Ram Mandir: కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు దేశం మొత్తం రామనామంతో నిండిపోయింది. హిందువులు, రామభక్తుల శతాబ్ధాల కోరిక రేపటితో నెరవేవబోతోంది. రేపు(జనవరి22)న అయోధ్యలో భవ్య రామమందిర ప్రారంభోత్సం జరగబోతోంది. రామ్ లల్లా ప్రాణ ప్రతిష్టతో ఆలయ ప్రారంభం జరగనుంది. ఈ నేపథ్యంలో దేశంలోని అన్ని ప్రాంతాల్లో పండగ వాతావరణం నెలకొంది.
Read Also: Ayodhya Ram Temple: ‘‘నేను దావూద్ అనుచరుడిని అయోధ్య రామాలయాన్ని పేల్చేస్తా’’.. వ్యక్తి అరెస్ట్..
ఇదిలా ఉంటే రామ మందిర నిర్మాణంలో దేశంలోని అన్ని రాష్ట్రాలు ఏదో విధంగా తోడ్పాటునందించాయి. ఆలయంలో వాడిన మక్రానా పాలరాయి రాజస్థాన్ రాష్ట్రం నుంచి రాగా.. దేవతల శిల్పాలను చెక్కెందుకు ఉపయోగించి చార్మౌతి ఇసుక రాయి కర్నాటక నుంచి వచ్చింది. రాజస్థాన్ బన్సీ పహార్‌పూర్ నుంచి పింక్ ఇసుక రాయితో ప్రవేశద్వారం వద్ద బొమ్మలను చెక్కారు.
గుజరాత్ నుంచి 2100 కిలోల అష్టధాతు గంట గిఫ్ట్‌గా వచ్చింది. గుజరాత్ ఆల్ ఇండియా దర్బార్ సమాజ్ రూపొందించిన డోలుని మోసుకెళ్లే 700 కిలోల రథాన్ని అందించింది. అన్నింటి కన్నా ముఖ్యంగా రామ్ లల్లా విగ్రహం చెక్కెందుకు ఉపయోగించిన నల్లరాయి కర్ణాటక నుంచి వచ్చింది. అరుణాచల్ ప్రదేశ్, త్రిపుర నుంచి చక్కని శిల్పాలను చెక్కిన చెక్క తలుపులతో పాటు చేతితో తయారుచేసిన దస్తులు రామాలయానికి అందాయి. పాలీష్ చేసిన టేక్‌వుడ్ మహారాష్ట్ర నుంచి, బ్రాస్ వేర్ ఉత్తర్ ప్రదేశ్ నుంచి రామాలయానికి అందాయి. వేలమంది ప్రతిభా వంతులైన హస్తకళాకారులు తమ మనసును, భక్తిని కేంద్రీకరించి రామ మందిర కోసం అనేక వస్తువులను పంపించారు.