కష్టపడి పని చేసే ప్రతి కార్యకర్తకు నాయకుడికి కాంగ్రెస్ పార్టీలో సముచిత స్థానం గౌరవం ఉంటాయని కూకట్‌పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ , బండి రమేష్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ ని నమ్ముకుని ఇతర పార్టీల నుండి వచ్చిన కార్యకర్తలను సైతం కలుపుకొని పార్టీ పటిష్ఠానికి కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు కెపిహెచ్బి కాలనీ 114 డివిజన్ కు చెందిన మహిళా నాయకురాలు నాగమణి ఆధ్వర్యంలో కెపిహెచ్బి డివిజన్ కి చెందిన గంగా శివకుమారి ప్రధాన…
మల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజకవర్గం నుంచి గెలిచిన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారని అలాంటి మల్కాజ్‌గిరి పార్లమెంటు సీటును మరోసారి గెలిపించి ముఖ్యమంత్రికి కానుకగా ఇవ్వాలని కూకట్‌పల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ బండి రమేష్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు., మల్కాజ్‌గిరి పార్లమెంటు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశం శుక్రవారం బోయిన్‌పల్లిలోని జయలక్ష్మి గార్డెన్స్ లో జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న బండి రమేష్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి వేగంగా జరగాలంటే అభివృద్ధి కుంటు పడకుండా ఉండాలంటే…
దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా 3 నెలల్లో 30వేల ఉద్యోగాలు ఇచ్చి యువత స్థితి గతులను మార్చి మాట తప్పని ప్రభుత్వంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలోని తెలంగాణ ప్రభుత్వం నిలిచిందని కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి బండి రమేష్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 3నెలల్లో అన్ని వర్గాల అన్ని ప్రాంతాల అన్ని మతాల ప్రజలను కలుపుకొని 17కార్పోరేషన్ లు ఏర్పాటు చేయడం ద్వారా తెలంగాణ లో సమసమాజం స్థాపనకు ముఖ్యమంత్రి రేవంత్…
కూకట్పల్లి నియోజకవర్గంలోని ఫతేనగర్ డివిజన్ ప్రజలకు ఇప్పటివరకు ఆర్టీసీ బస్సు సౌకర్యం లేదని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్ పేర్కొన్నారు. సుమారు పది సంవత్సరాలుగా ఈ సమస్యతో స్థానికులు ఇబ్బందులు పడుతున్న ఆ సమస్యను పరిష్కరించే వారే లేకుండా పోయారన్నారు. వర్షాకాలం వచ్చిందంటే చాలు దీనదయాల్ నగర్ బస్తీ వాసుల కష్టాలు వర్ణనాతీతమని వెల్లడించారు.
కూకట్పల్లి నియోజకవర్గంలోని కేపీహెచ్‌బీ నాలుగో ఫేస్‌లో కాంగ్రెస్ పార్టీ డివిజన్ ప్రెసిడెంట్ ప్రవీణ్ ఆధ్వర్యంలో కార్నర్ మీటింగ్‌లో కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీకి కూకట్‌పల్లి నియోజకవర్గ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని, ఏ ఇంటికి ఓటు అడగడానికి వెళ్లినా కూడా బ్రహ్మాండంగా ఆదరిస్తున్నారని, హారతులు పడుతున్నారని, రాష్ట్రంలో నిశ్శబ్ధ విప్లవం కాంగ్రెస్‌లో కనిపిస్తుందని, కొంతమంది మభ్యపెట్టి, భయపెట్టి, బలహీనం చేసి ఏదో సాధించాలని చూస్తున్నారని కానీ అది సాధ్యపడదన్నారు.
కూకట్పల్లి నియోజకవర్గం బాలాజీ నగర్ డివిజన్‌లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్ పాదయాత్ర నిర్వహించారు. మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అని ప్రజలు అంటున్నారని ఆయన తెలిపారు.
కూకట్పల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్ అభ్యర్థి బండి రమేష్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ గెలుపే లక్ష్యంగా ప్రజా సమస్యలపై పోరాటమే ధ్యేయంగా ప్రచారం చేశారు. ఈ ప్రచారంలో ఆయన సతీమణి లకుమాదేవి పాల్గొని ఇంటింటికి తిరుగుతూ ప్రచారం చేశారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ.. కూకట్పల్లి డివిజన్లో చేపట్టిన యాత్రకు ప్రజల నుండి మంచి స్పందన వచ్చిందని తెలిపారు. ఇంటింటి ప్రచారంలో ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారని.. మహిళలు మంగళ హారతులతో దీవించారని అన్నారు.
కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండి రమేష్ కు మద్దతుగా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రోడ్ షోలో మాట్లాడుతూ.. వృద్దులకు పెన్షన్లు ఇవ్వటం కాదు.. ఇంట్లో ఉన్న యువతకు ఉద్యోగాలు కల్పించాలి.. పీజీ, పీహెచ్ డీలు చదువుకున్న వారిని బర్రెలు, గొర్రెలు కాసుకోమంటున్నాడు.. కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 2 లక్షల ఉద్యోగాలకు జాబ్ కాలెండర్ విడుదల చేస్తాము అని ఆయన తెలిపారు.