Pawan Kalyan: అయోధ్య రామ మందిర ‘ప్రాణ ప్రతిష్ట’ అంతా సిద్ధమైంది. రేపు రామ మందిర ప్రారంభోత్సవం జరగనుంది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా హాజరవుతున్న ఈ కార్యక్రమానికి పలు రంగాల నుంచి 7000 మందికి పైగా అతిథులు వస్తున్నారు. తాజాగా జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ అయోధ్య రామ మందిర వేడుకకు బయలుదేరారు. ఆయన ఉత్తర్ ప్రదేశ్ రాజధాని లక్నోకి చేరుకున్నారు.
Read Also: DNS : ఆ క్రేజీ మల్టీ స్టారర్ మూవీకి మ్యూజిక్ ఇవ్వనున్న రాక్ స్టార్..
ఇది ప్రజల చిరకాల స్వప్నమని.. 500 ఏళ్ల తరువాత ఇది ఎట్టకేలకు నిజం కాబోతోందని, మేము చాలా సంతోషంగా ఉన్నామని, ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నందుకు ఆనందంగా ఉందని పవన్ కళ్యాణ్ అన్నారు.
#WATCH | Uttar Pradesh: Jana Sena chief Pawan Kalyan arrives in Lucknow, ahead of the Ayodhya Ram Temple Pranpratishtha ceremony that will be held tomorrow.
He says, "This has been a long-cherished dream of the people and after 500 years, it is finally coming into reality, we… pic.twitter.com/JEY4QnO6qn
— ANI (@ANI) January 21, 2024