పాకిస్థాన్‌లో ఓ స్కూల్ బస్సుపై ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దాడిలో నలుగురు విద్యార్థులు మరణించారు. దాదాపు 38 మందికి పైగా తీవ్ర గాయాలైనట్లు తెలుస్తోంది. బలోచిస్థాన్‌లోని కుజ్‌దార్ ప్రావిన్స్‌లో ఈ దాడి చోటు చేసుకున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై స్థానిక అధికారి యాసిర్ ఇక్బార్ దస్తి సమాచారం అందించారు. ఆర్మీ పబ్లిక్ స్కూల్‌కు చెందిన బస్సు పిల్లలను తీసుకొస్తున్న సమయంలో దానిని లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడి జరిగిందని ఆయన తెలిపారు. ఆత్మహుతి కోసం ఓ…
Balochistan: ఓ వైపు భారత్ దాడులతో దిక్కుతోచని స్థితిలో పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది. మరోవైపు, బెలూచిస్తాన్‌లో బలూచ్ లిజరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) దాడులకు పాకిస్తాన్ వణికిపోతోంది. పాక్ ఆర్మీని, పంజాబ్‌కి చెందిన వారిని బీఎల్ఏ వెతికి వేటాడి హతమారుస్తోంది. తాజాగా, బీఎల్ఏ తాము చేసిన దాడులను వెల్లడించింది. 51 ప్రాంతాల్లోని పాకిస్తాన్ సైన్యంపై 71 దాడులు చేశామని చెప్పింది. తాము ఏ దేశానికి కూడా ప్రాక్సీగా పనిచేయడం లేదని చెప్పింది. బీఎల్ఏ ఏ దేశానికి బంటు కాదని…
దేశం నుంచి తాము విడిపోతామని, స్వాతంత్రం కావాలంటూ బలూచిస్థాన్ ప్రజలు పాకిస్థాన్‌తో పోరాడుతున్నారు. ఓవైపు భారత్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే.. బలూచిస్థాన్ వేర్పాటువాద సంస్థలు పాక్ సైన్యంపై దాడులు చేస్తున్నాయి. ఇలా ఇరువైపుల నుంచి తమపై దాడి జరుగుతుండగా.. పాక్ అల్లాడిపోతుంది. అయితే ఇదే సరైన సమయం అని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ భావిస్తోంది. బలూచిస్థాన్ ఇప్పటికే కీలక నగరం క్వెట్టా సహా చాలా ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి పాక్ ఆర్మీని…
Pakistan: పాకిస్తాన్ భారత్‌తో యుద్ధం చేయకముందే, బలూచిస్తాన్‌ని కోల్పోయేలా ఉంది. బలూచిస్తాన్ ప్రావిన్స్ వ్యాప్తంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) విస్తృతంగా దాడులు నిర్వహిస్తోంది. పాక్ ప్రభుత్వం, ఆర్మీని టార్గెట్ చేస్తూ బీఎల్ఏ యోధులు విరుచుకుపడుతున్నారు.
Pakistan: పాకిస్తాన్ నుంచి బలూచిస్తాన్ వేరు కాబోతోందా..? అంటే పరిస్థితులు చూస్తే అలాగే కనిపిస్తోంది. పహల్గామ్ ఉగ్రదాడికి మూల్యంగా పాకిస్తాన్ బలూచిస్తాన్‌ని చెల్లించబోతోంది.
Pak train hijack: పాకిస్తాన్ బలూచిస్తాన్ ప్రావిన్సులో బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) సంచలన చర్యకు పాల్పడింది. బలూచ్ రాజధాని క్వెట్టా నుంచి ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాజధాని పెషావర్‌కి వెళ్తున్న ‘‘జాఫర్ ఎక్స్‌ప్రెస్’’ రైలుని హైజాక్ చేశారు. దాదాపుగా 500 మందితో ప్రయాణిస్తున్న రైలును బలూచ్ వేర్పాటువాదులు తమ అదుపులోకి తీసుకున్నారు.
Pakistan: పాకిస్తాన్ ప్రావిన్స్ బలూచిస్తాన్‌లో ట్రైన్ హైజాక్‌కి గురైంది. బలూచిస్తాన్ విముక్తి కోసం పోరాడుతున్న ‘‘బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ)’’ పాక్ రైల్వేకి చెందిన జాఫర్ ఎక్స్‌ప్రెస్‌ని హైజాక్ చేశారు. ఈ రైలు బలూచ్ రాజధాని క్వెట్టా నుంచి ఖైబర్ ఫఖ్తుంఖ్వా రాజధాని పెషావర్‌కి వెళ్తోంది. ఈ క్రమంలోనే ట్రైన్‌పై దాడి చేసిన బీఎల్ఏ 450 మంది ప్రయాణికులను బందీలుగా తీసుకున్నారు.
Balochistan: పాకిస్తాన్‌లో అతిపెద్ద ప్రావిన్స్ ‘‘బలూచిస్తాన్’’ విముక్తి కోసం అనేక ఏళ్లుగా పోరాటాలు జరుగుతున్నాయి. తమ ప్రాంతాన్ని పాకిస్తాన్ అన్యాయంగా కలుపుకుందని, తమ వనరులను పాకిస్తాన్ దోచుకుంటోందని అక్కడి ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇలా ఆరోపించే వారిని పాక్ ఆర్మీ కిడ్నాప్ చేసి, క్రూరంగా హత్యలకు పాల్పడుతుందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. నిజానికి పాక్ ఆర్మీ బలూచిస్తాన్‌లో మానవహక్కుల ఉల్లంఘనకు పాల్పడుతుందనేది స్పష్టం. తాజాగా, ఈ రోజు బలూచ్ రాజధాని క్వె్ట్టా నుంచి ఖైబర్ ఫఖ్తుంఖ్వాలోని పెషావర్ వెళ్లున్న…
Pakistan: పాకిస్తాన్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ(BLA) వీరంగం సృష్టిస్తోంది. బలూచిస్తాన్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతున్న వీరు, ఏకంగా ‘‘జాఫర్ ఎక్స్‌ప్రెస్’’ రైలును హైజాక్ చేయడం సంచలనంగా మారింది. బలూచిస్తా్న్లోని బోలాన్ జిల్లాలో బీఎల్ఏ దాడి చేసింది. రైలుని తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు బీఎల్ఏ ప్రకటించింది. ఈ ట్రైన్ బలూచ్ రాజధాని క్వెట్టా నుంచి ఖైబర్ ఫఖ్తుంఖ్వాలోని పెషావర్‌కి వెళ్తున్న సమయంలో ఈ దాడి జరిగింది. Read Also: Hyderabad : గుడిలో శివ పార్వతల విగ్రహాలు ఎత్తుకెళ్లిన…
Pakistan: పాకిస్తాన్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్ఏ) మంగళవారం ‘‘జాఫర్ ఎక్స్‌ప్రెస్’’ రైలుని హైజాక్ చేశారు. పాక్ నుంచి బలూచిస్తాన్ స్వాతంత్య్రం కోసం డిమాండ్ చేస్తున్న బీఎల్ఏ తమ ఆధీనంలోకి 100 మందికిపైగా ప్రయాణికులను అదుపులోకి తీసుకుని, బందీలుగా చేసుకున్నట్లు తెలిపింది. ఆరుగురు పాకిస్తాన్ సైనిక సిబ్బంది కూడా ఈ సంఘటనలో మరణించినట్లు వెల్లడించింది.