Balochistan: ఓ వైపు భారత్ దాడులతో దిక్కుతోచని స్థితిలో పాకిస్తాన్ కాళ్ల బేరానికి వచ్చింది. మరోవైపు, బెలూచిస్తాన్‌లో బలూచ్ లిజరేషన్ ఆర్మీ(బీఎల్ఏ) దాడులకు పాకిస్తాన్ వణికిపోతోంది. పాక్ ఆర్మీని, పంజాబ్‌కి చెందిన వారిని బీఎల్ఏ వెతికి వేటాడి హతమారుస్తోంది. తాజాగా, బీఎల్ఏ తాము చేసిన దాడులను వెల్లడించింది. 51 ప్రాంతాల్లోని పాకిస్తాన్ సైన్యంపై 71 దాడులు చేశామని చెప్పింది. తాము ఏ దేశానికి కూడా ప్రాక్సీగా పనిచేయడం లేదని చెప్పింది. బీఎల్ఏ ఏ దేశానికి బంటు కాదని చెప్పింది.
Read Also: AP Crime: ఎన్టీఆర్ జిల్లాలో మహిళ సూసైడ్ కలకలం.. సెల్ఫీ వీడియోలో ఎమ్మెల్యేకి వినతి..!
బెలూచిస్తాన్ ప్రాంతంలో ప్రస్తుత, భవిష్యత్ సైనిక, రాజకీయ వ్యూహాత్మక నిర్మాణంలో తాము కీలక పాత్రగా ఉన్నామని చెప్పింది. పాకిస్తాన్ ఉగ్రవాదానికి, మోసపూరిత శాంతికి కారణమని ఆరోపించింది. భారతదేశాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. పాకిస్తాన్ నుంచి వచ్చే శాంతి, కాల్పుల విరమణ, సోదరభావం ప్రతీ చర్చ కేవలం మోసం, యుద్ధ వ్యూహం, తాత్కాలిక ఉపాయం’’ అని హెచ్చరించింది.
పాకిస్తాన్ సైన్యం, ఐఎస్ఐ ఉగ్రవాదానికి నిలయంగా ఉందని బీఎల్ఏ ఆరోపించింది. లష్కరే తోయిబా, జైషే మహ్మద్, ISIS వంటి ప్రాణాంతక ఉగ్రవాద గ్రూపులకు పాకిస్తాన్ మద్దతు ఇస్తుందని చెప్పింది. భారతదేశంతో సహా అంతర్జాతీయ సమాజానికి రాజకీయ, దౌత్య, రక్షణ మద్దతు కోసం బీఎల్ఏ విజ్ఞప్తి చేసింది. ఇది శాంతియుత, సంపన్న, స్వతంత్ర బెలూచిస్తాన్‌కి మార్గం సుగమం చేస్తుందని పేర్కొంది. ప్రపంచం నుంచి ముఖ్యంగా భారత్ నుంచి సాయం లభిస్తే బెలూచిస్తాన్ దేశం ఈ ఉగ్రవాద రాజ్యాన్ని నిర్మూలించగలదు అని బీఎల్ఏ పేర్కొంది. పాకిస్తాన్‌ని సహిస్తే, దీని ఉనికి ప్రపంచానికి ప్రమాదం అని చెప్పింది.