Traffic Diversion : హైదరాబాద్‌వాసులకు అలర్ట్.. రేపు ఈ ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేపట్టిన రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు నేపథ్యంలో రేపు మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడాలో బీజేపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభను నిర్వహించనున్నారు. అయితే ఈ సభకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వస్తుండడంతో తెలంగాణ బీజేపీ శ్రేణులు ఈ సభను విజయవంతం చేసేందుకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి భారీగా జనసమీకరణ చేస్తున్నారు. అయితే ఈ క్రమంలో.. హైదరాబాద్‌లోని పలు ఏరియాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు రాచకొండ పోలీసులు వెల్లడించారు. బీజేపీ నిర్వహించనున్న ఈ భారీ బహిరంగ సభకు అమిత్ షా హజరవుతున్న నేపథ్యంలో.. శంషాబాద్, కల్వకుర్తి, బొంగులూరు, పహాడి షరీఫ్ నుండి తుక్కుగూడాకు భారీ వాహనాలు వచ్చే అవకాశం ఉన్న క్రమంలో రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆ ఏరియాలో ట్రాఫిక్ అంక్షలు ఉంటాయని పోలీసులు తెలిపారు.
అంతేకాకుండా.. మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 గంటల వరకు శ్రీశైలం వైపుకు వాహనాలు అనుమతించబడవని తెలిపారు. దీనితో పాటు.. ఎల్బీ నగర్, హయత్ నగర్ నుంచి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లే వారు మందమల్లమ్మ, బాలపూర్, వీడియోకాన్ జంక్షన్ మార్గాలలో వెళ్లాలలని సూచించారు. అలాగే.. దిల్‌సుఖ్‌నగర్, మలక్‌పేట, చంద్రాయన గుట్ట నుంచి ఎయిర్‌పోర్ట్ వెళ్లే ట్రాఫిక్‌ను అరాంఘర్, శంషాబాద్ మార్గాల్లో మల్లించనున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. రేపు మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ఓఆర్‌ఆర్ ఎగ్జిట్ నెం.14 ద్వారా ఎలాంటి భారీ వాహనాలను నగరంలోకి అనుమతించరని కూడా తెలిపారు.
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
- Current Charges Increased: విద్యుత్ వినియోగదారులకు బిగ్ షాక్.. పెరిగిన కరెంట్ ఛార్జీలు.. ఒక్కో యూనిట్‌కు ఎంతంటే..
- ACB Raids: తెలంగాణ ఏసీబీ చరిత్రలోనే అతి పెద్ద అవినీతి తిమింగలం.. ఎట్టకేలకు చిక్కేసింది..
- Off The Record: పేకాట పంచాయితీతో కాంగ్రెస్‌లో చిచ్చు..! పేకాటా? పవర్ గేమా?
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్‌లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!