తెలంగాణ సీఎం కేసీఆర్ టీబీజేపీ చీఫ్ బండి సంజయ్‌పై పలు వ్యాఖ్యలు చేశారు. ప్రగతి భవన్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయమని చెబుతోంటే.. ఇక్కడ తన రాజకీయ పబ్బం గడుపుకోవడానికి బీజేపీ చీప్ బండి సంజయ్ రోడ్డుమీద నిరసనలు చేపడుతున్నారన్నారు.
ఇప్పటికే చాలా సార్లు బండి సంజయ్ తనపై వ్యాఖ్యలు చేశారని.. తన స్థాయికి మించి వ్యాఖ్యలు చేసినా పట్టించుకోలేదన్నారు. కానీ.. ధాన్యం కొనుగోళ్లలో కేంద్రం తీరును రాష్ట్ర రైతులకు తెలుపకుండా టీఆర్ఎస్ ప్రభుత్వంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. రైతుల మీద మీకు ప్రేమ ఉంటే.. కేంద్రాన్ని ఒప్పించి ధాన్యం కొనుగోల్లు జరిపించాలన్నారు.