కూకట్పల్లి నియోజకవర్గం మూసాపేట్ డివిజన్ మోతినగర్లో కాంగ్రెస్ ఎన్నికల ప్రచారం నిర్వహించింది. అందులో భాగంగా.. కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్తి బండి రమేష్, ఆయన సతీమణి లకుమాదేవితో కలిసి రోడ్ షోలో పాల్గొన్నారు. భర్త గెలుపే లక్ష్యంగా సోనియాగాంధీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల పథకాలు అందేలా పక్కా ప్రణాళికతో లకుమాదేవి ఇంటింటా ప్రచారం చేశారు.
కూకట్ పల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్, బీజేపీ పార్టీల నుంచి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు కొనసాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండి రమేష్ సక్షమంలో 1000 మందికి పైతా యువత జాయిన్ అయ్యారు.
Kukatpally Congress Candidate Bandi Ramesh Slams BRS Govt: గడీల మధ్య తెలంగాణ బందీ అయిందని, ఒక హోం మంత్రికి గెటు లోపలికి కూడా అనుమతి ఉండదని కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బండి రమేష్ విమర్శించారు. ఉద్యమకారులను ఈ ప్రభుత్వం పట్టించుకోలేదని, జర్నలిస్టులకి ఇండ్ల స్థలాలు అని మోసం చేశారని మండిపడ్డారు. సూటు కేసుల కోసం రాజకీయాల్లోకి రాలేదని.. పార్టీ లైన్ కోసం, ప్రజల కోసం తాను వచ్చానని బండి రమేష్ తెలిపారు.…