AP Crime: ఏది జరిగినా.. ఆలోచించకుండా వెంటనే ఏది తోస్తే అది చేస్తూ ప్రాణాల మీదకు తెచ్చుకుంటున్నారు యువత.. ఆంధ్రప్రదేశ్‌లో ఓ యువకుడు.. తనను ప్రేమించలేదంటూ.. తన ప్రియురాలిని హత్య చేసేందుకు ప్రయత్నించాడు.. కానీ, ఆ యువతి తప్పించుకుంది.. ఆ విషయం కాస్తా పోలీసుల వరకు చేరడంతో.. ఆ తర్వాత భయంతో ఆత్మహత్య చేసుకున్నాడు..
Read Also: UP: టెర్రస్ పై నిద్రిస్తున్న 6ఏళ్ల బాలుడిని ఎత్తుకెళ్లిన చిరుత..ప్రాణాలు వదిలిన చిన్నారి
కడప జిల్లా బద్వేలులో సాయికుమార్ రెడ్డి(27) అనే యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు.. ఒంటిపై పెట్రోలు పోసుకొని నిప్పుంటించుకున్న యువకుడు.. తీవ్ర గాయాలు కావడంతో ప్రాణాలు వదిలాడు.. అయితే, ఆ యువకుడి ఆత్మహత్యకు లవ్ ఫెయిల్యూరే కారణమని తేల్చారు పోలీసులు.. ఇక, ఆత్మహత్యకు ముందు అట్లూరు మండలం తంబళ్లగొంది సచివాలయంలో ప్రియురాలిపై పెట్రోల్ పోసి నిప్పంటించబోయాడు సాయికుమార్ రెడ్డి.. కానీ, లైటర్ వెలగకపోవడంతో ఆ యువతి తప్పించుకుని ప్రాణాలు కాపాడుకుంది.. ఈ విషయమై అట్లూరు పోలీసులకు సమాచారం ఇచ్చారు సచివాలయ సిబ్బంది.. ఇక, సాయి కుమార్ రెడ్డి ఫోన్ పనిచేయకపోవడంతో తన అన్నకు ఫోన్ చేసిన ఘటన సమాచారం తెలియజేశారు అట్లూరు పోలీసులు.. మరోవైపు.. అప్పటికే బద్వేలులోని తన అక్క ఇంట్లో నిప్పంటికొని సూసైడ్ చేసుకున్నాడు సాయికుమార్ రెడ్డి.