Balineni Srinivasa Reddy: వైసీపీకి షాక్..! ఆ బాధ్యతల నుంచి తప్పుకున్న బాలినేని..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balineni Srinivasa Reddy: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చారు పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్‌రెడ్డి.. పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ బాధ్యతల నుంచి తప్పుకున్నారు బాలినేని.. చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్‌గా ఉన్న బాలినేని.. ప్రస్తుతం స్వల్ప అస్వస్థతతో హైదరాబాద్‌లో ఉన్నారు బాలినేని.. కాగా, ఆయన రీజనల్ కో-ఆర్డినేటర్ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలినట్టు అయ్యింది.. అయితే, సీఎం వైఎస్ జగన్ తొలి కేబినెట్‌లో మంత్రిగా పనిచేసిన బాలినేనికి.. జగన్ 2 కేబినెట్‌లో చోటు దక్కలేదు.. ఈ సమయంలోనూ ఆయన అలకబూనడం.. వైసీపీ అధిష్టానం, సీఎం జగన్ ఆయనకు నచ్చజెప్పారు.. ఆ తర్వాత పార్టీ బాధ్యతలను అప్పగించారు.. కొన్ని సందర్భాల్లో మినహా.. పార్టీ కార్యక్రమాలు యాక్టివ్‌గా ఉన్న బాలినేని ఉన్నట్టుండి ఇప్పుడు బాధ్యతల నుంచి తప్పుకోవడం చర్చగా మారింది..
Read Also: Minister RK Roja: రజనీకాంత్ వ్యాఖ్యలకు మంత్రి రోజా కౌంటర్.. ఎన్టీఆర్ అభిమానులను బాధపెట్టేలా..!
Also Read
- Modi-Xi Jinping: ‘ఈజ్ ఇట్ ఓకే?’.. షీ జిన్‌పింగ్‌ను చూసి ప్రసంగం ఆపిన మోడీ.. అసలేం జరిగిందంటే?
- Glaciers: వేడెక్కుతున్న భూమితో ఏం జరగబోతోంది?
- BRICS Currency: బ్రిక్స్ కరెన్సీపై భారత్ కీలక ప్రకటన.. కామన్ కరెన్సీపై ఫుల్ క్లారిటీ..!
- Osama Bin Laden: సీఐఏ సంచలన నివేదిక.. 9/11 కంటే ముందే భారత్‌లో దాడులకు ఒసామా బిన్ లాడెన్ ప్లాన్..
మరోవైపు.. ఈ మధ్య ప్రకాశం జిల్లా మార్కాపురం సీఎం జగన్ పర్యటనలో మాజీ మంత్రి, వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. బాలినేనికి ప్రొటోకాల్‌లో ప్రాధాన్యత ఇవ్వలేదు అధికారులు. మార్కాపురంలో సీఎం జగన్‌కు స్వాగతం పలికేందుకు హెలిప్యాడ్ వద్దకు వెళ్తున్న బాలినేని శ్రీనివాసరెడ్డి వాహనాలను అధికారులు అడ్డుకున్నారు. అధికారుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన బాలినేని… అక్కడి నుంచి వెళ్లిపోయారు. నచ్చజెప్పేందుకు మంత్రి ఆదిమూలపు సురేష్, జిల్లా ఎస్పీ, ఇతర నేతలు ప్రయత్నించినా బాలినేని శాంతించలేదు. సీఎం కార్యక్రమంలో పాల్గొనకుండానే తన అనుచరులతో ఆయన ఒంగోలుకు వెనుదిరిగారు. విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకెళ్లారు సీఎంవో అధికారులు. ముఖ్యమంత్రిని కలవాల్సిందిగా బాలినేనికి తెలిపారు. అయితే, మార్కాపురంలో ఈబీసీ నేస్తం సభ ప్రారంభమయ్యేసరికి.. అక్కడ వేదికపై కనిపించారు బాలినేని శ్రీనివాసరెడ్డి. సీఎంవో అధికారుల సూచనతో ముఖ్యమంత్రి జగన్‌ను కలిసేందుకు.. ఈబీసీ నేస్తం సభా వేదిక దగ్గరకు ఆయన వెళ్లారు. సభావేదిక పైకి బాలినేనిని పిలిపించి.. ఆయనతో ఈబీసీ నేస్తం డీబీటీ బటన్‌ను సీఎం వైఎస్ జగన్ నొక్కించిన విషయం విదితమే. ఇక, బాలినేని శ్రీనివాస్ రెడ్డి సీనియర్ నాయకుడు.. ఆయన గౌరవానికి ఎలాంటి భంగం ఉండదంటున్నారు వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు.. ఆయనతో పార్టీ నేతలు మాట్లాడుతారు.. ఇదంతా టీ కప్పులో తుఫాన్ లాంటిదే అంటున్నారు.. కానీ, బాలినేని ఎపిసోడ్ ఎటు మలుపు తీసుకుంటుంది అనేది ఆసక్తికరంగా మారింది.
తాజావార్తలు
-
Modi-Xi Jinping: ‘ఈజ్ ఇట్ ఓకే?’.. షీ జిన్‌పింగ్‌ను చూసి ప్రసంగం ఆపిన మోడీ.. అసలేం జరిగిందంటే?
-
Glaciers: వేడెక్కుతున్న భూమితో ఏం జరగబోతోంది?
-
BRICS Currency: బ్రిక్స్ కరెన్సీపై భారత్ కీలక ప్రకటన.. కామన్ కరెన్సీపై ఫుల్ క్లారిటీ..!
-
Khairatabad Bada Ganesh : ఖైరతాబాద్ బడా గణేష్ రెడీ.. ఈసారి పంచముఖ రూపంలో దర్శనం!
-
Kashi Majili OTT: ‘కాశీ మజిలీ’తో రీఎంట్రీ ఇచ్చిన రేణు దేశాయ్.. ‘ఈటీవీ విన్’లో ఎమోషనల్ లవ్ స్టోరీ!
ట్రెండింగ్
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?
-
Lemon Storage Tips: రసం తగ్గకుండా, రుచి మారకుండా నిమ్మకాయలు నెల రోజులు తాజాగా ఉండాలంటే ఈ సింపుల్ ట్రిక్స్ ఫాలో అయితే చాలు.!