Fraud : బాచుపల్లిలో భారీ మోసం.. రూ. 10 కోట్ల విలువైన బంగారంతో జువెలర్స్ యజమాని పరార్
- చేతన్ జువెలర్స్ యజమాని నితీష్ జైన్ రూ. 10 కోట్లతో పరార్
- బంగారం తాకట్టు, స్కీమ్‌ల పేరిట మోసం
- బాచుపల్లి పోలీస్‌స్టేషన్‌లో బాధితుల ఫిర్యాదుతో కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fraud : హైదరాబాద్ నగరంలోని బాచుపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రగతి నగర్‌లో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. చేతన్ జువెలర్స్ పేరుతో నగల వ్యాపారం నిర్వహిస్తున్న నితీష్ జైన్ అనే వ్యక్తి సుమారు రూ. 10 కోట్ల విలువైన బంగారం , ఆభరణాలతో పరారయ్యాడు. దీంతో మోసపోయిన కస్టమర్లు బాచుపల్లి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం, నితీష్ జైన్ గత కొంతకాలంగా కస్టమర్ల నుండి బంగారాన్ని తీసుకుని ఆభరణాలు తయారు చేసి విక్రయిస్తున్నాడు. కస్టమర్లకు నమ్మకం కలిగించిన తర్వాత, మే 10వ తేదీ నుండి షాపును తెరవకుండా అకస్మాత్తుగా కనిపించకుండా పోయాడు. దీంతో ఆందోళన చెందిన బాధితులు షాపు వద్దకు చేరుకుని చూడగా అది మూసి ఉంది.
Michael Rubin: పాక్ తోక ముడిచి.. కాల్పుల విరమణ కోసం వేడుకుంది..
Also Read
ఈ మోసంతో కేవలం కస్టమర్లే కాకుండా, జైన్‌కు బంగారాన్ని అప్పుగా ఇచ్చిన ఇతర నగల వ్యాపారులు కూడా లబోదిబోమంటున్నారు. అంతేకాకుండా, కొంతమంది వ్యక్తులు బంగారాన్ని తాకట్టు పెట్టి అధిక వడ్డీలకు జైన్‌కు నగదు ఇచ్చినట్లు తెలుస్తోంది. నితీష్ జైన్ వివిధ రకాల స్కీమ్‌లు పెట్టి కూడా అమాయక ప్రజలను మోసం చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు. నిందితుడు నితీష్ జైన్ కేపీహెచ్‌బీ కాలనీ , బాచుపల్లి పరిధిలో తన వ్యాపారాన్ని కొనసాగిస్తూ ఈ మోసానికి పాల్పడ్డాడు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న నితీష్ జైన్ కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.
Womens Marriage: ముస్లిం యువకులు హిందువులుగా నటిస్తూ మోసం చేశారు.. అందుకే ఒక్కటయ్యాం..!
తాజావార్తలు
-
Earthquake: ఉత్తరాఖండ్‌లో భూప్రకంపనలు.. ప్రజలు పరుగులు
-
CJP Protest: CJP వెనక్కి తగ్గేది లేదు.. ఆదివారం జంతర్ మంతర్‌కు పాదయాత్ర
-
Liquor Shops: ఏపీలో మద్యం దుకాణాలకు రెండో విడత నోటిఫికేషన్.. అక్టోబర్ 19 దరఖాస్తులకు చివరి తేదీ..
-
Saudi: రియాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీ పేలుడు.. విమానాలు దారి మళ్లింపు
-
Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!