Pakistan: బలూచిస్తాన్‌లో బీఎల్ఏ ధమాకా.. 22 మంది పాక్ సైనికుల హతం..
- పాకిస్తాన్‌లో బలూచ్ లిబరేషన్ ఆర్మీ ధమాకా..
- బలూచిస్తాన్‌లో వీరంగం సృష్టిస్తున్న బీఎల్ఏ..
- 22 మంది పాక్ సైనికుల్ని హతమార్చిన ఫైటర్స్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pakistan: పాకిస్తాన్ భారత్‌తో యుద్ధం చేయకముందే, బలూచిస్తాన్‌ని కోల్పోయేలా ఉంది. బలూచిస్తాన్ ప్రావిన్స్ వ్యాప్తంగా బలూచ్ లిబరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) విస్తృతంగా దాడులు నిర్వహిస్తోంది. పాక్ ప్రభుత్వం, ఆర్మీని టార్గెట్ చేస్తూ బీఎల్ఏ యోధులు విరుచుకుపడుతున్నారు. భారత్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో పాక్ ఆర్మీ తన బలగాలను ఎల్ఓసీ, భారత్ ఇతర సరిహద్దులకు తరలించింది. దీంతో, బీఎల్ఏ ఫైటర్స్ అక్కడ ఉన్న పాక్ ఆర్మీకి చుక్కలు చూపిస్తోంది. బీఎల్ఏ దెబ్బకు పలువురు పాక్ సైనికులు పలాయనం చిత్తగిస్తున్నారు.
Read Also: Pahalgam terror attack: ప్రధాని మోడీతో జమ్మూ కాశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా భేటీ..
Also Read
- Solar Storm: రేపు భూమిని తాకనున్న శక్తివంతమైన సౌర తుఫాను.. భారత్‌పై ప్రభావం ఎంత?
- Panama Earthquake: 7.7 తీవ్రతతో భారీ భూకంపం.. ఊగిపోయిన భవంతులు.!
- Netanyahu: ఆమె యూదు వ్యతిరేకి.. నవీ పిళ్లైకు నోబెల్ బహుమతి ఇవ్వడంపై నెతన్యాహు తీవ్ర వ్యాఖ్యలు
- US-New York: ఐదేళ్ల చిన్నారి ముందే కాల్పులు.. ట్రంప్ అధికారులతో మేయర్ మమ్దానీ వాగ్వాదం!
ఏప్రిల్ 29-30 మధ్య రాత్రి ప్రావిన్స్‌లోని తర్బాత్, డుక్కీ, తన్నుక్ ప్రాంతంలో బీఎల్ఏ జరిపిన దాడుల్లో 22 మంది పాకిస్తాన్ సైనికులు హతమయ్యారు. తెల్లవారుజామున జరిగిన దాడుల్లో పాక్ సైన్యం తీవ్రంగా దెబ్బతిన్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని బీఎల్ఏ ప్రతినిధి జీయంద్ బలూచ్ వెల్లడించారు. ఈ ఆపరేషన్‌లో పాక్ ఆర్మీ కాన్వాయ్‌ని కూడా లక్ష్యంగా చేసుకున్నట్లు వెల్లడించారు. బీఎల్ఏ కూడా ముగ్గురు ఫైటర్లను కోల్పోయినట్లు చెప్పారు. ఇదిలా ఉంటే, బలూచిస్తాన్‌లోని కీలక పట్టణాలను బీఎల్ఏ తన ఆధీనంలోకి తీసుకుంది. కలాట్ జిల్లాలోని మంగోచార్ పట్టణాన్ని బీఎల్ఏ తన స్వాధీనం చేసుకుంది. అనేక ప్రభుత్వ భవనాలతో ఆధీనంలోకి తీసుకుంది. ఒక భవనానికి నిప్పుపెట్టింది.
తాజావార్తలు
-
Flydubai: ఫ్లై దుబాయ్ దర్యాప్తులోకి ఎన్ఐఏ.. యూఏపీఏ కింద కేసు నమోదు
-
Vijay Deverakonda :3 -4 నెలల పాటు రాయలసీమ మాండలికంపై సాధన చేశా
-
Delhi Protest: సీజేపీకి వ్యతిరేకంగా, పోలీసులకు మద్దతుగా.. ఢిల్లీలో మరో నిరసన..
-
Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
-
Vijay Deverakonda : నా సినిమాలకు టికెట్ ధరలు ఎప్పటికీ పెంచబోను.. విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం!
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!