హుజురాబాద్ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్ విజయం 22వ రౌండ్ లో కూడా బీజేపీ హవా… బీజేపీ 1,07,022 ఓట్లు, టీఆర్ఎస్ 83,167 ఓట్లు. 23,855 ఓట్ల ఆధిక్యంతో గెలిచిన ఈటల 21వ రౌండ్ లోనూ బీజేపీ హవా. బీజేపీ 1,01,732 ఓట్లు, టీఆర్ఎస్ 78,997 ఓట్లు. 21వ రౌండ్ ముగిసే సరికి బీజేపీకి 22,735 ఓట్ల ఆధిక్యం. 20వ రౌండ్ లోనూ బీజేపీ హవా… 20వ రౌండ్ లో బీజేపీ కి 1,474 ఓట్ల ఆధిక్యం…
కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికలో వైసీపీ దూసుకుపోతుండగా.. జాతీయ పార్టీ కాంగ్రెస్ కుదేలయింది. ఆరోరౌండ్ తర్వాత వైసీపీకి 52,044 ఓట్ల ఆధిక్యం లభించింది. పోటీలో నిలబడి పరువు కోల్పోయిందనే భావన కాంగ్రెస్ కార్యకర్తలు, నేతల్లో వుంది. బద్వేల్ బరికి టీడీపీ, జనసేన దూరంగా వున్నాయి. బద్వేల్‌లో బీజేపీ, కాంగ్రెస్‌లకు గొప్ప ఓటు బ్యాంకు ఉందా అంటే అంత సీన్ లేదు. 2019 ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్‌కు అక్షరాల 2వేల 148 ఓట్లు పోలయ్యాయి. ఇక…
బద్వేల్ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు మరికాసేపట్లో రాబోతున్నాయి. ఇప్పటికే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు పూర్తయింది. పోస్టల్ బ్యాలెట్ లో అధికార వైసీపీ ఆధిక్యాన్ని కనబరిచింది. వైసీపీ, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల త్రిముఖ పోటీ జరిగినప్పటికీ వైసీపీ గెలిచే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయని ఇప్పటికే సర్వేలు తెలిపాయి. ఎంత మెజారిటీ వస్తుంది అనే దానిమీదనే అందరి దృష్టి నిలిచింది. Read: లైవ్ అప్డేట్స్: హుజురాబాద్, బద్వేల్ ఎన్నికల ఫలితాలు బద్వేల్ ఉప…
బద్వేల్ ఉప ఎన్నికకు సంబంధించి ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. బద్వేల్‌లోని బాలయోగి గురుకుల పాఠశాలలో ఓట్ల లెక్కింపును నిర్వహిస్తున్నారు. లెక్కింపు సందర్భంగా మూడంచెల భద్రతను, కౌంటింగ్ కేంద్రాల వద్ధ 144 సెక్షన్‌ను అమలు చేస్తున్నారు. ఉదయం 8 గంటల నుంచి పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు ప్రారంభం అయింది. మొదటి అరగంటపాటు పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించారు. తాజా సమాచారం ప్రకారం పోస్టల్ బ్యాలెట్ ఓట్లలో వైసీపీ ఆధిక్యంలో ఉన్నది. Read: లైవ్ అప్డేట్స్:…
గత నెల 30 వ తేదీన తెలుగు రాష్ట్రాల్లోని హుజురాబాద్, బద్వేల్ నియోజక వర్గాలకు ఉప ఎన్నికలను జరిగాయి. హుజురాబాద్‌లో ఈటల రాజేందర్ రాజీనామాతో ఉప ఎన్నిక అనివార్యం కాగా, బద్వేల్ ఎమ్మెల్యే మృతి కారణంగా ఉప ఎన్నిక అనివార్యం అయింది. గత సంప్రదాయాలను దృష్టిలో పెట్టుకొని బద్వేల్ ఉప ఎన్నిక ఏకగ్రీవం అవుతుందని అనుకున్నా, బీజేపీ బరిలో దిగడంతో ఎన్నిక నిర్వహించక తప్పలేదు. తెలుగు రాష్ట్రాల్లో రెండు నియోజక వర్గాల ఉప ఎన్నికలు సజావుగా ముగిశాయి.…
బద్వేల్ నియోజక వర్గం ఉప ఎన్నిక అక్టోబర్ 30న జరిగింది. మంగళవారం ఉప ఎన్నిక కౌంటింగ్ ప్రారంభం అవుతోంది. ఈ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్ధిగా దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య భార్య సుధ పోటీలో వున్నారు. ఆమె భారీ మెజారిటీతో గెలవడం ఖాయంగా కనిపిస్తోంది. బద్వేల్ నియోజకవర్గం 1952లో ఏర్పడింది. ఈ స్థానం ఎస్సీ రిజర్వ్‌డ్. ఇప్పటి వరకు 16 సార్లు ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ 7 సార్లు, టిడిపి 4 సార్లు, స్వతంత్ర పార్టీ, జనతా,…
అక్టోబర్ 30 వ తేదీన కడప జిల్లా బద్వేల్ నియోజక వర్గానికి ఉప ఎన్నిక జరిగింది. ఈ ఎన్నికల ఫలితాలు ఈరోజు వెలువడనున్నాయి. ఈరోజు ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. బద్వేల్‌లోని బాలయోగి గురుకుల పాఠశాలలో ఎన్నికల కౌంటింగ్‌కు సంబంధించి ఏర్పాట్లను అధికారులు ఇప్పటికే పూర్తి చేశారు. 4 హాళ్లలో మొత్తం 28 టేబుల్స్‌ను ఏర్పాటు చేశారు. ఒక్కో హాల్‌లో 7 టేబుల్స్‌ను ఏర్పాటు చేశారు. సూపర్‌వైజర్, మైక్రో అబ్జర్వేటర్ల పర్యవేక్షణలో కౌంటింగ్…
కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది.. మరికొన్ని గంటల్లో ఫలితం కూడా వెలువడనుంది.. ఈ ఎన్నికలకు తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీలు దూరంగా ఉండగా.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీ మాత్రం అభ్యర్థులను పోటీకి పెట్టాయి.. ఇక, బీజేపీ అభ్యర్థిని టీడీపీ, జనసేన సహకరించిందనే విమర్శలు కూడా ఉన్నాయి.. ఏకంగా కొన్ని పోలింగ్ బూతుల్లో బీజేపీ ఏజెంట్లుగా టీడీపీ నేతలను కూర్చున్నారంటూ సోషల్ మీడియాలో ఫొటోలు హల్‌చల్ చేశాయి. అయితే, ఈ ఎన్నికల్లో తమ రిస్థితి…
దేశవ్యాప్తంగా ఇవాళ 13 రాష్ట్రాల్లో 3 లోక్‌సభ స్థానాలు, 29 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికల పోలింగ్ జరుగుతోంది.. ఇందులో భాగంగా తెలుగు రాష్ట్రాల్లోనూ పోలింగ్ నిర్వహిస్తున్నారు.. ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ స్థానానికి, తెలంగాణలోని హుజురాబాద్ అసెంబ్లీ స్థానానికి ఎన్నికలు జరుగుతున్నాయి.. అయితే, పోలింగ్ విషయంలో రెండు స్థానాల్లో స్పందన మాత్రం ఒకేలా లేదు.. హుజరాబాద్‌తో పోలిస్తే.. బద్వేల్ మాత్రం బాగా వెనుకబడింది.. ఇక, పోలింగ్‌కు వస్తున్న స్పందన చూస్తుంటే.. హుజురాబాద్‌లో భారీగా పోలింగ్…
కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది.. సాయంత్రం ఏడు గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది.. ఎస్సీ రిజర్వ్‌డ్ సెగ్మెంట్ అయిన బద్వేల్‌లో మొత్తం రెండులక్షల 16వేల 206 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో పురుషులు లక్షా 8వేల 809 మంది, మహిళలు లక్షా 7వేల 375 మంది కాగా, థర్డ్ జెండ్ లో 22 మంది. ఇద్దరు మహిళలతో కలిపి మొత్తం 15 మంది అభ్యర్ధులు ఎన్నికల బరిలో ఉన్నారు. నియోజకవర్గంలో మొత్తం 281…