BLA: 39 ప్రాంతాల్లో పాక్ ఆర్మీపై బలూచిస్థాన్ దాడులు.. మరో పట్టణం స్వాధీనం!
- పాకిస్థాన్‌పై బలోచ్ లిబరేషన్ ఆర్మీ దాడులు
- 39 ప్రాంతాల్లో దాడులు చేసినట్లు ప్రకటన
- మంగోచర్‌ను స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశం నుంచి తాము విడిపోతామని, స్వాతంత్రం కావాలంటూ బలూచిస్థాన్ ప్రజలు పాకిస్థాన్‌తో పోరాడుతున్నారు. ఓవైపు భారత్‌తో ఉద్రిక్తతలు కొనసాగుతుండగానే.. బలూచిస్థాన్ వేర్పాటువాద సంస్థలు పాక్ సైన్యంపై దాడులు చేస్తున్నాయి. ఇలా ఇరువైపుల నుంచి తమపై దాడి జరుగుతుండగా.. పాక్ అల్లాడిపోతుంది. అయితే ఇదే సరైన సమయం అని బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీ భావిస్తోంది. బలూచిస్థాన్ ఇప్పటికే కీలక నగరం క్వెట్టా సహా చాలా ప్రాంతాలను స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అక్కడి నుంచి పాక్ ఆర్మీని తరిమికొట్టినట్లు ఇటీవల పేర్కొంది. తాజాగా మరో బలూచీ మరో కీలక ప్రకటన చేసింది. బలోచిస్థాన్ వ్యాప్తంగా 39 ప్రాంతాల్లో మెరుపు దాడులు చేశామని వెల్లడించింది.
READ MORE: IND PAK War: ఇక దబిడి దిబిడే.. ఏ ఉగ్రదాడి జరిగినా యుద్దంగానే పరిగణిస్తాం..!
Also Read
- Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
- Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
- Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
- Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
బలోచిస్థాన్ ప్రావిన్స్‌లో గల కాలత్ జిల్లా మంగోచర్ పట్టణాన్ని తాము స్వాధీనం చేసుకున్నట్లు బలోచ్ లిబరేషన్ ఆర్మీ (బీఎల్‌ఏ) శనివారం ప్రకటించింది. ఈ ఆపరేషన్ ఇలాగే కొనసాగుతోందని స్పష్టం చేసింది. మిలిటరీ కాన్వాయ్‌లపై దాడులు చేస్తామని హెచ్చరించింది. స్థానికంగా ఉన్న పలువురు పోలీసులను బందీలుగా తీసుకున్నామని ప్రకటనలో పేర్కొంది. పోలీసు స్టేషన్‌ను తమ ఆధీనంలోకి తీసుకున్నట్లు చెప్పుకొచ్చింది. రహదారులను సైతం దిగ్బంధించి పాకిస్థాన్‌కు కుంపటిలా మారింది. ఇటు భారత సైన్యం, అటు బలోచ్ లిబరేషన్ ఆర్మీ మధ్య శత్రుదేశం పాకిస్థాన్ నలిగిపోతోంది. ఏం చేయాలో అర్థం కాక తల్లడిల్లుతోంది. రాజీకి సిద్ధమంటూ ప్రభుత్వంలోని కీలక మంత్రులు ఇప్పటికే క్లారిటీ ఇస్తున్నారు.
READ MORE: Khawaja Asif: భారత్‌పై పాకిస్థాన్ అణ్వాయుధాలు ప్రయోగిస్తుందా? పాక్ రక్షణ మంత్రి క్లారిటీ..
తాజావార్తలు
-
Shai Hope: భారత్‌ను ఎదుర్కోవాలంటే ఆ స్కోర్ సరిపోదు.. ఓటమికి ప్రధాన కారణం ఇదే: వెస్టిండీస్ కెప్టెన్
-
Earthquake : ఉత్తరాఖండ్‌లో భూకంపం.. ఢిల్లీ-ఎన్సీఆర్ వరకు ప్రకంపనలు!
-
Shreyas Iyer: సెంచరీతో శ్రేయాస్ అయ్యర్ వీర విహారం.. వెస్టిండీస్ చిత్తు చిత్తు.. భారత్ ఘన విజయం..
-
Wife Kills Husband: ప్రియుడితో కలిసి భర్తను చంపిన భార్య.. ఫోన్ చాట్‌తో వెలుగులోకి దారుణం..
-
Team India New Captain: బీసీసీఐ సంచలన నిర్ణయం.. భారత మహిళా జట్టుకు కొత్త కెప్టెన్ ప్రకటన..
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!