Ayodhya Ram mandir: అయోధ్యలో పటిష్టమైన బందోబస్తు.. 10 వేల సీసీ కెమెరాలతో నిఘా
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ram mandir: ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని అయోధ్య నగరంలో జై శ్రీరామ్ అనే నినాదాలతో హోరెత్తిపోతుంది. అయితే, బాలరాముని ప్రాణ ప్రతిష్ట మహోత్సవం కోసం అయోధ్యకు ప్రపంచం నలుమూలల నుంచి ప్రముఖులు, భక్తులు భారీ ఎత్తున విచ్చేస్తున్నారు. రాజకీయ నాయకులు, క్రీడాకారులు, సినిమా రంగం, వ్యాపార రంగానికి చెందిన ప్రముఖులకు శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ ఆహ్వానం పంపించింది. ఈ నేపథ్యంలో అయోధ్య నగరమంతటా పోలీసులు పటిష్టమైన పహారా ఏర్పాటు చేశారు. ప్రాణ ప్రతిష్ట వేదిక దగ్గర, మందిరం చుట్టూ, మందిరానికి వంద మీటర్ల దూరంలో నలువైపులా పోలీసు అధికారులు, సిబ్బంది మఫ్టీలో గస్తీ కాస్తున్నారు. అలాగే, ఆలయం చుట్టూ కృత్రిమ మేథ(ఏఐ) ఆధారిత సీసీ కెమెరాలు సైతం ఏర్పాటు చేశారు.
Read Also: EeshaRebba : పొట్టి గౌనులో అదిరిపోయే పోజులిచ్చిన ఈషా రెబ్బా..
Also Read
- OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
- OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
- Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
- UP: యూపీ ఎన్నికల వేళ కాల్పులు.. ప్రయాగ్రాజ్లో ఎస్పీ నేత హత్య
అలాగే, అయోధ్యలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా రామ మందిరానికు వచ్చే అన్ని ప్రధాన రహదారులను గ్రీన్ కారిడర్‌లుగా మార్చారు. రామమందిర ప్రాణ ప్రతిష్ట కోసం విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశామని ఉత్తరప్రదేశ్ లా అండ్ ఆర్డర్ స్పెషల్ డీజీ ప్రశాంత్ కుమార్ వెల్లడించారు. ఈ కార్యక్రమం జరిగే ప్రదేశంలో పటిష్టమైన పోలీసు బందోబస్తు ఉంటుంది అని పేర్కొన్నారు. ఫైజాబాద్ జిల్లా వ్యాప్తంగా దాదాపు 10 వేల సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని లాండ్ ఆర్డర్ స్పెషల్ డీజీ చెప్పారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా యాంటీ డ్రోన్ టెక్నాలజీని సైతం వినియోగిస్తున్నామని పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
OTR: చిన్నశ్రీను గోవా టూర్ ప్యాచ్ వర్కేనా? అశోక్ గజపతి రాజుతో భేటీ వెనుక అసలు కథ..
-
OTR: చిన్నారెడ్డి పెద్ద ప్లానే వేశారా..? సీక్రెట్ మీటింగ్లో ఏం మాట్లాడుకున్నారు..?
-
OTR: కొండా దంపతుల విషయమై సొంత కేడర్ లో గందరగోళం
-
Tirupati Corporation: తిరుపతి కార్పొరేషన్లో పెరిగిన వార్డులు.. 50 నుంచి 66కి పెంపు..
-
OTR: పసుపు నీళ్లు చుట్టూ తిరుగుతున్న తెలంగాణ పాలిటిక్స్
ట్రెండింగ్
-
OnePlus N6 Lite: 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో సెప్టెంబర్ 22న రానున్న అదిరిపోయే ఫోన్..!
-
Redmi Note 17 Pro: 9,000mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లే, IP66+IP68+IP69+IP69K రేటింగ్స్ తో లాంచ్.!
-
Redmi Note 17 Pro Max: 10,000mAh బ్యాటరీ, 50MP OIS కెమెరా, 1.5K AMOLED డిస్ప్లేతో లాంచ్.!
-
Jowar vs Ragi: జొన్న VS రాగి.. ఆరోగ్యానికి ఏది బెటర్?
-
iPhone 18 Pro Max vs Samsung Galaxy S26 Ultra: డిస్ప్లే, బ్యాటరీ, కెమెరా, ఫీచర్స్.. ఏది బెస్ట్ మొబైల్.?