బాలీవుడ్ లో ప్రస్తుతం మోస్ట్ ప్రెస్టీజియస్ సినిమాల్లో బ్రహ్మస్త్ర ఒకటి. రణబీర్ కపూర్, అలియా భట్ జంటగా ఆయాన్ ముఖర్జీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫాక్స్ స్టార్ స్టూడియోస్-ధర్మ ప్రొడక్షన్స్- ప్రైమ్ ఫోకస్.. స్టార్ లైట్ పిక్చర్స్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమాలో టాలీవుడ్ కింగ్ నాగార్జున, బాలీవుడ్ లెజెండరీ నటుడు అమితాబచ్చన్ తో పాటు ఎంతోమంది స్టార్లు నటిస్తున్నారు. పాన ఇండియా లెవెల్లో తెరకెక్కుతున్న ఈ సినిమా సెప్టెంబర్ 9 న విడుదల కానుంది. ఇక ఇప్పటికే ఈచిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఇక తాజాగా నేడు శ్రీరామనవమి పండగను పురస్కరించుకొని మరో కొత్త పోస్టర్ ని రిలీజ్ చేశారు. ఈ చిత్రంలో శివ గా రణబీర్ కపూర్ నటిస్తుండగా.. సకల అస్త్రాలకు దేవత ఇషాగా అలియా కనిపిస్తుంది. ఇక ఈ పోస్టర్ లో వీరిద్దరూ ప్రేమ విరహంతో తపిస్తునట్లు ఒకరినొకరు హత్తుకొని కనిపించారు. చుట్టూ మండుతున్న అగ్నిగోళాల మధ్య ఈ జంట రొమాంటిక్ ఫోజ్ ఆకట్టుకుంటుంది. అంతేకాకుండా ఇద్దరికీ గాయాలు కావడం చూస్తుంటే.. ఇద్దరు ప్రేమ కోసం పోరాటం చేసారా..? లేక పోరాటం చేసాక కలిసారా..? అనేది తెలియాల్సి ఉంది. ఈ పోస్టర్ తో ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. మరి ఈ సినిమా ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.