Fire Accident: భారీ అగ్ని ప్రమాదం.. 50కి పైగా ఫర్నిచర్ షాపుల్లో అగ్నిప్రమాదం..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Accident: బాచుపల్లి – మియాపూర్ రోడ్డులో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. విజ్ఞాన జ్యోతి ఇన్స్టిట్యూట్ అఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సమీపంలో ఉన్న ఫర్నిచర్ షాపుల సముదాయంలో మంగళవారం రాత్రి భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కేజీఆర్ కన్వెన్షన్‌కు ఆనుకుని ఉన్న వరుస షాపుల్లో మంటలు ఒక్కసారిగా ఎగసిపడడంతో పరిసర ప్రాంతాల్లో భయాందోళనలు నెలకొన్నాయి.
ఎలుకలను చంపకుండానే తరిమికొట్టే Secret Trick.! పక్కాగా పనిచేసే వంటింటి చిట్కాలు.!
Also Read
- CM Chandrababu: కరువు సీమ.. సిరుల సీమగా మారుతుంది.. సీమ చరిత్రలో అక్టోబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోతుంది..
- Supreme Court: "ఇక బండి సీజ్".. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
- Pawan Kalyan: కరువు నేల నుంచి ప్రపంచ స్థాయి ఉద్యానవన కేంద్రంగా.. పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు
- KTR: కళ్యాణలక్ష్మికి 12 ఏళ్ళు..! ఈ పథకాన్ని రద్దు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయ్..
ప్రాథమిక సమాచారం ప్రకారం.. రెండు షాపుల్లో ప్రారంభమైన ఈ మంటలు క్షణాల్లోనే పక్కపక్కన ఉన్న దాదాపు 50కి పైగా ఫర్నిచర్ దుకాణాలకు వ్యాపించాయి. దీనితో రోడ్డు పక్కన ఫుట్‌పాత్ లపై ఏర్పాటు చేసిన తాత్కాలిక షెడ్లలో పెద్ద ఎత్తున ఫర్నిచర్ నిల్వ ఉండటం వల్ల మంటలు వేగంగా విస్తరించాయి. ముందుభాగంలో విక్రయాలు జరుపుతూ.. వెనుక భాగంలో గోదాములుగా నిల్వలు ఉంచడం అగ్నికి మరింత ఆజ్యం పోసినట్లయింది.
T20 World Cup Semi-final: చంద్ర గ్రహణం ఎఫెక్ట్.. టీమ్ ఇండియా ప్రాక్టీస్ వాయిదా..
సమాచారం అందుకున్న వెంటనే ఐదు డిజాస్టర్ రెస్పాన్స్ బృందాలు, హైడ్రా సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. దాదాపు 10 ఫైర్ ఇంజన్ల సహాయంతో మంటలను అదుపులోకి తీసుకురావడానికి తీవ్రంగా శ్రమించారు అధికారులు. భారీ ఫర్నిచర్ సామాగ్రి, కలప, ఫోమ్ వంటి దహన పదార్థాలు ఎక్కువగా ఉండటం వల్ల అగ్ని మాపక సిబ్బందికి మంటలను నియంత్రించడం సవాలుగా మారింది. ఈ అగ్నిప్రమాదంలో కోట్ల రూపాయల విలువైన ఫర్నిచర్ దగ్ధమైనట్లు అంచనా. ఫుట్‌పాత్‌పై వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగించే చిరు వ్యాపారులు తమ ఆస్తి కళ్లముందే బూడిదవుతుండటంతో ఆవేదన వ్యక్తం చేశారు. అదృష్టవశాత్తు ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు.
తాజావార్తలు
-
Irumudi Record: బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ‘బాహుబలి 2’ను దాటేసిన ‘ఇరుముడి’.. సరికొత్త రికార్డు!
-
TRAI New Order: కోట్లాది మొబైల్ యూజర్లకు గుడ్‌న్యూస్.. చౌకైన రీఛార్జ్ ప్లాన్లపై TRAI కీలక ఆదేశాలు
-
CM Chandrababu: కరువు సీమ.. సిరుల సీమగా మారుతుంది.. సీమ చరిత్రలో అక్టోబర్ 2 చిరస్థాయిగా నిలిచిపోతుంది..
-
Supreme Court: “ఇక బండి సీజ్”.. పెండింగ్ చలాన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు..
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
ట్రెండింగ్
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!
-
Breakfast Quesadillas: రోజూ టిఫిన్ గురించి టెన్షన్ వద్దు.. జస్ట్ 20 నిమిషాల్లో రెడీ అయ్యే ఈ బ్రేక్‌ఫాస్ట్‌ను ట్రై చేయండి..
-
50MP కెమెరా, 6,000mAh బ్యాటరీ, డైమెన్సిటీ 6300 చిప్‌తో రూ.20,999కే Redmi 17C 5G లాంచ్..!
-
Asian Games 2026: శ్రీలంకపై భారత్ భారీ విజయం.. బంగారు పతకం కోసం భారత్, పాక్ పోరు.!
-
Asian Games 2026: వైభవ్ మెరుపులు.. ఇషాన్ ఊచకోత..! శ్రీలంక టార్గెట్ ఎంతంటే.?