కడప జిల్లా బద్వేల్ వైసీపీకి అత్యంత పట్టున్న నియోజకవర్గాల్లో ఒకటి. అలాంటి చోట ఇప్పుడు ఇన్ఛార్జ్ వార్ మొదలై... కేడర్‌లో గందరగోళం పెరుగుతోందట. 2004 ఎన్నికల్లో డీసీ గోవిందరెడ్డి మొట్టమొదటిసారిగా రాజకీయ ప్రవేశం చేసి ఫస్ట్ అటెంప్ట్‌లోనే ఎమ్మెల్యే అయ్యారు. అప్పటి వరకు కాంగ్రెస్‌లో కీలకంగా వ్యవహరించిన విశ్వనాధ్ రెడ్డి..
బద్వేల్ లో యువకుడి దుర్మార్గానికి బలైన బాలిక తల్లితో ఫోన్ లో మాట్లాడి పరామర్శించిన సీఎం చంద్రబాబు నాయుడు.. విద్యార్థిని కుటుంబ సభ్యలకు అండగా ఉంటామని ధైర్యం చెప్పారు.. బాధిత కుటుంబ సభ్యులచే సీఎం చంద్రబాబు నాయుడుతో ఫోన్‌లో మాట్లాడించారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులురెడ్డి.. ఇప్పటికే నిందితుడిని అరెస్టు చేశారని.. అత్యంత కఠిన శిక్ష పడేలా చేస్తామని హామీ ఇచ్చారు..
ఏపీలో అసలు శాంతి భద్రతలు ఉన్నాయా? అని వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ప్రశ్నించారు. మహిళల రక్షణ విషయంలో ఈ ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహించిందని మండిపడ్డారు. రాష్ట్రంలో అఘాయిత్యాల కారణంగా ఆడపిల్లలున్న ప్రతీ తల్లిదండ్రులు బాధపడుతున్నారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి మేల్కొవాలని ఎంపీ అవినాష్ రెడ్డి కోరారు. బద్వేల్‌లో ప్రేమోన్మాది చేతిలో హత్యకు గురైన విద్యార్థిని కుటుంబ సభ్యులను ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నేడు పరామర్శించారు. Also Read:…
KADAPA: కడప జిల్లా బద్వేల్ ఆర్డీఓ ఆకుల వెంకటరమణ అవినీతి చిట్టా అంటూ కరపత్రాలు కలకలం రేపుతున్నాయి. బద్వేల్ లో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు జరిగిన తర్వాత మొదటి ఆర్డీఓగా ఆకుల వెంకటరమణ బాధ్యతలు చేపట్టారు.
కడప జిల్లా బద్వేల్‌లో సత్య ఏజెన్సీస్ 23వ షోరూంను ఘనంగా ప్రారంభించారు. భవన యజమాని బి.జయ సుబ్బారెడ్డి రిబ్బన్ కట్ చేసి షోరూంను ప్రారంభించారు. ఆయనతో పాటు సత్య ఏజెన్సీ ఏపీ హెడ్ సెంథిల్‌తో పాటు పలువురు పాల్గొన్నారు.
Sathya In Badvel : ప్రియమైన వినియోగదారులకి సత్య భారీ డిస్కౌంట్లను ప్రజల వద్దకు తీసుకువస్తోంది. సత్య ఆంధ్రప్రదేశ్ లోని బద్వేల్ లో జూన్ 26 బుధవారం నాడు ఘనంగా కొత్తగా 23వ షోరూంను ప్రారంభం కానుంది. ఇప్పటికే రాష్ట్రంలో 22 షోరూంలు విజయవంతంగా నడుస్తున్నాయి. కొత్తగా ఏర్పాటు చేస్తున్న షోరూంలో అద్భుతమైన డిస్కౌంట్లు పొందడానికి ప్రజలకు ఇదే సువర్ణ అవకాశం. సత్యాలో ప్రతి వస్తువు కొనుగోలపై ప్రారంభ రోజు ఆఫర్లుగా ప్రజలకు హామీ ఇచ్చిన ఉచిత…
ఏదైతే ఏముంది… కప్పేసుకోండి కండువాలు. అన్నీ మనవే, అంతా మనోళ్లే అంటున్నారు అక్కడ కూటమి లీడర్స్. ఆ నియోజకవర్గంలో కేడర్‌లేని బీజేపీకి అసెంబ్లీ టిక్కెట్ ఇవ్వడంతో మంత్రసానితనం ఒప్పుకున్నాక తప్పుతుందా…అనుకుంటూ టీడీపీ కార్యకర్తలకే బీజేపీ కండువాలు వేసేస్తున్నారు. ఏదో ఒకటి కానిచ్చేయండని పై స్థాయిలో అంటున్నా… ఠాఠ్… ఆ కండువా మాకెందుని అంటోందట కేడర్. ఎక్కడుందా విచిత్రమైన పరిస్థితి? ఏంటా గోల? ఎన్డీఏ కూటమి పొత్తులో భాగంగా ఉమ్మడి కడప జిల్లాలోని బద్వేలు నియోజకవర్గం బీజేపీ ఖాతాలోకి…
వైఎస్‌ఆర్ కడప జిల్లాలో మూడు రోజుల పాటు సీఎం వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ఈనెల 23 నుంచి 25వరకు మూడు రోజుల పర్యటనకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. గోపవరం, ప్రొద్దుటూరు, కొప్పర్తి, ఇడుపులపాయ, పులివెందుల ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ప్రొద్దుటూరు , పులివెందులలో బహిరంగ సభలు నిర్వహించనున్నారు. మొదటి రోజు జగన్ పర్యటన షెడ్యూల్ ఇదే..(23.12.2021)ఉదయం 10.30 గంటలకు గన్నవరం ఎయిర్‌పోర్ట్ నుంచి బయలుదేరి 11.15 గంటలకు కడప ఎయిర్‌పోర్ట్ చేరుకుంటారు.12.00 –…
ఏపీలోని బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం ఉప ఎన్నికలో వైసీపీ గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ ఎన్నికల్లో బీజేపీ డిపాజిట్ గల్లంతు అయింది. వైసీపీ అభ్యర్థి మొదటి రౌండ్ నుంచి ఏకపక్షంగా ఫలితాలను నమోదు చేసి ఘన విజయం సాధించింది. 90,411 ఓట్ల మెజార్టీతో వైసీపీ అభ్యర్థి డాక్టర్ దాసరి సుధ గెలుపొందారు.. అయితే, బీజేపీ అభ్యర్థి సురేష్‌కు 21 వేలకు పైగా ఓట్లు వచ్చాయి.. ఇక, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కమలమ్మకు 6 వేల పైచిలుకు ఓట్లు…