కడప జిల్లా బద్వేల్‌లో శనివారం పోలింగ్ జరగనుంది. ఇదిలా వుంటే బద్వేల్ నియోజకవర్గంలోని కలసపాడు మండలంలో భారీ వర్షం కురిసింది. రాత్రి నుంచి ఎడతెరిపిలేని వర్షం పడింది. దీంతో బద్వేల్ ఉపఎన్నిక చల్లటి వాతావరణంలో భారీ బందోబస్తు నిర్వహిస్తున్నారు పోలీసులు, ఇతర అధికార సిబ్బంది. వర్షం కురుస్తున్నా పోలీస్ వాళ్ళు విధుల్లో నిమగ్నమై ఉన్నారు. మరోవైపు మరికొద్ది గంటల్లో జరిగే బద్వేల్ ఉప ఎన్నికకు సర్వం సిద్దం చేసింది అధికారయంత్రాంగం. బద్వేల్ ఉపఎన్నిక లో మొత్తం 281…
బద్వేల్ పోలింగ్‌కి రంగం సిద్ధమయింది. గెలుపు వైసీదే అని నిర్దారణ అయినా బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు మేం కూడా వున్నామని పోటీలో ముందుకెళుతున్నాయి. ఓట్లు ఎన్ని పడతాయో తెలీదు కానీ ఒట్టికుండకు హడావిడి ఎక్కువ అన్న చందంగా వేలల్లో ఓట్లు సాధిస్తామంటున్నాయి రెండు జాతీయ పార్టీలు. అయితే బద్వేల్ ఎన్నికలలో బెట్టింగ్ రాయుళ్ళు రూట్ మార్చారు. బద్వేల్‌లో వైసీపీ భారీ మెజారిటీతో గెలుస్తుందనే వార్తలతో ఉప ఎన్నికలపై ఆసక్తి చూపడం లేదు బెట్టింగ్ బంగర్రాజులు. వైసీపీ అభ్యర్థి…
ఏపీలో ఉప ఎన్నిక రాజకీయం రచ్చరచ్చగా మారింది. పోటీలో వున్న బీజేపీ అక్కడ ఎన్నికల తీరుపై ఈసీకి వినతిపత్రాలు, ఫిర్యాదులు చేస్తూనే వుంది. తాజాగా బద్వేల్ ఉపఎన్నిక రిటర్నింగ్ అధికారిని బదిలీ చేయాలని బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీర్రాజు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు సోమువీర్రాజు. బద్వేల్ ఉపఎన్నికలలో లా అండ్ ఆర్డర్ కాపాడడంలో విఫలమయ్యారని, ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించి ఊరేగింపు, ర్యాలీలు నిర్వహిస్తున్నారని లేఖలో పేర్కొన్నారు. బద్వేల్ లో వైసీపీ అభ్యర్థి,…
ఆంధ్రప్రదేశ్‌లోని బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి జరుగుతోన్న ఉప ఎన్నిక కాక రేపుతోంది.. బీజేపీ మండల అధ్యక్షుడు ఇప్పుడు వైసీపీలో చేరడం హీట్ పెంచుతోంది… ఈ విషయాన్ని ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికే తీసుకెళ్లింది భారతీయ జనతా పార్టీ.. అధికార వైసీపీపై కేంద్ర ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేశారు బీజేపీ నేతలు జీవీఎల్, సునీల్ దేవధర్. బద్వేల్ ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగం, హింస, బెదిరింపులు, ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు పాల్పడుతోంది…
బద్వేల్ ఉప ఎన్నికలో అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నరసింహారావు.. ఢిల్లీలో మీడియాతో మాట్లాడిన ఆయన.. అన్ని అక్రమాలకు పాల్పడుతున్న అధికార పార్టీ, మంత్రి పెద్దిరెడ్డి, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.. అధికార పార్టీ యథేచ్చగా బెదరింపులకు పాల్పడుతుందని విమర్శించిన బీజేపీ ఎంపీ.. రాష్ట్ర మంత్రి పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి, ఎంపీ అవినాష్ రెడ్డితో సహా బెదరింపులకు దిగుతున్నారని.. బీజేపీ మండల…
2019 ఎన్నికల్లో ఘన విజయం తర్వాత ఏపీలో అధికార పార్టీ వైసీపీ దూకుడు మీద వుంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఏ ఎన్నికలు జరిగినా.. అక్కడ ఫ్యాన్ గాలి హవా కొనసాగుతూనే వుంది. తాజాగా సీఎం స్వంత జిల్లా కడపలోని బద్వేల్ ఉప ఎన్నిక జరగనుంది. ఈ నెల 30న ఎన్నికల పోలింగ్ నిర్వహించనుంది ఎన్నికల సంఘం. నవంబర్ 2వ తేదీన ఫలితాలు విడుదల కానున్నాయి. బద్వేల్‌లో ప్రధాన ప్రతిపక్షం టీడీపీ, జనసేనలు పోటీలో లేవు. కానీ,…
బద్వేల్ వైసీపీ ఎమ్మెల్యే మరణంతో ఏపీలో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ స్థానంలో వైసీపీ తరుఫున దివంగత బద్వేల్ మాజీ ఎమ్మెల్యే సతీమణి బరిలో ఉన్నారు. బద్వేల్ నియోజకవర్గం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి సొంత జిల్లాలో ఉండటంతో ఇక్కడ వైసీపీకి గెలుపు నల్లేరు మీద నడకే అన్న చందంగా మారింది. ఓటమిని ముందుగానే గుర్తించిన టీడీపీ, జనసేన పార్టీలు ముందుగానే ఇక్కడ పోటీ నుంచి తప్పుకున్నాయి. అనుహ్యంగా బీజేపీ, కాంగ్రెస్ రేసులో నిలువడంతో ఎన్నిక అనివార్యమైంది.…
కడప జిల్లాలో ఈ నెల 30న జరగనున్న బద్వేల్ ఉప ఎన్నికలపై బీజేపీ సీరియస్ అయింది. కడప నగరంలోని ఆర్.అండ్.బీ అతిథి గృహంలో కేంద్ర ఎన్నికల పరిశీలకులు భీష్మ కుమార్ ను కలిసి బీజేపీ రాష్ట్ర అద్యక్ష్యులు సోము వీర్రాజు ఫిర్యాదు చేశారు. ఎన్నికల పరిశీలకులను కలిసిన వారిలో జాతీయ కార్యదర్శి సత్యకుమార్, బీజేపీ రాష్ట్ర ఇన్చార్జి సునీల్ దేవధర్, రాజ్యసభ సభ్యులు సీఎం రమేష్, జీవీఎల్, మాజీ మంత్రి ఆదినారాయణ రెడ్డి, విష్ణువర్ధన్ రెడ్డి వున్నారు.…
బద్వేల్ ఉప ఎన్నిక ప్రచారం ముగింపు దశకు చేరుకుంది. మరో నాలుగు రోజుల్లో ప్రచారం ముగియనుండగా అక్టోబర్ 30న పోలింగ్ జరుగనుంది. బద్వేల్ లో వైసీపీ గెలుపు ఏకపక్షంగానే కన్పిస్తుండటంతో ఆపార్టీ భారీ మోజార్టీపై గురిపెట్టింది. అందుకు తగ్గట్టుగానే వైసీపీ శ్రేణులు నియోజకవర్గంలో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకే ఓటు వేయాలని నేతలంతా ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే టీడీపీ తమ్ముళ్లు మాత్రం ఎవరికీ ఓటు వేయాలో తెలియక అయోమయానికి గురవుతున్నారు. బద్వేల్…
ఈనెల 30న జరుగనున్న బద్వేల్ ఉప ఎన్నిక కోసం అధికార వైసీపీ, విపక్షాలైన కాంగ్రెస్, బీజేపీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. బద్వేల్ ఎన్నికల ప్రచారంలో కేంద్ర పశుసంవర్థక, మత్స్య , ప్రసార శాఖ మంత్రి మురుగన్ పాల్గొన్నారు. వైసీపీ పాలనలో బద్వేల్ అభివృద్ధి జరగలేదన్నారు కేంద్ర మంత్రి మురుగన్. అభివృద్ధి ప్రభుత్వం కావాలో.. లిక్కర్ ప్రభుత్వం కావాలో తేల్చుకోవాలన్నారు. బద్వేల్ ఎన్నికల ప్రచారం కోసం వచ్చిన కేంద్ర పశుసంవర్థక, మత్స్య , ప్రసార శాఖ మంత్రి మురగన్ కడప…