AB Venkateswara Rao: పోలవరం – బనకచర్ల ప్రాజెక్టుపై హాట్ కామెంట్లు చేశారు మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వర రావు.. పోలవరం-బనకచర్ల గుదిబండ ప్రాజెక్టుగా పేర్కొన్నారు.. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై ప్రభుత్వానికి లేఖ రాస్తే సమాధానం లేదన్నారు.. కర్నూలులో ఆలోచనపరుల వేదిక ఆధ్వర్యంలో సాగునీటి ప్రాజెక్టులపై సదస్సు నిర్వహించారు.. మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు, ప్రాజెక్టుల విశ్లేషకులు లక్ష్మీనారాయణ, సీపీఐ నేత రామచంద్రయ్య, సాగునీటి సాధన సమితి దాసరథరామిరెడ్డి, రైతు సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
Read Also: Yash Dayal: అత్యాచారం కేసులో ఆర్‌సీబీ ప్లేయర్‌కు భారీ ఎదురుదెబ్బ.. అరెస్ట్ తప్పదా..?
పోలవరం – బనకచర్ల ప్రాజెక్టును వ్యతిరేకించింది ఆలోచనపరుల వేదిక.. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టును మరో కాళేశ్వరం ప్రాజెక్టు కానివ్వవద్దని, నాయకులు రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేలా చేస్తున్నారని నేతలు అభిప్రాయపడ్డారు. రాజకీయాలే ప్రాధాన్యతగా నాయకులు వ్యవహరిస్తున్నారని అభిప్రాయపడింది. రాయలసీమ, ఉత్తరాంధ్ర కన్నీళ్లు తుడవాలని, రెండు తెలుగు రాష్ట్రాల మధ్య కేంద్రం సమన్వయం సాధించాలని ఆలోచనపరుల వేదిక అభిప్రాయపడింది. పోలవరం-బనకచర్ల గుదిబండ ప్రాజెక్టుగా అభివర్ణించారు మాజీ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టుపై ప్రభుత్వానికి లేఖ రాస్తే సమాధానం లేదన్నారాయన. ప్రాజెక్టు అంచనా వ్యయం 80 వేల కోట్లు అంటున్నా పూర్తయ్యే నాటికి లక్షా 50 వేల కోట్లు అవుతుందన్నారు. ఇలాంటి ప్రాజెక్టు ప్రతిపాదిస్తే ప్రతిపక్షం రాజకీయంగా చర్చించి మంచి చెడులు చెప్పడం సహజమని, ప్రతిపక్షం వున్నా లేనట్టు నటిస్తుందని, బనకచర్ల ప్రాజెక్టుపై ప్రతిపక్షం నోరుమేధపడం లేదన్నారు ఏబీ వెంకటేశ్వరరావు.
Read Also: Rajasingh : ముఖ్యమంత్రి గారూ.. ముస్లింలు ఏమైనా బీసీలా..?
ప్రాజెక్టు అంచనా వ్యయం 80 వేల కోట్లు అంటున్నా పూర్తయ్యే నాటికి లక్షా 50 వేల కోట్లు అవుతుంది.. ఇలాంటి ప్రాజెక్టు ప్రతిపాధిస్తే ప్రతిపక్షం రాజకీయంగా చర్చించి మంచి చెడులు చెప్పడం సహజం.. ప్రతిపక్షం వున్నా లేనట్టు నటిస్తుందన్నారు ఏబీ వెంకటేశ్వరరావు.. బనకచర్ల ప్రాజెక్టుపై ప్రతిపక్షం నోరుమేధపడం లేదు.. గత ప్రభుత్వమే ఈ ప్రాజెక్టును ప్రతిపాదించింది.. పోలవరం – బనకచర్ల వల్ల రైతులకు ప్రయోజనం లేదు.. రాయలసీమలో ఒక్క ఎకరాకు అదనంగా నీరు అందదు.. కొత్త ప్రాజెక్టులు ప్రతిపాదించడం కంటే ఇప్పటికే పెండింగ్ ఉన్న ప్రాజెక్టులు పూర్తి చేయడం లాభదాయకం.. 5 వేల కోట్లు ఖర్చు చేస్తే వెలిగొండ ప్రాజెక్టు పూర్తవుతుంది.. 4.5 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుంది.. ఎస్సార్బీసీ కింద రూ.250 కోట్లు ఖర్చు చేస్తే ఇంకా 35 వేల ఎకరాలకు సాగునీరు అందించాల్సి ఉంది అన్నారు.. గోదావరి జలాల పంపిణీపై స్పష్టత లేదు.. రెండు రాష్ట్రాల మధ్య గోదావరి జలాల పంపిణీ తరువాతనే మిగులు జలాలు ఎన్నో తేలుతుందన్నారు ఏబీ వెంకటేశ్వరరావు.
Read Also: Rajasingh : ముఖ్యమంత్రి గారూ.. ముస్లింలు ఏమైనా బీసీలా..?
కృష్ణా జలాల పై తెలంగాణ అబద్ధాలు చెబుతోందన్నారు మాజీ ఐపీఎస్ వెంకటేశ్వరరావు.. రాయలసీమ నీరు దోచుకుంటుందనే తెలంగాణ వాదన అబద్ధం అని నిరూపిస్తాం.. ఎవరైనా వచ్చి చూసుకోవచ్చని ఛాలెంజ్ చేస్తున్నాం అన్నారు.. పోతిరెడ్డిపాడు నుంచి 44 వేల క్యూసెక్కులు కూడా డ్రా చేయలేని పరిస్థితి.. 37 వేల క్యూసెక్కులు మాత్రమే డ్రా చేయవచ్చు.. గాలేరు-నగరి నుంచి పంట కాలువలు లేకుండా రైతుల పొలాలకు నీరివ్వలేని పరిస్థితి ఉందన్నారు ఏబీ వెంకటేశ్వరరావు..