Kishan Reddy: బనకచర్ల ప్రాజెక్టుపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బనకచర్ల మీద కేంద్రం నిర్ణయం తీసుకోలేదు అని తేల్చి చెప్పారు. గోదావరి జలాల పంపిణీ మేరకు తెలంగాణకు అన్యాయం జరగవద్దు.. ఈ విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాయాలని కోరుతున్నాను.
బనకచర్లకు జలాలు తీసుకురావడం తన జీవితాశయం అని, వెంకటేశ్వర స్వామి పాదాల చెంత పోలవరం జలాలు పారాలని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. కేంద్రం సహకారంతో రూ.12,200 కోట్లతో డయాఫ్రం వాల్ పనులు ప్రారంభించాం అని, రెండేళ్లలో పోలవరం ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తామన్నారు. పోలవరం నుంచి బనకచర్ల వరకు అనుసంధానం చేస్తే ఒక గేమ్ ఛేంజర్‌గా తయారవుతుందని పేర్కొన్నారు. ప్రతి ఎకరాకు సాగునీరు అందించే బాధ్యత తనదని, పోలవరం నుంచి కృష్ణ నీళ్లు మళ్లిస్తాం…