తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పుంజుకుంటోందని ప్రధాని మోడీ అభిప్రాయం వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆదివారం బీజేపీ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ప్రధాని మోడీ తో పాటు జెపీ నడ్డా కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోడీ మాట్లాడుతూ.. తెలుగు రాష్ట్రల్లో పరిస్థితులు బీజేపీకి అనుకూలంగా మారుతున్నాయన్నారు. అంతేకాకుండా దుబ్బాక, హుజురాబాద్ ఫలితాలపై హర్షం వ్యక్తం చేశారు.
తెలంగాణ బీజేపీ నేతలను ప్రత్యేకంగా అభినందించారు. ఎన్నికలు జరిగే 5 రాష్ట్రాల్లోనూ బీజేపీదే విజయమని ఆయన అన్నారు. బద్వేల్ ఉపఎన్నికలో బీజేపీ బలం పెరిగిందన్నారు. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి డీకే అరుణ, లక్ష్మణ్, మురళీధరరావులు ఢిల్లీ వెళ్లగా.. బండి సంజయ్, విజయశాంతి, ఈటల రాజేందర్, రాజాసింగ్, వివేక్, జితేందర్, గరికపాటిలు నాంపల్లి బీజేపీ కార్యాలయం నుంచి వర్చువల్‌గా ఈ సమావేశంలో పాల్గొన్నారు.