'బ్రహ్మాస్త్ర' మూవీ దర్శకుడు అయాన్ ముఖర్జీ ఆ సినిమా తదుపరి రెండు, మూడు భాగాలపై వివరణ ఇచ్చాడు. ఈ సినిమాపై ప్రేక్షకులకు ఉన్న అంచనాలను రీచ్ కావాలంటే మరికొంత సమయం పడుతుందని చెబుతున్నాడు.
బాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ ప్రెస్టీజియస్ సినిమాల్లో బ్రహ్మస్త్ర ఒకటి. రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫాక్స్ స్టార్ స్టూడియోస్-ధర్మ ప్రొడక్షన్స్- ప్రైమ్ ఫోకస్.. స్టార్ లైట్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబచ్చన్ తో పాటు ఎంతోమంది స్టార్లు నటిస్తున్నారు. పాన ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 9…