తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ చేపట్టిన రెండో దశ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు నేపథ్యంలో మహేశ్వరం నియోజకవర్గంలోని తుక్కుగూడలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నారు. అయితే.. ఈ సందర్భంగా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ మాట్లాడుతూ.. ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభమైనప్పటి నుంచి టీఆర్‌ఎస్ భయం నెలకొంది.
వారు చేయించుకున్న సర్వేల్లో టీఆర్‌ఎస్ పార్టీ ఓడిపోతుందని, బీజేపీ అధికారం రానుందని ఫలితాలు రావడంతో తండ్రి, కొడుకులు ఫ్రస్టేషన్‌లో ఉన్నరు. కేసీఆర్ అయితే ఫ్రస్టేషన్‌లో ఫాంహౌస్ నుంచి బయటకు వస్తలేరు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రకు ఊరూరా ప్రజలు నీరాజనం పడుతున్నారు. రాబోయే ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని ఆమె అశాభావం వ్యక్తం చేశారు.