తెలంగాణలో ప్రస్తుతం ధాన్యం కొనుగోలు కొట్లాట నడుస్తోంది. అటు ప్రభుత్వంలో ఉన్న అధికార పార్టీ టీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ వరి వేస్తే ఊరే అని వ్యాఖ్యానించి తెలంగాణ రైతులకు షాక్ ఇచ్చారు. ఆ తరువాత కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయమని చెబుతోందని…అందుకే ధాన్యం కొనుగోలు చేయలేమని స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ప్రతిపక్షంలో ఉన్న బీజేపీ నేతలేమో రైతులు ధాన్యాన్ని పండించండి అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటు తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్‌ఎస్ నేతలు…
బీజేపీ ఎన్ని ప్రయత్నాలు చేసిన కొనుగోళ్లు ఆపమని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. బీజేపీ ధాన్యం కొనుగోళ్లపై రాష్ర్టంలో అలజడి సృష్టిస్తుందన్నారు. గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావే శంలో ఆయన మాట్లాడారు. బీజేపీ, టీఆర్‌ఎస్‌పై అనవసర విమర్శలు చేస్తుందని, విమర్శలు ఆపి కేంద్రాన్ని ధాన్యం కొనేలా ఒప్పించాలని ఆయన అన్నారు. ఇప్పటికే రాష్ర్టంలో 6,600 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. అవసరమైతే వీటి సంఖ్యను ఇంకా పెంచుతామని ఆయన తెలిపారు. రాష్ర్టంలో వరి ధాన్యం…
నీళ్లు, నిధులపేరుతో కేసీఆర్ కోట్ల అవినీతికి పాల్పడ్డారని, టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి అన్నారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ శిక్షణ తరగతుల్లో పాల్గొన్న ఆయన మాట్లాడారు. భవిష్యత్‌లో ఇంకా చాలా శిక్షణా తరగ తులు ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. సోనియా గాం ధీ ఆమోదిస్తే వచ్చే ఏడాది ఏఐసీసీ ఫ్లీనరీ సమావేశాలను హైదరాబా ద్‌లో నిర్వహిస్తామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన అధికార టీఆర్‌ఎస్, బీజేపీపై నిప్పులు చెరిగారు. కేసీఆర్,బండి సంజ య్‌ల ప్రెస్‌మీట్‌లు చిక్కడపల్లి కౌంపౌండ్‌ను…
కేసీఆర్ ను టచ్ చేస్తే బండి సంజయ్ మాడిమసై పోతాడని మాజీ మంత్రి మోత్కు పల్లి నర్సింలు వార్నింగ్ ఇచ్చారు. నిన్న బీజేపీ డబ్బుల ప్రోగ్రాంలో డప్పులు కొట్టేవారిలో ఒక్కరూ డప్పులు కొట్టేవారు లేరని… దళితబంధు కావాలని కొడుతున్నారా? వద్దని కొడుతున్నారా? అని మండిపడ్డారు. దళితబంధు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఎక్కడైనా ఉందా? బీజేపీ నేతలకు సిగ్గు ఉందా? అని నిలదీశారు మోత్కుపల్లి. కుల వివక్ష పోగొట్టేందుకు బీజేపీ ఎక్కడైనా ప్రయత్నం చేసిందా? బీజేపీ వల్లే కులవ్యవస్థ…
ఒకప్పుడు సరైన సమయంలో వర్షాలు కురియక రైతులు ఆందోళన చెందేవారు. ఒక్కోసారి అతి వర్షాలు కురిసి పంటకు నష్ట వాటిల్లేది. ఇలాంటి సంఘటనలను ఎదుర్కొన్న రైతులు ఎప్పుడూ వినని మాటలు రాజకీయ నాయకుల నోటి నుంచి వింటున్నారు. ఆ మాటలతో ఏం చేయాలో రైతులకు పాలుపోవడం లేదు. ఓ రాజకీయ పార్టీ అధినేత వరి వేస్తే ఊరే అంటే.. మరో రాజకీయ పార్టీ నేత వరి వేయండి రాష్ట్ర ప్రభుత్వం మెడలు వంచి కొనిపిస్తానంటున్నారు.. ఇలా రాజకీయ…
రాజకీయాల్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రులు ఉండరని చెబుతుంటారు.. ఇవాళ ఓ పార్టీలో ఉన్న నేత.. తెల్లారేసరికి మరో పార్టీలో కనిపించి ఆశ్చర్య పరిచిన సందర్భాలు ఎన్నో చూశాం.. అయితే, తెలంగాణలో తిరుగులేని మెజార్టీతో అధికారంలో ఉంది టీఆర్ఎస్ పార్టీ.. కానీ, సీఎం కేసీఆర్‌కు చివరకు మిగిలేది ఆరుగురు ఎమ్మెల్యేలే అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. నా ఫామ్‌హౌస్‌ను ట్రాక్టర్ పెట్టి దుంతాడట.. రా వచ్చి చూడు.. ఆరు ముక్కలు…
తెలంగాణ సీఎం కేసీఆర్పై మరోసారి ఘాటు వ్యాఖ్యలు చేశారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్.. రాష్ట్రంలో ప్రతి దళిత కుటుంబానికి పది లక్షల దళితబంధు ఇవ్వాల్సిందేనని డిమాండ్ చేశారు. ఇక, దళితుడిని సీఎంను ఎందుకు చేయలేదు..? దళితుడికి సీఎం అయ్యే అర్హత లేదా..? అంబేద్కర్ విగ్రహాన్ని ఎందుకు ఏర్పాటు చేయలేదు..? అంబేద్కర్ జయంతి వేడుకల్లో కూడా ఎందుకు పాల్గొనలేదు? అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు. Read Also : టీఆర్ఎస్ విజయగర్జన సభ మళ్లీ…
కామారెడ్డి టీఆర్ఎస్ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ పథకాలను బీజేపీ కాపీ కొడుతోందని ఆరోపించారు. అంతేకాకుండా పెన్షన్లను పది రెట్లు పెంచామని, 42 లక్షల మందికి 10వేల కోట్ల పెన్షన్లు ఇస్తున్నామన్నారు. వైద్య వ్యవస్థపై విశ్వాసం పెంచామని, జనం సర్కార్ దవాఖానకు పోయేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు. కేసీఆర్ ప్రశ్నలకు బీజేపీ నేతలు సమాధానం చెప్పలేరని, టీఆర్ఎస్ అభివృద్ధిని బీజేపీ పాదయాత్రలోనే బయటపెట్టారన్నారు. ఉత్తర భారతదేశానికి ఓ…
సీఎం కేసీఆర్ మరోసారి మీడియాముందుకు వచ్చారు. ఈ సం దర్భంగా సీఎం మాట్లాడుతూ…. దళిత సీఎంను చేయలేదని దానికి అనేక కారణాలు ఉన్నాయన్నారు. షబ్బీర్ అలీ కూడా ఈ విషయం చెప్పారు. నా నిర్ణయాన్ని ప్రజలు ఆమోదించారు. రెండోసారి 83 సీట్ల లో మళ్లీ గెలిపించారు. లక్షా 35 వేల ఉద్యోగాలు ఇచ్చాం. మరో 78 వేల ఉద్యోగాలు ఇస్తాం అని కేసీఆర్ అన్నారు. కేంద్రం జోనల్ ఆమో దం విషయంలో కొర్రీలు పెడుతుంది. జోనల్ ఆమోదం…
యాసంగిలో వరి వేయిద్దనే సీఎం కామెంట్స్ ఆశ్చర్యం కలిగించిందని కాంగ్రెస్ నేత మల్లు భట్టి విక్రమార్క అన్నారు. రైతులతో రెండు ప్రభు త్వాలు ఫుట్బాల్ ఆడుతున్నాయని ఆయన ఆరోపించారు. వరి పంట కొత్తగా పండించడం లేదు. ప్రణాళికలు వేసుకోవడమే ప్రభుత్వ బాధ్య త అన్నారు. నేను కొనను అంటే ఎలా .. కేంద్రం కొనదు కాబట్టి నేను కొనను .. ఏం చేస్తున్నట్టు అని ఆయన ప్రవ్నించారు. బీజేపీ.. టీఆర్ ఎస్ ఇద్దరూ కలిసి రైతులతో ఆటలాడుతున్నారన్నారు.రైతు…