కామారెడ్డి టీఆర్‌ఎస్ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సభలో టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. తెలంగాణ పథకాలను బీజేపీ కాపీ కొడుతోందని ఆరోపించారు. అంతేకాకుండా పెన్షన్లను పది రెట్లు పెంచామని, 42 లక్షల మందికి 10వేల కోట్ల పెన్షన్లు ఇస్తున్నామన్నారు. వైద్య వ్యవస్థపై విశ్వాసం పెంచామని, జనం సర్కార్ దవాఖానకు పోయేందుకు ఆసక్తి చూపుతున్నారన్నారు.
కేసీఆర్ ప్రశ్నలకు బీజేపీ నేతలు సమాధానం చెప్పలేరని, టీఆర్‌ఎస్ అభివృద్ధిని బీజేపీ పాదయాత్రలోనే బయటపెట్టారన్నారు. ఉత్తర భారతదేశానికి ఓ నీతి.. మనకో నీతా.. ఖచ్చితంగా వరి కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. మన అభివృద్ధికి బీజేపీ నేతలే బ్రాండ్‌అంబాసిడర్లు అని కేటీఆర్ ఎద్దేవా చేశారు.