కడప జిల్లాలోని బద్వేల్‌కు ఉప ఎన్నికను అక్టోబర్ 30 వ తేదీన నిర్వహించబోతున్నారు. ఈ ఉప ఎన్నిక కోసం ఇప్పటికే ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ను రిలీజ్ చేసింది. కాగా, రేపు ఈ ఉప ఎన్నికకు సంబంధించిన గెజిట్‌ను విడుదల చేయబోతున్నారు. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం అవుతుంది. అక్టోబర్ 30 వ తేదీన ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 7 గంటల వరకు పోలింగ్ జరుగుతుంది. జిల్లా వ్యాప్తంగా ఇప్పటికే ఎన్నికల కోడ్ అమల్లోకి…
బద్వేల్ ఉప ఎన్నికపై ఫోకస్ పెట్టారు వైసీపీ అధినేత, సీఎం వైఎస్ జగన్.. ఇవాళ క్యాంపు కార్యాలయంలో.. పార్టీ అభ్యర్తి డాక్టర్ సుధ, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పార్టీ నాయకులతో సమావేశమైన ఆయన.. ఈ సందర్భంగా మాట్లాడుతూ పలు కీలక సూచనలు చేశారు. బద్వేల్ ఉప ఎన్నికకు పార్టీ ఇన్‌ఛార్జిగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఉంటారని తెలిపిన ఆయన.. వచ్చే సోమవారం నుంచి పార్టీ తరఫున కార్యక్రమాలు మొదలుపెట్టాలని ఆదేశించారు.. దివంగత ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య భార్య…
బద్వేల్ బై ఎలక్షన్ పై సీఎం జగన్ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. కాసేపట్లో బద్వేల్ ఉప ఎన్నిక కసరత్తు సమావేశం కానుంది. తాడేపల్లి సీఎం క్యాంపు కార్యాలయంలో కడప జిల్లా ఎమ్మెల్యేలు, మంత్రులు, సీనియర్ నేతలతో సమావేశం కానున్నారు సీఎం జగన్. ఎన్నికకు సంబంధించి నేతలకు బాధ్యతలు అప్పగించటం, అనుసరించాల్సిన వ్యూహాల పై నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం జగన్. ఈ సమావేశం కోసం క్యాంపు కార్యాలయానికి బద్వేల్ వైసీపీ అభ్యర్థి దాసరి సుధ, మంత్రి పెద్దిరెడ్డి,…
కేంద్ర ఎన్నికల సంఘం ఉప ఎన్నికలకు సంబంధించిన షెడ్యూల్ విడుదల చేయడంతో.. సీఎం సొంత జిల్లా కడపలోని బద్వేల్ నియోజకవర్గంవైపు ఇప్పుడు అందరి దృష్టి మళ్లింది.. ఇప్పటికే అధికార వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ డాక్టర్ సుధను ప్రకటించింది. ఇక, బద్వేల్ ఉప ఎన్నికలపై కసరత్తు ప్రారంభించారు సీఎం వైఎస్ జగన్.. రేపు తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో సీఎం జగన్‌ను కలవనున్నారు వైసీపీ అభ్యర్థి డాక్టర్ సుధ, అభ్యర్థి సుధతో పాటు జిల్లా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో ప్రత్యేకంగా సమావేశం…
ఈరోజు జనసేప పార్టీ నేతలతో పవన్ కళ్యాణ్ సమావేశం నిర్వహించబోతున్నారు. పార్టీ విస్తృతస్థాయి సమావేశాల్లో కీలక అంశాలపై చర్చించబోతున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వ విధానాలు, రోడ్ల మరమ్మత్తులు తదిత అంశాలతో పాటుగా, అక్టోబర్ 2 వ తేదీన పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి, అనంతపురం జిల్లాల్లో శ్రమదానం కార్యక్రమం చేపట్టబోతున్నారు. దీనిపై కూడా ఈరోజు సమావేశంలో చర్చించబోతున్నారు. అదేవిధంగా, అక్టోబర్ 30 వ తేదీన బద్వేలుకు ఉప ఎన్నిక జరగబోతున్నది. ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేసే అంశంపై…
దేశవ్యాప్తంగా 30 అసెంబ్లీ స్థానాలు, 3 లోక్‌సభ స్థానాలకు సంబంధించిన ఉప ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేసింది కేంద్ర ఎన్నికల సంఘం.. దీంతో తెలుగు రాష్ట్రాల్లోనూ ఎన్నికల సందడి మొదలైంది… తెలంగాణలోని హుజురాబాద్ అసెంబ్లీ స్థానంతో పాటు.. ఏపీలోని బద్వేల్ అసెంబ్లీ స్థానానికి కూడా ఇదే షెడ్యూల్ వర్తించనుంది.. అధికార వైసీపీకి చెందిన సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య మరణంతో బద్వేల్ ఉప ఎన్నిక జరుగుతుండగా… ఈ ఎన్నికల్లో తన అభ్యర్థిగా దాసరి సుధాను ప్రకటించింది వైఎస్‌ఆర్ కాంగ్రెస్…