తెలంగాణ సీఎం కేసీఆర్‌పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల దళితబంధు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇక, దళితుడిని సీఎంను ఎందుకు చేయలేదు..? దళితుడికి సీఎం అయ్యే అర్హత లేదా..? అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదు..? అంబేద్కర్ జయంతి వేడుకల్లో కూడా ఎందుకు పాల్గొనలేదు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.
Read Also : టీఆర్ఎస్ విజయగర్జన సభ మళ్లీ వాయిదా..
నన్ను టచ్ చేసి చూడు అంటున్నావుగా.. కేసీఆర్ ను సరైన టైమ్‌లో టచ్ చేసి తీరుతాం అన్నారు బండి సంజయ్.. దళితబంధు అమలను చేసే బాధ్యతను బీజేపీ తీసుకుంటుందన్న ఆయన.. దళితులకు పది లక్షలు ఇవ్వకుంటే కేసీఆర్ వీపు మోత తప్పదని హెచ్చరించారు.. దళితులు ఓట్లు వేయకుంటే రెండు సార్లు కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యే వాడా? అని ప్రశ్నించిన బండి సంజయ్.. దళితబంధు కావాలో.. వద్దో ఎస్సీ ఎమ్మెల్యేలు సమాధానం చెప్పాలన్నారు.. ఇక, తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో పెట్టిన రోజు సభలో ఎందుకు లేవు కేసీఆర్ అంటూ నిలదీసిన బీజేపీ అధ్యక్షుడు.. వర్షకాలంలో పండిన వరి ధాన్యాన్ని కొంటాడో లేదో కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.
కేసీఆర్ బూతు మాటలు విని తెలంగాణ సమాజం తల దించుకుంటోందని మండిపడ్డారు బండి సంజయ్.. కేసీఆర్ నా తల నరుకుతా అంటున్నాడు… పేదల కోసం నేను తల నరుక్కోవడానికి సిద్ధం.. మరి కేసీఆర్ సిద్ధమా? అంటూ ప్రశ్నించారు. కేసీఆర్ అవినీతి, కుటుంబ పాలనను తరిమి కొట్టటానికి కంకణం కట్టుకున్నాం అన్నారు.. నిన్ను నిద్ర లేపడానికే డప్పుల మోత మోగిస్తున్నాం.. ఇక ఆగదు.. నిన్ను గద్దె దింపేవరకు నిద్రపోం.. నిద్ర పోనివ్వం అంటూ వ్యాఖ్యానించారు బండి సంజయ్. ఇక, ఈ సందర్భంగా బండి సంజయ్ ఇంకా ఏం మాట్లాడారో తెలుసుకోవడానికి కింది వీడియోను క్లిక్ చేయండి.. .