తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మరోసారి బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ నోరు తెరిస్తే అబద్దాలే మాట్లాడతారని మండిపడ్డారు. ఆదివారం రాత్రి గంటసేపు ప్రెస్‌మీట్ పెట్టి కేసీఆర్ అబద్దాలే మాట్లాడారని.. ఈ అబద్దాలు చెప్పేందుకే ప్లీనరీలు, బహిరంగసభలు, కేబినెట్ సమావేశాలు నిర్వహిస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. తెలంగాణలో రైతులు సంతోషంగా లేరని.. రైతులను ఆగమాగం చేస్తోంది కేసీఆర్ ప్రభుత్వమేనని విమర్శించారు. తెలంగాణలో 62 లక్షల ఎకరాల్లో వరి సాగు ఎక్కడ అవుతుందో…
సీఎం కేసీఆర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు బండి సంజయ్‌పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బండి సంజయ్ పచ్చి అబద్దాలు మాట్లాడుతూ రైతులకు భ్రమ కలిపిస్తున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం పంటలు మార్చాలని సూచిస్తుంటే.. ఇక్కడ రాష్రంలో బండి సంజయ్ రైతులను వరి పంట వేయమని చెప్పడం కరెక్టు కాదన్నారు. ఢిల్లీ బీజేపీ వరి వద్దంటే.. సిల్లీ బీజేపీ వేయమంటోంది అంటూ ఎద్దేవా చేశారు. బండి ఇక్కనైన తన తీరు మార్చుకోవాలని.. లేదంటే…
ధాన్యం కొనుగోళ్లలో తెలంగాణ బీజేపీ చీఫ్ చేసిన వ్యాఖ్యలపై సీఎం కేసీఆర్ నిప్పులు చెరిగారు. ప్రగతిభవన్‌లో ఏర్పాటు మీడియా సమావేశంలో కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్ర ఒకలా చెబితే… ఇక్కడ బండి సంజయ్ మరోలా మాట్లాడుతున్నారన్నారు. బండి సంజయ్ చిన్న పెద్దా తేడా లేకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నన్ను జైలుకు పంపుంతా అన్న బండి సంజయ్ నన్ను జైలుకు పంపి బతికి బట్టకడతావా..? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్‌ను టచ్ చేసి చూడు ఏంటో తెలుస్తుంది అని…
తెలంగాణ సీఎం కేసీఆర్ టీబీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై పలు వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయమని చెబుతోంటే.. ఇక్కడ తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి బీజేపీ చీప్ బండి సంజయ్ రోడ్డుమీద నిరసనలు చేపడుతున్నారన్నారు. ఇప్పటికే చాలా సార్లు బండి సంజయ్ తనపై వ్యాఖ్యలు చేశారని.. తన స్థాయికి మించి వ్యాఖ్యలు చేసినా పట్టించుకోలేదన్నారు. కానీ.. ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం తీరును…
తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకుంటోందని ప్రధాని మోడీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆదివారం బీజేపీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీ తో పాటు జెపీ నడ్డా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రల్లో పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా మారుతున్నాయన్నారు. అంతేకాకుండా దుబ్బాక, హుజురాబాద్ ఫలితాలపై హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ బీజేపీ నేతలను ప్రత్యేకంగా అభినందించారు. ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లోనూ బీజేపీదే విజయమని ఆయన అన్నారు.…
పెట్రోల్, డీజిల్ పై రాష్ట్రం వ్యాట్‌ను తగ్గించాలనే డిమాండ్‌తో ఈనెల 8న బీజేపీ నిరసనలు చేపడుతందని బండి సంజయ్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తగ్గించిన విధంగానే రాష్ట్ర ప్రభుత్వం కూడా పెట్రోల్, డీజిల్ పై వ్యాట్ తగ్గించాలని ఆయన అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం, మంత్రులు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శించడం మాని పన్నులు తగ్గించాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ పై ఉన్న వ్యాట్ తగ్గించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ, రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా…
80 శాతం హిందువులున్న దేశంలో ధర్మ కార్యం చేయడం మతతత్వమవుతుందా? అని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. అయోధ్యలో దివ్యమైన, భవ్యమైన రామ మందిర నిర్మాణం జరిగేదా? 370 ఆర్టికల్ రద్దు జరిగేదా? అని తెలిపారు. నల్లకుంటలోని శంకర మఠానికి వెళ్లారు బండి సంజయ్. రాష్ట్రంలో అనేక దేవాలయాలు శిథిలావస్థలో ఉన్నాయని… చాలా దేవాలయాలు ఇప్పటికీ దూప, దీప నైవేద్యాలకు నోచుకోకపోవడం బాధాకరమని తెలిపారు. కేదారనాథ్ లోని ఆది శంకరాచార్యుల సమాధి…
వరి విత్తన విక్రయాలపై కోర్టు తీర్పును స్వాగతిస్తున్నట్టు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ కుమార్ అన్నారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ .. వరి విత్తనాలు అమ్మితే షాపు సీజ్ చేసి లైసెన్స్ ర ద్దు చేస్తానని, నేను ఉన్నంత వరకు మళ్లీ షాప్ తెరిచే అవకాశం కూడా ఉండదంటూ సిద్ధిపేట జిల్లా కలెక్టర్ వెంకట్రామిరెడ్డి చేసి వ్యా ఖ్యలను రాష్ట్ర హైకోర్టు తప్పుపట్టిందన్నారు. వరి విత్తనాలు అమ్మే విషయంలో హైకోర్టు , సుప్రీంకోర్టు…
హుజురాబాద్ ఉప ఎన్నికల ఫలితాల్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం వైపు దూసుకెళ్తున్నారు.. ఇప్పటి వరకు టీఆర్ఎస్కు పట్టుకున్న మండలాల్లో ఓట్ల లెక్కింపు జరిగినా.. ఆధిక్యంలోనే కొనసాగుతూ వచ్చారు ఈటల.. మిగతా మండలాల్లో ఈటలకు అనుకూలమైన ఓటింగే భారీగా ఉందనే అంచనాలున్నాయి.. దీంతో.. ఈటల గెలుపు నల్లేరు మీద నడకే అని అంచనా వేస్తున్నారు. ఇక, ఈటల ఆధిక్యం పెరుగుతున్నా కొద్ది.. బీజేపీ శ్రేణుల్లో ఉత్సాహం పెరిగిపోతోంది.. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్…
ఎవరేమి కామెంట్స్ చేసినా.. ఈటల రాజేందర్ బీజేపీ అభ్యర్థి అని…హుజురాబాద్ లో బీజేపీ అభ్యర్థి గెలవబోతున్నారని తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. హుజురాబాద్ లో బీజేపీ గెలుపు ఊహించినదేనని..హామీలు అమలు చేయటంలో కేసీఆర్ విఫలం అయ్యారని నిప్పులు చెరిగారు. ఈటల రాజేందర్ మళ్ళీ అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నారని.. ఓటర్లను టీఆర్ఎస్ భయభ్రాంతులకు గురిచేసినా ఫలితం లేకపోయిందన్నారు. డబ్బును కాదని చైతన్యాన్ని చాటిన హుజురాబాద్ ప్రజలకు ధన్యవాదములు తెలిపారు బండి సంజయ్. టీఆర్ఎస్ పార్టీ తో…