Ayodhya Ram Mandir : అయోధ్యలో రామమందిర ప్రాణ ప్రతిష్ఠ సోమవారం దివ్య ముహూర్తంలో జరగనుంది. అయోధ్యలో దేవుడు ఆశీసుడైన వెంటనే యూపీలో కాసుల వర్షం కురవనుంది. దీంతో ఆ రాష్ట్రంలో కుబేరులు తయారుకానున్నారు. ఎలా అంటూ ఆశ్చర్యపోతున్నారా.. రామాలయం కారణంగా దేశంలో పర్యాటకం మరింత పెరుగుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో ప్రభుత్వ ఖజానా డబ్బులతో నిండిపోతుంది. ఈ విషయాలపై SBI ఒక నివేదిక విడుదల చేసింది. ఇందులో రామమందిరం తర్వాత ఆ రాష్ట్ర ఆదాయం ఎంత పెరుగుతుందో లెక్కలు కట్టింది. అలాగే, దేశంలోని పర్యాటక రంగంలో ఎంత వృద్ధి సాధిస్తుంది… దీని వల్ల యూపీ, దేశ ఆర్థిక వ్యవస్థ ఎంత వరకు లాభపడుతుందో ఆ నివేదికలో పేర్కొంది.
అయోధ్యలో రామ మందిరం కారణంగా పర్యాటక రంగం ఊపంందుకుని 2025 ఆర్థిక సంవత్సరం నాటికి యూపీకు ఏటా రూ.20 నుంచి 25 వేల కోట్ల అదనపు ఆదాయం వస్తుందని ఎస్‌బీఐ పరిశోధకుల నివేదికలో పేర్కొన్నారు. యుపి ప్రభుత్వ బడ్జెట్ ప్రకారం.. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర పన్నుల ఆదాయం రూ. 2.5 లక్షల కోట్లకు చేరుకుంటుంది. రాష్ట్రంలోని పర్యాటకుల ఖర్చు రెండేళ్ల క్రితంతో పోలిస్తే 2024 నాటికి రెట్టింపు కావచ్చు. 2022లో ఉత్తరప్రదేశ్‌ను సందర్శించిన దేశీయ పర్యాటకుల ఖర్చు రూ. 2.2 లక్షల కోట్లు. విదేశీ పర్యాటకులు చేసిన ఖర్చు రూ.10 వేల కోట్లు. కాగా, 2024 సంవత్సరం చివరినాటికి అయోధ్య రామాలయం, ప్రభుత్వ పర్యాటక రంగంపై దృష్టి సారించడం వల్ల పర్యాటకుల ఖర్చు రూ.4 లక్షల కోట్లకు పైగా ఉంటుందని ఎస్‌బిఐ రీసెర్చ్ అంచనా వేసింది.
Read Also:IND vs ENG: మరో 10 వికెట్స్.. టెస్టుల్లో చరిత్ర సృష్టించనున్న అశ్విన్!
మరోవైపు, మనం పర్యాటకుల సంఖ్య గురించి చూస్తే, దాని అన్ని రికార్డులను 2024 సంవత్సరంలో బద్దలు కొట్టవచ్చు. 2022 సంవత్సరంలో రాష్ట్రంలో దేశీయ పర్యాటకుల సంఖ్య 32 కోట్లకు పైగా ఉంది. ఇది 2021 సంవత్సరంతో పోల్చుకుంటే 200 శాతం ఎక్కువ. 2022లో విదేశీ పర్యాటకుల సంఖ్య 2.21 కోట్లు. ఇదో రికార్డు
వచ్చే ఐదేళ్లలో యూపీ ఆర్థిక గణాంకాలపై ఎస్‌బీఐ నివేదిక భారీ అంచనాలు వేసింది. 2028 నాటికి దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణం 5 ట్రిలియన్ డాలర్లకు చేరుకుంటుంది. ఈ ఏడాదిలోనే ఉత్తరప్రదేశ్ జీడీపీ 50 బిలియన్ డాలర్లు దాటనుంది. విశేషమేమిటంటే 2028 నాటికి భారత ఆర్థిక వ్యవస్థలో ఉత్తరప్రదేశ్ జీడీపీ వాటా రెండోస్థానానికి చేరుకుంటుంది. అలాగే, యుపి జిడిపి పరిమాణం యూరోపియన్ దేశం నార్వే కంటే కూడా పెద్దగా ఉంటుంది. నివేదిక ప్రకారం, ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో యుపి జిడిపి రూ. 24.4 లక్షల కోట్లు అంటే 298 బిలియన్ డాలర్లుగా అంచనా వేశారు.
Read Also:Pawan Kalyan: క్షేత్రస్థాయి పర్యటనకు పవన్ సిద్ధం.. రోజుకు మూడు సభల్లో పాల్గొననున్న పవన్