HYDRA: దారికి అడ్డంగా కట్టిన గోడ వేలాది మంది ప్రజలకు గోసగా..
- దారికి అడ్డంగా కట్టిన గోడ తీస్తే 3
- మూస్తే 8 కిలోమీటర్లు ప్రయాణించాలి
- మల్లంపేట - బాచుపల్లి గ్రామాల మధ్య నెలకొన్న వివాదం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దారికి అడ్డంగా కట్టిన గోడ వేలాది మంది ప్రజలకు గోసగా మారింది. ఆఖరికి అది పోరాటంగా మారింది. ఔటర్ రింగు రోడ్డు ఎగ్జిట్ 4 నుంచి మల్లంపేట, బాచుపల్లి క్రాస్‌రోడ్స్ మీదుగా ప్రగతినగర్‌కు సులభంగా చేరుకునే మార్గం దొరకక అవస్థలు పడినవారు కొంతమంది అయితే.. మాది గేటెడ్ కమ్యూనిటీ మా కాలనీలోంచి రాకపోకలు బంద్ అంటూ అడ్డు గోడలు కడుతున్నవారు మరికొంతమంది. మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా దుండిగల్ మండలంలోని మల్లంపేట – బాచుపల్లి గ్రామాల మధ్య నెలకొన్న వివాదం ఇది.
Also Read:Purnea Murder Case: పూర్నియాలో మంత్రాల నెపంతో దారుణం.. ఒకే కుటుంబంలో ఐదుగురు సజీవదహనం..
Also Read
- CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
- Royal Enfield Himalayan 440కు మైండ్ బ్లాకింగ్ రెస్పాన్స్.. కొత్త కస్టమర్లకు షాక్ ఇచ్చిన రాయల్ ఎన్ఫీల్డ్!
- Blood Donation Camp: రక్తదాన శిబిరంలో 'కులం' కలకలం.. తమిళనాడులో వివాదం
- US Iran Tensions: ఇరాన్‌పై మరోసారి దాడికి ట్రంప్ బిగ్ ప్లాన్.. మిడిల్ ఈస్ట్‌కు 9,000 మంది సైనికుల తరలింపు
గోడ తీస్తే.. గోస పోద్ది..
మల్లంపేట ఔటర్ రింగురోడ్డు ఎగ్జిట్ నుంచి బాచుపల్లి క్రాస్ రోడ్స్ మీదుగా ప్రగతినగర్ కు కేవలం 3 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తే సరిపోతోంది. కాని దారి మధ్యలో ప్రణీత్ ఆంటిల్యా వారు నిర్మించిన అడ్డుగోడతో 8 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తోందని మల్లంపేట గ్రామప్రజలతో పాటు.. మరో 10 కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రణీత్ ఆంటిల్యా వారు అడ్డుగోడ తీసేస్తే 60 నుంచి 40 ఫీట్ల వెడల్పుతో ఉన్న అడ్డ దారి దొరుకుతుందంటున్నారు. వాస్తవానికి గేటెడ్ కమ్యూనిటీ కాదు.. అయినా గోడ కట్టి మాది గేటెడ్ కమ్యూనిటీ అంటూ రాకపోకలను అడ్డుకుంటున్నారని మల్లంపేట వాసులు వాపోతున్నారు.
Also Read:Maaremma: రవితేజ అన్న కొడుకు ‘మారెమ్మ’.. లుక్ అదిరింది
మల్లంపేట ఎగ్జిట్ నుంచి మల్లంపేట విలేజ్, ప్రణీత్ లీఫ్‌కాలనీ, ఆకాష్ వెంచర్, డ్రీం వ్యాలీ కాలనీ, గ్రీన్‌పార్కు కాలనీ, సాయినగర్ కాలనీ, బృందావన్ కాలనీ, ఏపీఆర్ కాలనీ, ఇందిరమ్మకాలనీ, లక్ష్మి శ్రీనివాస్ కాలనీ, హెచ్ ఎండీఏ, ప్రణీత్ ఆంటిల్యా, బాచుపల్లి చౌరస్తా మీదుగా ప్రగతినగర్‌కు కేవలం 3 కిలోమీటర్ల రాజమార్గంలో రావడానికి అవకాశం ఉన్నా అడ్డుగోడలు పెట్టారని.. దీంతో 25 వేల మందికి పైగా అవస్థలు పడుతున్నామని పలువురు హైడ్రాకు ఫిర్యాదు చేశారు. గతంలో ప్రణీత్ ఆంటిల్యా నివాసాల మధ్య నుంచి బళ్లబాట ఉండేదని కూడా మల్లంపేటతో పాటు పరిసర నివాస ప్రాంతాలవారు చెబుతున్నారు. కాని.. ప్రణీత్ ఆంటిల్యా వాదన మరోలా ఉంది.. ఆ గోడ తీస్తే మాకు గోస మొదలౌద్ది. మొత్తం ఈ కాలనీలు, బస్తీల నుంచి వచ్చే వాహనాలు మా కాలనీమీదుగా రాకపోకలు సాగిస్తే చాలా ఇబ్బందిగా పరిణమిస్తుందని ప్రణీత్ ఆంటిల్యా వాసులు వాపోతున్నారు.
Also Read:Maaremma: రవితేజ అన్న కొడుకు ‘మారెమ్మ’.. లుక్ అదిరింది
హైడ్రా పరిశీలించి చర్యలు..
మల్లంపేట ప్రజల ఫిర్యాదుపై హైడ్రా లోతైన పరిశీలన చేసింది. హెచ్ ఎం డీఏ అనుమతులను పరిశీలించింది. ప్రణీత్ ఆంటిల్యా గేటెడ్ కమ్యూనిటీ కాదని హెచ్ ఎం డీఏ అనుమతిచ్చిన లే ఔట్ స్పష్టం చేస్తోంది. హెచ్ ఎండీఏ అనుమతుల్లో 7వ అంశాన్ని పరిశీలిస్తే గేటెడ్ కమ్యూనిటీ కాదని.. నివాస ప్రాంతాలకు చుట్టూ ప్రహరీ నిర్మించరాదని.. మరీ ముఖ్యంగా రహదారులకు అడ్డంగా గోడలు నిర్మించరాదని.. పక్కన ఉన్న కాలనీవాసులకు దారి చూపాలని ఎంతో స్పష్టంగా పేర్కొంది. ఆ క్రమంలోనే అక్కడి ప్రహరీలను హైడ్రా ఇటీవల తొలగించింది.
Also Read:Minister Anagani: 2047 నాటికి రాష్ట్రాన్ని నెంబర్-1 చేసేలా సీఎం చంద్రబాబు ప్లాన్
తర్వాత ప్రణీత్ ఆంటిల్యా కాలనీ వాసుల నుంచి అభ్యంతరాలు రావడంతో మరింత లోతుగా అధ్యయనం చేసింది. ప్రణీత్ ఆంటిల్యా నివాసాల మధ్య నుంచే గతంలో బళ్లదారి ఉండేదని రెవెన్యూ అధికారులుచెబుతున్నారు. నిజాంపేట మున్సిపల్ అధికారులు ఇది గేటెడ్ కమ్యూనిటీ కాదని నిర్ధారించారు. దీంతో ఇరుపక్షాలతో సమావేశాన్ని ఏర్పాటు చేసింది. మున్సిపల్, రెవెన్యూ అధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఇరు పక్షాల సమక్షంలోనే ఇది గేటెడ్ కమ్యూనిటీ కాదు.. దారి ఇవ్వాల్సి ఉంటుందని సమావేశం నిర్ణయించింది.
తాజావార్తలు
-
Putin Praises PM Modi: ప్రధాని మోడీపై పుతిన్ ప్రశంసలు.. ఉక్రెయిన్ సంక్షోభంపై పుతిన్ కీలక వ్యాఖ్యలు
-
Anil Ravipudi : అనిల్ రావిపూడి చుట్టూ క్రేజీ రూమర్స్
-
CM Chandrababu: రాయలసీమకు గుడ్‌న్యూస్.. హార్టికల్చర్ హబ్‌కు నేడు శంకుస్థాపన..
-
2027 ODI World Cup: భారత్, పాకిస్థాన్ మూడు సార్లు ఢీకొట్టే ఛాన్స్.. అదెలాగంటే?
-
Pulsar NS400Z: Pulsar NS400Z కొత్త వెర్షన్ లాంచ్.. TFT డిస్‌ప్లే, Google Maps సహా మరిన్ని స్మార్ట్ ఫీచర్లు
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?