Suicide Attempt: బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక విషాదకర ఘటన చోటుచేసుకుంది. లక్ష్మీ అనే మహిళ తన ఎనిమిది నెలల శిశువు, మూడేళ్ల చిన్నారిని ఇంటి ముందు ఉన్న సంపులో పడవేసి.. తాను కూడా ఆత్మహత్యకు యత్నించింది. ఈ ఘటనలో ఆ ఇద్దరు చిన్నారులు మృతి చెందగా, వారి మృతదేహాలను పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. లక్ష్మీని కూడా ప్రాణాపాయ స్థితిలో ఉండగా చికిత్స నిమిత్తం అదే ఆసుపత్రికి తరలించినట్టు పోలీసులు తెలిపారు. కిల్లింగ్…
దారికి అడ్డంగా కట్టిన గోడ వేలాది మంది ప్రజలకు గోసగా మారింది. ఆఖరికి అది పోరాటంగా మారింది. ఔటర్ రింగు రోడ్డు ఎగ్జిట్ 4 నుంచి మల్లంపేట, బాచుపల్లి క్రాస్‌రోడ్స్ మీదుగా ప్రగతినగర్‌కు సులభంగా చేరుకునే మార్గం దొరకక అవస్థలు పడినవారు కొంతమంది అయితే.. మాది గేటెడ్ కమ్యూనిటీ మా కాలనీలోంచి రాకపోకలు బంద్ అంటూ అడ్డు గోడలు కడుతున్నవారు మరికొంతమంది. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా దుండిగల్ మండలంలోని మల్లంపేట – బాచుపల్లి గ్రామాల మధ్య…
Accident : హైదరాబాద్ శివారులోని బాచుపల్లి ప్రాంతంలో హృదయవిదారక రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మల్లంపేట సమీపంలోని పల్లవి స్కూల్ జంక్షన్ వద్ద టిప్పర్ ఒక స్కూటీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూటీపై ప్రయాణిస్తున్న ఆరేళ్ల బాలుడు అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడు అభిమన్యు రెడ్డి (6), నిజామాబాద్‌కు చెందినవాడు. కుటుంబంతో కలిసి ఇటీవల మల్లంపేటలో నివాసం ఉంటున్నాడు. బాలుడు గీతాంజలి ఇంటర్నేషనల్ స్కూల్‌లో 1వ తరగతి చదువుతున్నాడు. ఇవాళ ఉదయం మాదిరిగానే తల్లి స్కూటీపై అభిమన్యును స్కూల్‌కు…
Murder Mystery : హైదరాబాద్ శివారులోని బాచుపల్లి ప్రాంతంలో సంచలనం సృష్టించిన ట్రావెల్ బ్యాగ్ హత్యకేసును పోలీసులు ఛేదించారు. సీసీ కెమెరా ఫుటేజీలు, సాంకేతిక ఆధారాలతో విచారణను ముమ్మరం చేసిన పోలీసులు చివరికి ఈ కేసును చేధించారు. మే 23న ఓ యువతిని హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ట్రావెల్ బ్యాగ్‌లో పెట్టి నిర్మానుష్య ప్రాంతంలో పడేసిన ఘోరమైన ఘటన వెనక నేపాల్‌కు చెందిన ఓ యువకుడు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. Joan Alexander: 88 ఏళ్ల…
మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా బాచుపల్లి పియస్ పరిధిలో దారుణం చోటు చేసుకుంది. విజయదుర్గ ఓనర్స్ అసోసియేషన్ కాలనీ నిర్మానుష్య ప్రాంతంలో బ్యాగులో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైంది.. బ్యాగ్ నుంచి దుర్వాసన వస్తుందని స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానికుల సమాచారంతో పోలీసులు అక్కడికి చేరుకుని పరిశీలించారు. మృతురాలు వయసు 25 నుంచి 35 సంవత్సరాలు ఉండొచ్చని అంచనా వేస్తున్నారు.
Fraud : హైదరాబాద్ నగరంలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్‌లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. చేతన్ జువెలర్స్ పేరుతో నగల వ్యాపారం నిర్వహిస్తున్న నితీష్ జైన్ అనే వ్యక్తి సుమారు రూ. 10 కోట్ల విలువైన బంగారం , ఆభరణాలతో పరారయ్యాడు. దీంతో మోసపోయిన కస్టమర్లు బాచుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం, నితీష్ జైన్ గత కొంతకాలంగా కస్టమర్ల నుండి బంగారాన్ని తీసుకుని ఆభరణాలు తయారు…
బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీశ్ రావుపై కేసు నమోదైంది. చక్రధర్ గౌడ్ అనే వ్యక్తి ఫిర్యాదు మేరకు బాచుపల్లి పోలీసులు హరీష్ రావుపై కేసు నమోదు చేశారు. హరీష్ రావుతో పాటు ఇటీవల జైలు నుండి విడుదలైన ఆయన అనుచరులు బెదిరింపులకు పాల్పడుతున్నారని.. వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని చక్రధర్ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో హరీశ్ రావు, వంశీ కృష్ణ, సంతోష్ కుమార్, పర్శరాములుపై కేసు నమోదైంది. ఎఫ్ఐఆర్‌లో ఏ-2గా సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్…
హైదరాబాద్ శివారులో యువకులు రెచ్చిపోయారు. కొందరు యువకులు గన్‌తో హల్చల్ చేసిన ఘటన బాచుపల్లి స్పోర్ట్స్ క్లబ్ వద్ద చోటు చేసుకుంది. అర్ధరాత్రి వేళ తుపాకీ గురిపెట్టి యువకులు వీరంగం సృష్టించారు. బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
కాలేజీ హాస్టల్లో ఓ విద్యార్ధిని ఆత్మహత్యకు పాల్పడ్డ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. బాచుపల్లిలోని ఇంపల్స్ కాలేజీ హాస్టల్లో ఈ ఘటన జరిగింది. విద్యార్థిని ఎంపీసీ సెకండ్ ఇయర్ చదువుతున్న ప్రజ్ఞ రెడ్డిగా గుర్తించారు.