తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో ఉప ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన పూర్తైంది. కడప జిల్లా బద్వేల్ ఉప ఎన్నిక కోసం మొత్తం 27 నామినేషన్లు దాఖలవ్వగా అందులో 9 నామినేషన్లను తిరస్కరించారు. దీంతో బద్వేల్‌లో 18 మంది బరిలో ఉన్నారు. ఇక ఇదిలా ఉంటే, ఇటు కరీంనగర్ జిల్లా హుజురాబాద్ ఉప ఎన్నిక కోసం 61 నామినేషన్లు దాఖలవ్వగా, ఇందులో 19 నామినేషన్లను అధికారులు తిరస్కరించారు. దీంతో హుజురాబాద్ ఉప ఎన్నిక బరిలో 42 మంది అభ్యర్థులు నిలిచారు.…
బద్వేల్ ఉపఎన్నికలో పోటీ.. ఆ రెండు జాతీయపార్టీల మధ్యేనట. ఇదేంటి.. అధికారపార్టీని వదిలేసి.. ఉనికి కూడా లేని ఆ పార్టీల మధ్య పోటీ ఉందంటున్నారు అని అనుకుంటున్నారా? మీరే చూడండి. ఇంతకీ ఆ పార్టీలు పోటీ పడుతోంది గెలవడానికా…? ఓడిపోడానికా..? పోటీకి సై అని కాలుదువ్వుతున్న బీజేపీ, కాంగ్రెస్..! బద్వేల్ ఉపఎన్నికల బరి నుంచి ప్రధాన ప్రతిపక్షం టీడీపీ వైదొలిగింది. మరణించిన శాసనసభ్యుల కుటుంబాల నుంచి అభ్యర్ధులు బరిలో ఉన్నప్పుడు పోటీ చేయకూడదన్న సాంప్రదాయానికి తమ పార్టీ…
బద్వేల్ ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తున్నట్టు ప్రకటించడమే కాకుండా అభ్యర్థిని కూడా ప్రకటించింది. గత సార్వత్రిక ఎన్నికల్లో రైల్వే కోడూరులో నుంచి పోటీ చేసి ఓటమిపాలయ్యారు. కాగా, ఇప్పుడు బద్వేల్ ఉప ఎన్నికల్లో మరోసారి సురేష్‌ను ఉప ఎన్నికల్లో అభ్యర్ధిగా బీజేపీ ఎంపికచేసింది. గత సంప్రదాయాలను గౌరవిస్తూ జనసేన పార్టీ అభ్యర్థిని నిలబెట్టకుండా ఎన్నికల నుంచి తప్పుకున్న సంగతి తెలిసిందే. ఏపీలో బీజేపీ, జనసేన పార్టీల మధ్య పొత్తు ఉన్నది. తిరుపతి ఉప ఎన్నికల్లో బీజేపీ…
కడప జిల్లాలోని బద్వేలు నియోజక వర్గానికి ఉప ఎన్నిక జరగబోతున్న సంగతి తెలిసిందే. ఈ ఉప ఎన్నికల్లో వైసీపీ ఇప్పటికే అభ్యర్థిని ప్రకటించారు. అయితే, గత సంప్రదాయాలను గౌరవిస్తూ జనసేన, టీడీపీలు ఈ ఎన్నికల్లో పోటీకి దూరంగా ఉంటున్నాయి. కానీ, బీజేపీ పోటీ చేసేందుకు ఆసక్తి చూపింది. రాజకీయాలను రాజకీయాల మాదిరిగానే చూస్తామని చెప్పిన బీజేపీ, బద్వేలు ఉప ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థి ఎంపికపై కడప జిల్లా నేతలతో చర్చలు ఏపీ బీజేపీ చర్చలు నిర్వహించారు.…
వైసీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మరణంతో బద్వేల్ లో ఉప ఎన్నిక అనివార్యమైంది. వైసీపీ తరుఫున వెంకట సుబ్బయ్య భార్య దాసరి సుధ బరిలో ఉన్నారు. ఆమె గెలుపు లాంఛనమే అయినా పోటీ మాత్రం తప్పదని తెలుస్తోంది. వైసీపీకి అంతో ఇంతో పోటీనిచ్చే టీడీపీ, జనసేన బరిలో నుంచి తప్పుకుంటున్నట్లు ఇప్పటికే ప్రకటించాయి. దీంతో వైసీపీ అభ్యర్థి ఏకగ్రీవం అయ్యేందుకు మార్గం సుగమం అయింది. అయితే వైసీపీకి ఏమాత్రం పోటీ ఇవ్వలేని బీజేపీ, కాంగ్రెస్ లు…
బద్వేలు ఉప ఎన్నికల్లో బీజేపీ పోటీ చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం బీజేపీ అభ్యర్థి ఎవరు అనే దానిపై చర్చలు జరుపుతున్నారు. ఈరోజు లేదా రేపటిలోగా ఈ వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశం ఉన్నది. ఇక ఉప ఎన్నికల్లో ప్రచారం చేసేందుకు రావాలని పవన్‌ను కోరతామని ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు పేర్కొన్నారు. భవిష్యత్తులో బీజేపీ, జనసేన పార్టీల పొత్తు కొనసాగుతుందని అన్నారు. పవన్‌పై వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలపై కూడా ఆయన స్పందించారు. విమర్శలు చేసేటప్పుడు…
బద్వేల్ నియోజక వర్గానికి ఈనెల 30 వ తేదీన ఉప ఎన్నిక జరగబోతున్నది. ఈ ఎన్నికల్లో అన్ని పార్టీలు బరిలో ఉంటాయని అనుకున్నారు. వైసీపీ ఇప్పటికే అభ్యర్ధిని ప్రకటించింది. జనసేన, టీడీపీలు కూడా పోటీలో ఉంటాయని అనుకున్నారు. కానీ, సంప్రదాయాలను గౌరవిస్తూ పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు మొదట జనసేన పార్టీ ప్రకటించింది. ఇదే బాటలో టీడీపీ కూడా నిర్ణయం తీసుకుంది. టీడీపీ నుంచి మొదట డాక్టర్ ఓబుళాపురం రాజశేఖర్ పోటీ చేస్తారని అనుకున్నారు. కాని, జనసేన నిర్ణయం…
బద్వేల్ ఉప ఎన్నికలు జరగబోతున్నాయి. ఈనెల 30 వ తేదీన ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే పార్టీలు ప్రచారం చేసేందుకు సిద్దమవుతున్న తరుణంలో అట్లూరు మండలంలోని చిన్నమరాజుపల్లె గ్రామస్థులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా తమ గ్రామానికి రోడ్డు సౌకర్యం కల్పించలేదని, తాము బద్వేల్ ఉప ఎన్నికలను బహిష్కరిస్తున్నామని గ్రామస్తులు పేర్కొన్నారు. ఉప ఎన్నికలను బహిష్కరిస్తున్నామని గ్రామ పొలిమేర్లలో బ్యానర్‌ను కట్టారు. ఏ నాయకుడు తమ గ్రామంలోకి రావొద్దని, గ్రామానికి రోడ్డు…
ఈనెల 30 వ తేదీన కడప జిల్లాలోని బద్వేల్‌కు ఉప ఎన్నిక జరగబోతున్నది. ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేసేందుకు అధికార వైసీపీ తమ అభ్యర్థిని ఇప్పటికే ప్రకటించారు. అటు తెలుగుదేశం పార్టీ కూడా అభ్యర్ధిని ప్రకటించారు. అయితే, బీజేపీ, జనసేన పొత్తులో భాగంగా జనసేన పార్టీకి అవకాశం వచ్చింది. అభ్యర్థిని ప్రకటిస్తారని అనుకుంటున్న సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. బద్వేల్ ఉప ఎన్నికలో పోటీ చేయమని ఒత్తిడి వచ్చిందని, చనిపోయిన…
బద్వేల్ ఉప ఎన్నికలు అక్టోబర్ 30 వ తేదీన జరగబోతున్నాయి. ఈ ఉప ఎన్నికల్లో విజయం కోసం అన్ని పార్టీలు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. రేపటి నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కాబోతున్నది. ఈ ఉప ఎన్నికల్లో విజయం తమదే అని టీడీపీ ధీమాను వ్యక్తం చేసింది. దివంగత మాజీ మంత్రి వీరారెడ్డి టీడీపీ ఎమ్మెల్యేగా, మంత్రిగా ఎంతో అభివృద్ది చేశారని టీడీపీ అభ్యర్థి డాక్టర్ ఓబుళాపురం రాజశేఖర్ పేర్కొన్నారు. సీఎం జగన్ బద్వేల్ అభివృద్ధికి ఇచ్చిన హామీలు…