Balineni Srinivasa Reddy: బాలినేని రాజీనామాపై వైసీపీలో ఉత్కంఠ.. నేడు సీఎం జగన్‌తో భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Balineni Srinivasa Reddy: మాజీమంత్రి, వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ బాలినేని శ్రీనివాసరెడ్డి రాజీనామా విషయంలో వైసీపీ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది.. నాలుగు రోజుల క్రితం వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ పదవి నుంచి తప్పుకుంటున్నట్లు అధిష్టానానికి సమాచారమిచ్చారు బాలినేని.. ప్రస్తుతం నెల్లూరు, తిరుపతి, కడప జిల్లాల రీజనల్ కో ఆర్డినేటర్ గా ఉన్న బాలినేని.. ఆ పదవి నుంచి తప్పుకుంటున్నట్టు పార్టీ పెద్దలకు సమాచారాన్ని చేరవేశారు. అయితే, రాజీనామా వ్యవహారంలో వైసీపీ పెద్దలు రంగంలోకి దిగి మాట్లాడేందుకు ప్రయత్నించినా బాలినేని వెనక్కి తగ్గడంలేదు.. దీంతో, నేరుగా సీఎం వైఎస్ జగన్‌తో మాట్లాడాలంటూ సీఎంవో అధికారుల నుంచి ఆయనికి సమాచారం వెళ్లిందట.. దీంతో.. హైదరాబాద్ నుంచి తాడేపల్లికి బయల్దేరి వెళ్లారు బాలినేని.. ఈ రోజు మధ్యాహ్నం 2 గంటలకు సీఎం జగన్ తో సమావేశం కాబోతున్నారు.. సీఎం జగన్, బాలినేని శ్రీనివాస్ రెడ్డి మధ్య జరిగే భేటీలో ప్రస్తావనకు వచ్చే అంశాలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Read Also: Pawan Kalyan: అకాల వర్షాలతో రైతాంగం నష్టాల పాలైంది.. ఆదుకోండి..
Also Read
- Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
- AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
- Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
- Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
కాగా, ఏడాది క్రితం జరిగిన క్యాబినెట్ విస్తరణలో మళ్లీ తనకు చోటు దక్కలేదని తీవ్ర అసంతృప్తికి గురయ్యారు బాలినేని. ఆయన అనుచరులు హంగామా చేయటం, సజ్జల లాంటి వ్యక్తి బాలినేని ఇంటికి రెండు మూడు దఫాలు తిరిగి బుజ్జగించటం చకచకా జరిగిపోయాయి. ఆ తర్వాత సీఎం జగన్ సైతం క్యాంపు ఆఫీసుకు బాలినేనిని పిలిపించుకొని స్వయంగా మాట్లాడారు. దీంతో అప్పట్లో బాలినేని అలకపాన్పు దిగారు. తాజాగా సీఎం జగన్ సభలో ప్రొటోకాల్ అంశం బాలినేనిలో అసంతృప్తికి కారణం అయ్యిందనే చర్చ జరుగుతోందట. అయితే, మరోసారి సీఎం జగన్‌తో బాలినేని సమావేశం కానుండడంతో.. వెనక్కి తగ్గేదే లేదంటున్న బాలినేని మళ్లీ మెత్తబడతారా? యథావిథిగా వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ పోస్ట్‌లో కొనసాగుతారా? అనే అంశాలపై ఉత్కంఠ నెలకొంది.
తాజావార్తలు
-
Pakistan Cricket: గోల్డ్ మెడల్ వదిలేసి.. ఆ సిక్సరే హైలైట్ అంటున్న పాక్ క్రికెట్!
-
Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
-
AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
-
Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
-
Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!