస్తున్నరాని, భారత ఎన్నికల సంఘానికి ప్రపంచంలోనే మంచి పేరుందని, సీఎంగా ఉంటూ ఈసీపై నిందలేయడం సిగ్గుచేటని అన్నారు.
బెంగాల్ ఎలక్షన్ లో ఈసీ రూల్ తో ప్రధానమంత్రి మీటింగ్ లు క్యాన్సిల్ అయ్యాయని, ఆ రూల్స్ వల్ల అమిత్ షా మీటింగ్ కూడా రద్దు చేసుకున్నామని ఆయన తెలిపారు. తెలంగాణలో కోవిడ్ ఉంది. ఎన్నికలు వాయిదా వేయాలంటూ ఈసీకి లేఖలు రాసింది కేసీఆర్ ప్రభుత్వమేనని అన్నారు. దళిత బంధు పేరిట కేసీఆర్ మోసం చేస్తున్నాడు. దళిత సీఎం ఏమైంది? ఉప ముఖ్యమంత్రి ఏమైంది? మూడెకరాల భూమి ఏమైంది? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. దళిత బంధుపై హుజూరాబాద్ నుండే బీజేపీ యుద్దం ప్రారంభించబోతున్నామని, కేసీఆర్ చేసిన అన్ని సర్వేల్లో బీజేపీ గెలుస్తుందని ఖాయమై పోయిందన్నారు.
Also Read
- AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
- OTR: ఆలేరు ఎమ్మెల్యే వైఖరిపై భువనగిరి ఎమ్మెల్యే అసంతృప్తి
- Alwal Case: అల్వాల్ మైనర్ బాలిక సామూహిక లైంగిక దాడి కేసులో షాకింగ్ ట్విస్ట్..
- CM Revanth Reddy : రేపు సీఎం రేవంత్ టూర్.. కరీంనగర్, సిరిసిల్లలో భారీ కార్యక్రమాలు
‘ఓటుకు రూ.20 వేల పంచేందుకు కంటై నర్లలో డబ్బుల కట్టలు తీసుకొచ్చిండ్రట. టీఆర్ఎస్ నేతలే ఓటుకు 15 వేలు కట్ చేసుకుని రూ.5 వేలే ఇస్తున్నరట. అవి కూడా దొంగ నోట్లు ఇస్తరేమో జాగ్రత్త. టీఆర్ఎస్ కు ఓటేయాలంటూ పోలీసులతో బెదిరించి భయపెడుతున్నరు. ప్రజలెవరూ భయపడకండి. స్వేచ్ఛగా ఓటేయండి. పువ్వు గుర్తుకు ఓటేసి కేసీఆర్ కు గుణపాఠం చెప్పండి. వచ్చేనెల 2న హుజూరాబాద్ ప్రజల దెబ్బకు టీఆర్ఎస్ బాక్సులు బద్దలు కావాలి’ అంటూ వ్యాఖ్యానించారు. ప్రగతి భవన్ లో కేసీఆర్ కు ‘ట్రిపుల్ ఆర్’ సినిమా చూపిస్తాం. వచ్చేనెల 2 తరువాత కేసీఆర్ దుకాణం బంద్ కావడం ఖాయమని బండి సంజయ్ అన్నారు.
తాజావార్తలు
-
AP and Telangana Weather: ఏపీ, తెలంగాణపై ఉపరితల ద్రోణుల ప్రభావం.. పలు ప్రాంతాలకు వర్ష సూచన
-
Sreeleela : శ్రీలీల బాలీవుడ్ తెరంగేట్రానికి ముహుర్తం ఎప్పుడు..?
-
Fake Certificate: గాడిద పేరు మీద నర్సింగ్ సర్టిఫికేట్.. పేరు ‘డంకీ’.. తండ్రి ‘డంకీ ఫాదర్’.. కులం ‘యానిమల్’..
-
Raashi Khanna : లీక్స్‌లో చిరంజీవినే మించిపోయింది రాశీ ఖన్నా
-
India vs West Indies 2nd ODI: సిరీస్ గెలుపే లక్ష్యంగా బరిలోకి భారత్.. సిరాజ్ రీఎంట్రీ.? ప్లేయింగ్ XI ఇలా..!
ట్రెండింగ్
-
2K+ 165Hz AMOLED డిస్‌ప్లే, 50MP+50MP+32MP కెమెరాలు, 8,400mAh బ్యాటరీతో iQOO 16 5Gలాంచ్.. ధర ఎంతంటే.?
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!