Ranbir Kapoor: బాలీవుడ్ స్టార్ కపుల్ రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా ఆయన ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం బ్రహ్మాస్త్ర. అమితాబ్ బచ్చన్, నాగార్జున, మౌని రాయ్ కీలక పాత్రలో నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 9 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మిక్స్డ్ టాక్ అందుకున్న ఈ సినిమా కలక్షన్స్ అందుకోలేకపోయింది. ఇక దాదాపు నెల తరువాత ఈ సినిమా ఓటిటీ డేట్ ఫిక్స్ చేసుకుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో నవంబర్ 4 న ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. ఇక ఈ నేపథ్యంలోనే మరోసారి చిత్ర బృందం ప్రమోషన్స్ మొదలుపెట్టింది. ఇందులో భాగంగా రణబీర్ కపూర్ సినిమా ప్రమోషన్స్ పై ఫ్రస్టేట్ అవుతున్నట్లు ఒక వీడియోను షేర్ చేశాడు.
“బ్రహ్మాస్త్ర ప్రమోషన్స్ కు రావాలని ఫోన్ లో ఎవరో అడుగుతుంటే.. మళ్లీ ప్రమోషన్సా..? నా వాళ్ళ కాదు.. దీనివలన నేను విసిగిపోయాను. అలియాకు శివ శివ అని అరిచి అరిచి గొంతు పోయింది. లైట్ వస్తుంది.. లైట్ వస్తుంది అని చెప్పుకుంటూ తిరిగాం,.. ఇప్పుడు ఇంటింటికి తిరిగి బ్రహ్మాస్త్ర హోస్ట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది అని చెప్పాలా..? నాకు బ్రహ్మాస్త్రనే జీవితమా..వేరే పండుగలు ఉండవా..? నేను రాను.. ఆ అయాన్ నన్ను పండుగ చేసుకోనివ్వడా..? అంటూ రెచ్చిపోయాడు. అంతలో అయాన్ ఫోన్ చేయగానే.. అయాన్ .. ప్రమోషన్సా..? ఓకే.. చేద్దాం అని చెప్పి తలగడతో తలా బాదుకున్నాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.