అయోధ్యలో అపురూప రామ మందిరం ఆవిష్కృతమైంది. జయజయ ధ్వానాల మధ్య బాలరాముడు ఆలయంలో కొలువుదీరారు. ప్రధాని మోడీ చేతుల మీదుగా అభిజిత్ లఘ్నంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం వైభవంగా కొనసాగింది. కాగా.. రామమందిర ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన బీజేపీ సీనియర్ నేతలు ఉమాభారతి, సాధ్వి రితంభరరు రామ మందిర ప్రాంగణంలో కలుసుకున్నారు. అంతేకాదు.. మందిర ప్రాంగణంలోకి అడుగుపెట్టగానే భావోద్వేగానికి గురయ్యారు. తమ కల నిజమైందని భావోద్వేగంతో కౌగిలించుకున్నారు. కాగా.. వారు భావోద్వేగానికి లోనైన ఫొటోలు సోషల్…
PM Modi: అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం కన్నులపండుగగా జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా "రామ్ లల్లా" విగ్రహ ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి హాజరయ్యారు. దేశవ్యాప్తంగా వీవీఐపీలు, సాధువులు, సాధారణ భక్తులు ఈ కార్యక్రమానికి వచ్చారు. రామ మందిర ప్రారంభం తర్వాత ప్రధాని నరేంద్రమోడీ భావోద్వేగ ప్రసంగం చేశారు. ఇకపై రామ్ లల్లా టెంట్‌లో ఉండరని, గొప్ప ఆలయంలో ఉంటారని అన్నారు.
అయోధ్యలోని రామ్‌లల్లా విగ్రహానికి ప్రాణ ప్రతిష్ఠ అంగరంగ వైభవంగా జరిగింది. ఈ మహోత్సవానికి దేశ నలుమూలల నుంచి వేలాది మంది ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య కీలక వ్యాఖ్యలు చేశారు. "మేము గాంధీ రాముడిని పూజిస్తాము, బీజేపీకి చెందిన రాముడిని కాదు" అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
500 సంవత్సరాల హిందువుల కల నెరవేరిందని అన్నారు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్. అన్ని దారులూ రామ మందిరం వైపే చూపిస్తున్నాయని తెలిపారు. మనం త్రేతాయుగంలోకి వచ్చినట్లుంది.. ఈ క్షణం కోసం 500 ఏళ్లుగా ఎదురు చూశామని ఆయన చెప్పారు. ప్రాణ ప్రాతిష్ఠకు హాజరైన వారి జీవితం ధన్యమైందని పేర్కొన్నారు. అనుకున్న చోటే రామాలయం నిర్మించాం.. అయోధ్యకు పూర్వ వైభవం వచ్చిందని సీఎం యోగి తెలిపారు. బాలరాముడి రూపాన్ని చెక్కిన శిల్పి జీవితం ధన్యమైందని అన్నారు.
Ayodhya Ram Temple: దాదాపు 500 ఏళ్ల హిందువుల కల నేటితో తీరింది. అయోధ్యలో భవ్య రామ మందిరం ప్రారంభోత్సవం అట్టహాసంగా జరిగింది. ప్రధాని నరేంద్రమోడీ ముఖ్య అతిథిగా దేశంలోని అతిరథులు, లక్షల మంది ప్రజలు హాజరవ్వగా.. రామ్ లల్లా విగ్రహ ప్రాణ ప్రతిష్ట జరిగింది. దాదాపుగా 400 స్తంభాలు, 44 తలుపులతో అయోధ్య రామ మందిరం నిర్మితమైంది. దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్తలు, సినీ, స్పోర్స్ట్ సెలబ్రెటీలు, ఇతర రంగాల్లో ప్రముఖులు, సాధువులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.…
శ్రీరామచంద్రమూర్తికి జై అంటూ ప్రధాని ప్రసంగం ప్రారంభించారు. ఎన్నో ఏళ్లుగా నిరిక్షిస్తున్న రాముడు వచ్చేశాడు.. ఈ క్షణం ఎంతో ప్రత్యేకమన్నారు. మన రామ్లల్లా ఇప్పటి నుంచి టెంట్ లో ఉండడు.. దివ్యమందిరంలో ఉంటాడు.. మీ అందరి ఆశీస్సుల వల్లే జరిగిందని మోడీ తెలిపారు. ఎన్నో ఏళ్ల పోరాటాలు, బలిదానాలు, నిష్ట తర్వాత అద్భుత ఘట్టం ఆవిష్కృతమైందని తెలిపారు. ఇది సామాన్యమైన సమయం కాదు.. కాలచక్రంలో ఎప్పటికి నిలిచిపోయే అద్భుత సమయమని పేర్కొన్నారు. ఎక్కడ రాముడి కార్యక్రమం జరుగుతుందో..…
Ayodhya Ram Mandir : అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవం, రాంలాలా పవిత్రోత్సవ శుభ సమయం ఆసన్నమైంది. రాంలాలా జీవితం సోమవారం (22 జనవరి 2024) మధ్యాహ్నం 12.30 నుండి 1 గంటల మధ్య పవిత్రం చేయబడుతుంది.
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందనే వివక్షతోనే భద్రాచలం సీతారామచంద్రస్వామి దేవస్థానంకు అయోధ్య నుంచి ఆహ్వానం అందలేదని వి.హనుమంతరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.