ప్రస్తుతం చిత్ర పరిశ్రమలో పాన్ ఇండియా సినిమాలు హవా నడుస్తున్న విషయం విదితమే. ఇక బాలీవుడ్ లో ప్రతి ఒక్కరు ఎదురుచూస్తున్న సినిమా బ్రహ్మాస్త్ర. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా కనిపిస్తున్న ఈ చిత్రం సెప్టెంబర్ 9 న ప్రేక్షకుల ముందుకు రానుంది. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో స్టార్ హీరోలు అమితాబ్ బచ్చన్, నాగార్జున, హీరోయిన్ మౌని రాయ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ఇక రెండు భాగాలుగా రిలీజ్ అవుతున్న బ్రహ్మాస్త్ర మొదటి భాగం శివ గురించి అయాన్ ముఖర్జీ ఒక వీడియో ద్వారా చెప్పుకొచ్చాడు. అసలు బ్రహ్మస్త్ర అంటే ఏంటి..? అనేదాన్ని గురించి అయాన్ ఈ వీడియోలో చెప్పుకొచ్చాడు.
పురాతన కాలంలో ఋషులందరు శివుని కోసం తపస్సు చేస్తుండగా బ్రహ్మస్త్ర అనే వెలుగు భూమి మీదకు వచ్చింది. అక్కడ ఉన్న ఒకొక్కరికి ఒక్కో శక్తిని ఇచ్చింది. అవే .. వానరాస్త్ర, నంది అస్త్ర, ప్రభాస్త్ర, జలాస్త్ర, పవనాస్త్ర, మరియు బ్రహ్మాస్త్ర. వీటిని కాపాడానికి అప్పటి నుంచి ఇప్పటివరకు బ్రహ్మర్ష అనే సంఘం సమాజంలో సీక్రెట్ గా నివసిస్తూ బ్రహ్మస్త్రకు ప్రాబ్లెమ్ వస్తే బయటికి వస్తారు. ఇక ఇందులో ప్రతి ఒక్కరికి ఒక శక్తి ఒక ఆయుధం ద్వారా ఉంటుంది.. కానీ శివ.. అతడే ఒక అస్త్రం. అతడి నుంచి వచ్చే శక్తి అందరికంటే ఎక్కువగా ఉంటుంది. బ్రహ్మస్త్ర పొందడానికి దుష్ట శక్తులు పోరాడితే.. సకల అస్త్రాలన్నీ ఎలా తిరిగి పోరాటం చేశాయి. బ్రహ్మస్త్ర కోసం శివ చేసిన పోరాటం ఏంటి..? అనేది ఈ కథ అని తెలుస్తోంది. ప్రస్తుతం బ్రహ్మస్త్ర కాన్సెప్ట్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమా ప్రేక్షకులను ఎలా మెప్పిస్తుందో చూడాలి.